Devotional

మార్చి 25 నుండి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు

Bhadrachalam Brahmotsavam From March 25th-Telugu Devotional News

1.మార్చి 25 నుండి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు – ఆద్యాత్మిక వార్త్గాలు – 29/2/2020
భద్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈనెల 2న శ్రీస్వామి తిరుకల్యనం మహోత్సవం మరియు 3న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను వీక్షించదలచిన వారు భక్తుల సౌకర్యార్ధం రూ. 5000, 2000, 1116, 200, 100 విలువ గల సెక్టారు టికెట్లు దీ. 1.3.2020 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.
2.5 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి నెలలో నిర్వహించే విశేష ఉత్సవాల తేదీలను తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు, 5న కులశేఖర ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 9న కుమారధార తీర్థ ముక్కోటి, 10న లక్ష్మీజయంతి, 21న అన్నమాచార్య వర్థంతి, 25న ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు తెలిపింది.
3.యాదాద్రిలో అలంకార సంబరాలు ఆరంభం
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అలంకార సంబరాలు ఆరంభమయ్యాయి. ఉదయం వేద పారాయణ పఠనాలు, అలంకార సేవోత్సవం, రాత్రి వాహనోత్సవాల నిర్వహణకు తెరతీశారు. ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్న దశలో నారసింహుడిని మత్స్యాలంకారంతో తీర్చిదిద్ది సేవోత్సవాన్ని చేపట్టారు. మహావిష్ణువు దాల్చిన దశావతారాల్లో తొలిగా మత్స్య రూపంలో లోకోర్ధరణ గావించిన విశిష్టతను ఆచార్యులు వివరించారు. రాత్రివేళ శేషవాహనంపై స్వామి అలంకృతుడై విహరించారు.
4.పల్లెపల్లెకూ హైందవ ధర్మ ప్రచారం
హెచ్డీపీపీ సమీక్షలో తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి
తితిదే ఆధ్వర్యంలోని హింధూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ), సమరసత సేవా ఫౌండేషన్తో కలిసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామగ్రామాన సనాతన హైందవ ధర్మాన్ని ప్రచారం చేయాలని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 300 మండలాల్లో ఒక్కోమండలం నుంచి 15గ్రామాలను ఎంచుకోవాలి. ఆయా గ్రామాల్లోని 4 వేల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధర్మోరక్షతి రక్షితః! స్టిక్కర్లు, శ్రీవేంకటేశ్వర స్వామివారి ఫొటోలు, కంకణాలు, హిందూ ధార్మిక సాహిత్యాన్ని అందించాలి. సమరసతా సేవా ఫౌండేషన్ నిర్వహించే బాలవికాస కేంద్రాలకు పుస్తక ప్రసాదంగా ఆధ్యాత్మిక పుస్తకాలను అందించాలి’ అని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీలు, ఆవాసాల్లో ఒక్కోఆలయానికి రూ.10లక్షలు వెచ్చిస్తూ..మరో 500 దేవాలయాలను నిర్మించాలన్నారు. హిందూ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో నిర్వహించే హిందూ ఆత్మగౌరవ యాత్రకు, ఏప్రిల్ 11న నిర్వహించే గీతా యజ్ఞానికి రూ.10లక్షలు మంజూరు చేశామన్నారు. తిరుమల శ్రీనివాసుడి సోదరి అయిన తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా రూ.25లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
5.తితిదేకు ఎన్హెచ్ఏఐ నామం’
తిరుమల తిరుపతి దేవస్థానం భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తితిదేకు రూ.100 కోట్ల నష్టం చేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు, రాయలసీమ హక్కుల పోరాట సమితి(రాహపోస) కన్వీనర్ పి.నవీన్కుమార్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి- చంద్రగిరి మార్గంలోని ఎస్వీ డైయిరీఫాం వద్ద తితిదేకు చెందిన 6.45 ఎకరాల భూమిని ఎన్హెచ్ఏఐ రైల్వే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం కోసం సేకరించిందన్నారు. నిబంధనల మేరకు తితిదేకు సంబంధించిన భూమిని సేకరిస్తే 100రెట్లు అధికంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అందుకు విరుద్ధంగా 2018లో కేవలం రూ.15 కోట్లు ప్రకటించి ఇప్పటివరకు ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు.అదే డైయిరీఫాం పక్కన ఇతరులకు చదరపు గజానికి రూ.24 వేలు కేటాయించారని తెలిపారు.
6. పంచాంగము 29.02.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: శుక్ల
తిథి: షష్ఠి పూర్తి
వారం: శనివారం (మంద వాసరే)
నక్షత్రం: భరణి రా.తె.03:39 వరకు
తదుపరి కృత్తిక
యోగం: బ్రహ్మ ప.12:05 వరకు
తదుపరి ఐంద్ర
కరణం: బాలవ 09:08 వరకు
తదుపరి తైతుల
వర్జ్యం: ఉ.11:51 – 01:36
దుర్ముహూర్తం: 06:34 – 08:04
రాహు కాలం: 09:31 – 11:00
గుళిక కాలం: 06:34 – 08:03
యమ గండం: 01:57 – 03:25
అభిజిత్ : 12:05 – 12:51
సూర్యోదయం: 06:34
సూర్యాస్తమయం: 06:22
వైదిక సూర్యోదయం: 06:38
వైదిక సూర్యాస్తమయం: 06:18
చంద్రోదయం: ఉ.10:06
