Movies

మరో తెలుగు చిత్రంలో టబూ

Tabu In New Movie Produced By Nithin's Father

దాదాపు ద‌శాబ్ధం త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ బాలీవుడ్ న‌టి ట‌బు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో సుశాంత్‌కి త‌ల్లిగా న‌టించి మెప్పించింది ట‌బు. చాలా రోజుల త‌ర్వాత టబుని సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించే స‌రికి టాలీవుడ్ ప్రేక్ష‌కులు తెగ‌ మురిసిపోయారు . అయితే టబు ఇప్పుడు మ‌రో తెలుగు చిత్రానికి సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్క‌నున్న అంధాధున్ రీమేక్‌లో కీల‌క పాత్ర కోసం ట‌బుని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ముందు ఈ పాత్ర‌కి అనసూయ‌కి తీసుకోవాల‌ని భావించ‌గా, చివ‌ర‌కి ట‌బునే ఫైన‌ల్ చేసార‌ని ఇన్‌సైడ్ టాక్. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి నిర్మించ‌నున్న ఈ చిత్రం ఇటీవ‌ల ప్రారంభం కాగా, అతి త్వర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.