Fashion

పెదవులపై జెల్లీ దాల్చిన చెక్క రాస్తే….

Cinnamon For Lips

దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండిఒక సుగంధ ద్రవ్యంగా మనకు తెలుసు. దాల్చినచెక్క చెట్టు బెరడు. చక్కని సుగంధాన్నికలిగి, రుచికి కొంచెం వగరు, మంట, తీపి కలసి ఉంటుంది. దీనిని ఎక్కువగామసాలా దినుసుగానే ఉపయోగిస్తాం. దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు, ఫ్లావనాయిడ్స్‌, యాంటీఇన్ఫ్లమేటరీలక్షణాలు ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే శక్తీ ఉంది.దాల్చినచెక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.దాల్చినచెక్కతో చేసినటీ తాగటం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.కీళ్ళ నొప్పులూ తగ్గుతాయి.దాల్చినచెక్క శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. గ్లాసుడుగోరువెచ్చని నీటిలో ఒక నిమ్మచెక్క రసాన్ని పిండి, అందులో స్పూన్‌ తేనె, స్పూన్‌ దాల్చినచెక్క పొడిని కలిపి పరగడుపున తీసుకోవాలి.నిత్యంస్పూన్‌ దాల్చినచెక్క పొడిని తీసుకుంటుంటే మధుమేహం తగ్గుతుంది.దాల్చినచెక్కలోపాలిఫినాల్స్‌ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిపెరుగుతుంది.దాల్చినచెక్క రక్తప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటును అదుపులో ంచుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.రెండు చుక్కల దాల్చిన నూనెను అరకప్పుగోరువెచ్చని నీటిలో వేసి, పుక్కిలిస్తే దంత సమస్యలు, చిగుళ్ళ వ్యాధులను, నోటి పుండ్లునివారింపబడతాయి. దీనిని మౌత్‌ ఫ్రెషనర్స్‌లోనూ ఉపయోగిస్తారు. దాల్చినచెక్క నూనెనుజీర్ణాశయ వ్యాధులకు చికిత్సగా వాడతారు. మలబద్ధకాన్నీ, గ్యాస్‌ సమస్యలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.విరేచనాలతో బాధపడేవారుదాల్చినచెక్కతో చేసిన టీ తాగితే బ్యాక్టీరియా చనిపోయి, అజీర్ణం తగ్గి, ఆరోగ్యంబాగుపడుతుంది. దాల్చిన చెక్కలోని సినామల్డీహైడ్‌ అనే పదార్థం శరీరంలో క్యాన్సర్‌కణాలను తొలగిస్తుంది. ఇది ఎర్ర రక్తకణములలోని ఎంజైమ్స్‌ను ప్రేరేపిస్తుంది.దాల్చినచెక్కనూనెను ఫేస్‌మాస్క్‌, స్క్రబ్‌, మొటిమల నివారణకు, చర్మ వ్యాధులకుఉపయోగిస్తున్నారు.తేనె, దాల్చినచెక్క పొడిని కలిపిన ఫేస్‌ప్యాక్‌ ముఖానికి పట్టించి, పది నిమిషాలుంచి నీటితో కడగాలి.చర్మంలో కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా, తేమగా, కాంతివంతంగా మార్చుతుంది.చర్మం పైవచ్చే తామర, ఎగ్జిమా వంటి ఇన్ఫెక్షన్లనుతగ్గించడానికీ దాల్చినచెక్క, తేనెల మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.పెదవులపై పెట్రోలియంజెల్లీ రాసి, దానిపై దాల్చినచెక్క పొడినిఅద్దండి. ఎర్రని నిండైన పెదాలు మీ సొంతం!యు ఎస్‌ నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ చేసిన అధ్యయనం ద్వారా తెలిసినవివరాలివి. మరి దాల్చినచెక్కను వాడి ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకుందామా!