WorldWonders

16వేల మందితో శృంగారానికి ప్రణాళిక

This fake baab's sex plans will blow your mind away

అతడి పేరు.. వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌! పేరు ఘనమేగానీ.. అతగాడు చేసిన పనులు నీచం!! అందరు దొంగబాబాల్లాగానే.. 2020లో ప్రపంచం అంతమైపోతుందని.. తనను ఆశ్రయించినవారిని రక్షిస్తానని చెప్పుకొంటూ అమాయకులను ఆకట్టుకున్నాడు! భక్తి సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించాడు! ఆ తర్వాత.. తాను కృష్ణుడి అవతారాన్నని ప్రకటించుకొన్నాడు. తన దగ్గరకొచ్చే మూఢభక్తులను తన మాయలో పడేసి.. వారి కూతుళ్లను ఆశ్రమానికి పంపాలని కోరేవాడు! ఒక్కసారి ఆ ఆశ్రమంలో అడుగుపెడితే అంతే!! అమ్మానాన్నలను చూడ్డానికి కూడా వారికి అవకాశం ఉండదు.నమ్మి పంపిన కూతుర్ని చూడ్డానికి ఆ తల్లిదండ్రులు గంటలకొద్దీ వేచి చూడాల్సిందే! దేశవ్యాప్తంగా ఈ ఆశ్రమానికి అనేక కేంద్రాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే ఐదు కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. అతడు ఏ ఆశ్రమానికి వెళ్తే ఆ ఆశ్రమంలో ఆ రోజు రాత్రి అతడికి ‘గుప్త ప్రసాదం’ పేరుతో 8 నుంచి 10 మంది అమ్మాయిలను ఏర్పాటు చేయాలని.. ఆ రాత్రి అతడితో గడిపిన అమ్మాయిలను మర్నాటి నుంచి అతడి రాణులుగా పిలుస్తారని ఆశ్రమం నుంచి బయటపడ్డ అమ్మాయిలు చెబుతున్నారు. 2017 జూన్‌లో ఒక యువతి తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో వీరేంద్ర దేవ్‌ లీలలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు.. పోలీసులు, న్యాయవాదులతో ఏర్పాటైన ఒక బృందం అతగాడి ఆశ్రమంపై దాడి చేసి తనిఖీలు నిర్వహించి 67 మంది బాలికలను విడిపించింది. ఆ ఆశ్రమంలో మహిళలు, యువతులను ఇరుకిరుకు గదుల్లో జంతువుల్లా బందీలుగా ఉంచుతున్నారని కోర్టుకు తెలిపింది.వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌ తొలినాళ్లలో.. తాను బ్రహ్మకుమారి సంస్థ వ్యవస్థాపకులు లేఖ్‌రాజ్‌ కృపలానీ స్ఫూర్తితో ఆధ్మాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నానని, ఆయన ఆత్మ తనలో ప్రవేశించిందని చెప్పుకొనేవాడు. కానీ.. బ్రహ్మకుమారి సంస్థ అతడిప్రచారాన్ని ఖండించింది. అతడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఆ తర్వాత ‘ఆధ్మాత్మిక ఐశ్వర్య విశ్వవిద్యాలయ్‌’ పేరిటఢిల్లీలో ఆశ్రమాన్ని స్థాపించాడు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విశ్వ అనే పదాన్ని తీసేశాడు. కృష్ణుడిలా 16 వేల మంది గోపికలను ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతో అతడు పనిచేస్తున్నాడని.. ఈ క్రమంలోనే భక్తి పేరిట యువతులకు వల వేస్తున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. వీరేంద్ర దేవ్‌పై కేసులను ఢిల్లీ పోలీసులు సీబీఐకి బదలాయించారు. 2018 జనవరిలో వీరేంద్ర దేవ్‌ దీక్షిత్‌ అక్రమాలపై సీబీఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. అయితే, అప్పటికే అతడు పరారైపోయాడు. అతడిపై రెండుసార్లు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇంటర్‌పోల్‌ బ్లూనోటిస్‌ జారీ చేసింది. రెండేళ్లుగా వీరేంద్ర దేవ్‌ పరారీలో ఉన్నా.. అతడి ఆశ్రమం మాత్రం ఇంకా నడుస్తుండడం.. వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోంది. కాగా, 1998లో ఒకసారి వీరేంద్రదేవ్‌ అరెస్టు అయ్యి ఆరు నెలలపాటు జైల్లో ఉండడం గమనార్హం. వీరేంద్రదేవ్‌ పరారవడానికి రెండేళ్ల ముందు.. అంటే 2015లో, నిజామాబాద్‌కు చెందిన ఒక యువతి అతగాడి ఉచ్చుకు చిక్కింది. ఆమె పేరు.. సంతోషి రూప.