చంద్రాస్తమయం: రా.10:58
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మేషం
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: తూర్పు
శ్రీ ప్రాణగోవిందలాల్ పుణ్యతిథి
మంగళగిరి లక్ష్మీనారసింహ బ్రహ్మోత్సవారంభం
శ్రీసత్యవ్రతతీర్థ పుణ్యతిథి
7. రాశిఫలం – 29/02/2020
మేషం
మేషం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం మంచిది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు పనిభారం అధికం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
వృషభం
వృషభం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం
మిథునం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం
కర్కాటకం: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. స్త్రీలకు బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
సింహం
సింహం: ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. రుణాలు, చేబదుళ్లు తప్పవు.
కన్య
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నిరుత్సాహపరుస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.
తుల
తుల: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విందులలో పరిమితి పాటించండి. అధ్యాపకులకు పురోభివృద్ధి. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా వుండటం మంచిది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి.
వృశ్చికం
వృశ్చికం: మీ కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విదేశీయానాలకై చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ సమర్థతపై అధికారులకు నమ్మకం కలుగుతుంది.
ధనస్సు
ధనస్సు: దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయ చేస్తారు.
మకరం
మకరం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల మీ పనులు వాయిదా పడతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
కుంభం
కుంభం: మీ శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు. ఇతరుల విషయాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. ఎదుటివారితో మితంగా సంభాషించడం క్షేమదాయకం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం.
మీనం
మీనం: ప్రముఖుల సాయంతో ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి నిరుత్సాహం వంటివి తప్పదు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా వుంచండి. పాత మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.
8. తిరుమల\|/సమాచారం **
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు శనివారం,
29.02.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 17C°-28C°
• నిన్న 67,638 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 06 కంపార్ట్మెంట్ లో
భక్తులు సర్వదర్శనం కోసం
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 27,045 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.02 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free
#18004254141
10. జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకున్నాను : అమిత్‌ షా
జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకున్నాను : అమిత్‌ షా భువనేశ్వర్‌ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ ఉదయం పూరిలోని శ్రీజగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జగన్నాథ స్వామికి అమిత్‌ షా ప్రత్యేక పూజలు చేశారు. పూరి ఆలయ సందర్శనపై అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. పూరి ఎంతో ప్రత్యేకమైనది. జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకున్నానని హోంమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు. అమిత్‌ షా వెంట కేంద్ర మంత్రులు ధర్మేంద ప్రధాన్‌, ప్రతాప్‌ చంద్ర సారంగి ఉన్నారు. ఈస్ట్రన్‌ జోనల్‌ కౌన్సిల్‌(ఈజడ్‌సీ) సమావేశం నిమిత్తం హోంమంత్రి అమిత్‌ షా నిన్న ఒడిశాకు చేరుకున్నారు. ఈజడ్‌సీలో బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, వెస్ట్‌ బెంగాల్‌ రాష్ర్టాలు ఉన్నాయి. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో నిన్న మధ్యాహ్నం హోంమంత్రి అమిత్‌ షా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ కలిసి భోజనం చేశారు.
11. రూ.3,309 కోట్ల బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం
2020-21 బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.3,309 కోట్ల బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. గత ఏడాది కంటే బడ్జెట్‌ అంచనాలు రూ.60 కోట్లకు పెరిగింది. హుండీ ద్వారా రూ.1,351 కోట్లు, వడ్డీల ద్వారా రూ.706 కోట్లు.. లడ్డూ విక్రయాల ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది.