NRI-NRT

డెట్రాయిట్‌లో తానా CPR

TANA Detroit Team Conducts CPR In Novi

డెట్రాయిట్ తానా ఆధ్వర్యంలో నోవై అగ్నిమాపక దళంతో కలిసి CPR ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా కేర్స్ అధ్యక్షుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు సమన్వయంలో నిర్వహించిన ఈ శిక్షణా సదస్సులో 40మంది ప్రవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తానా ప్రాంతీయ ప్రతినిధి దుగ్గిరాల కిరణ్, సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పంత్ర సునీల్, తానా మాజీ అధ్యక్షులు డా.బండ్ల హనుమయ్య, నాదెళ్ల గంగాధర్, తానా ఫౌండేషన్ అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, తానా ఫౌండేషన్ ట్రస్టీ యార్లగడ్డ శివరాం, రాం ప్రసాద్, ఉమా వొమ్మి, DTA అధ్యక్షుడు ద్వారకా ప్రసాద్, సాంస్కృతిక కార్యదర్శి మనోజ్, యాదం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.