నిజామాబాద్‌ జిల్లాకు చెందిన దుంపల రాం రెడ్డి, మీనవతి దంపతులు కూతురు సంతోషి రూప.. అనంతపూర్‌ జేఎన్‌టీయూలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేసి ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. అక్కడ ప్రఖ్యాత యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఎంఎస్‌ పూర్తిచేశారు. నానో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తున్న ఆమె.. 2015లో అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. దాంతో ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా.. ఢిల్లీలోని వీరేంద్ర దేవ్‌ స్థాపించిన ఆధ్మాత్మిక విద్యాలయ ఆశ్రమంలో చేరినట్లు తెలిసింది. ఆమె కోసం అక్కడికి వెళ్లగా.. కేవలం తండ్రికి మాత్రమే ఆమెను కలవడానికి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఇంటికి రావాలని ఆయన ఎంత నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. తర్వాత కాలంలో పలుమార్లు తల్లితండ్రులు ఆమెను కలుసుకుని ఇంటికి రావాలని బతిమాలారు. ఈ క్రమంలో 2017లో ఒకసారి ఆమెను కలుసుకోడానికి రాం రెడ్డి వచ్చిన సమయంలో రాజస్థాన్‌కు చెందిన పలువురు అక్కడ గొడవ చేస్తుండడాన్ని గమనించారు.
*డిల్లి హైకోర్టు ఆదేశాలతో సోదాలు
మైనర్లయిన తమ కుమార్తెలను తీసుకొచ్చి ఆశ్రమంలో బందీ చేశారని ఢిల్లీ మహిళా కమిషన్‌ను, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ఆశ్రమాన్ని తనిఖీ చేసి మైనర్లకు వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు. తనిఖీల్లో ఇంజక్షన్లు, కొన్ని రకాల మందులు దొరకడం కలకలం సృష్టించింది. దాంతో రాం రెడ్డి దంపతులు మరింత ఆందోళన చెంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కేసులో ప్రతివాదులైన కేంద్రప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. వీరేంద్రపై అత్యాచారం సహా పలు కేసులు ఉన్నాయని, సీబీఐకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు. సంతోషికి మాయమాటలు చెప్పి ఆశ్రమంలో చేర్చుకున్నారని, ఆమెలాంటి యువతులు 168 మంది ఆశ్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. సంతోషి అమెరికా నుంచి వచ్చే సమయం నాటికి బ్యాంకు ఖాతాలో రూ. కోటి ఉన్నాయని, ఆ డబ్బును ఆశ్రమం కాజేసి ఉంటుందని తెలిపారు. ఆమెను ఆక్కడి నుంచి విడిపించి తల్లిదండ్రులకు అప్పగించాలని అభ్యర్థించారు.ఆశ్రమంలో చేరిన సంతోషి రూప సన్యాసిలా వ్యహరిస్తున్నారు. తల్లిదండ్రులు కలిసినప్పుడు.. ‘నేను దేవతనవుతాను. మీరంతా త్వరలో మరణిస్తారు. మళ్లీ మేం మానవ జాతిని సృష్టించి విశ్వాన్ని స్థాపిస్తాం. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి. నన్ను చూడడానికి మరోసారి రాకండి’ అంటూ ఆమె వింత మాటలు మాట్లాడుతున్నారు. తాను ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నానని, తనను ఎవరూ ఇబ్బంది పెట్టట్లేదని, తాను సంతోషంగా ఉన్నానని తల్లిందండ్రులతో చెప్పారు.
*ఆచూకీ చెప్తే 5 లక్షలు
పరారీలో ఉన్న వీరేంద్రదేవ్‌ దీక్షిత్‌ ఆచూకీ చెప్పినవారికి రూ.5 లక్షలు ఇస్తామని.. అతగాడి అక్రమాలపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రకటించింది. 011-24368657 నంబర్‌కు ఫోన్‌ చేసిగానీ, 011-24368662 నంబర్‌కు ఫాక్స్‌ ద్వారాగానీ, ఈమెయిల్‌ టఞట్టజఛ్ఛీజూఃఛిఛజీ.జౌఠి.జీుఽ ద్వారా గానీ వివరాలు పంపాలని ప్రకటించింది.