DailyDose

ఢిల్లీ అల్లర్లకు భాజపా నేతల మార్గనిర్దేశం-నేరవార్తలు

BJP Leaders Provoking Religious Riots-Telugu Crime News

* ఢిల్లీ అల్లర్లకు సంబంధించి  ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగినవి మతపరమైన అల్లర్లు కాదనీ.. ముందస్తు ప్రణాళికతో చేసిన మరణకాండ అని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ఘర్షణల్లో మృతిచెందిన అమాయక ప్రజల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో పాటు బీజేపీకి పలువురు నేతలు ప్రజలను చంపడానికి రెచ్చగొట్టారని మండిపడ్డారు. వారు స్వయంగా ఈ ప్రకటనలు చేశారా అని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకే బీజేపీ నేతలు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.ఈ మొత్తం ఘర్షణలకు ప్రభుత్వం సహకరించిందని అసదుద్దీన్‌ ఆరోపించారు.  జాతీయ గీతం పాడాల్సిందిగా నలుగురు యువకులపై పోలీసులు ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ నలుగురిలో ఓ వ్యక్తి చనిపోయాడని చెప్పారు. ఓ మహిళను ఇంట్లోనే సజీవదహనం చేశారని, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి కూడా మరణించాడని గుర్తు చేశారు. కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 23 న అల్లర్లు చేలరెగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఘర్షణల్లో 46 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ క్రైమ్‌ బాంచ్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఈ ఘర్షణలపై విచారణ జరుపుతున్నాయి.

* నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా ఉన్న న‌లుగురి అవ‌య‌వాల‌ను దానం చేయాలంటూ వేసిన ఓ పిటిష‌న్‌ను ఇవాళ సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది.  ఓ వ్య‌క్తిని చంప‌డం వ‌ల్ల‌.. ఆ కుటుంబానికి తీర‌ని శోకాన్ని మిగులుస్తుంద‌ని, అవ‌య‌వ దానం కోసం దోషుల‌ను ముక్క‌లుగా చేయ‌డం స‌రికాదు అని, వారి ప‌ట్ల మాన‌వ క‌నిక‌రం క‌లిగి ఉండాల‌ని, అవ‌యవ దానం అనేది స్వ‌చ్ఛందంగా జ‌ర‌గాల‌ని సుప్రీంకోర్టు త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డింది.  ఉరిశిక్ష ఎదుర్కోనున్న న‌లుగురు దోషుల‌కు అవ‌య‌వాలు దానం చేసే వీలు క‌ల్పించాల‌ని మాజీ న్యాయ‌మూర్తి ఎంఎఫ్ స‌ల్దానా త‌న పిటిష‌న్‌లో కోరారు. నిందితుడు ప‌వ‌న్ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిష‌న్‌ను కూడా సుప్రీం కొట్టిపారేసింది.

* పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో ఈరోజు ఉదయం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి సుమారు 14 మందిని గాయపర్చింది.వెంటనే గ్రామస్తులు తేరుకుని పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపేశారు.గాయపడిన వారిని స్థానిక తాడిమళ్ల ఫ్ఛ్ కి తరలించి రేబిస్ వేక్సిన్లు వేసి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తాడిమళ్ళ ఫ్ఛ్ డాక్టర్ ఛ్ దివ్య మాట్లాడుతూ ఈరోజు ఉదయం సుమారు 14 మంది కుక్క కాటుకు గురై ఆసుపత్రికి వచ్చారని వారికి రేబిన్ వేక్సిన్లు వేసి, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ తరలించమని అన్నారు. ప్రజలు ఏవరు బయపడవలసిన అవసరం లేదని కుక్క కాటుకు సంబంధించిన వేక్సిన్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని,కుక్క కరిచిన వెంటనే భయపడకుండా గాయంను సబ్బుతో శుభ్రం చేసి,వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదిచాలని ఆమె అన్నారు.

* ప్రేమించి పెళ్లి చేసుకుంటానని   మోజాతీరాక  యువకుడు మోసం చేయడంతో  ఎలికలమందు  తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి  ఆస్పత్రి పాలైన సంఘటన  పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనీలో చోటు చేసుకుంది 

* ఓ వృద్ధ జంట రాజీవ్‌ రహదారిని దాటుతున్న సమయంలో కారు ఢీకొట్టడంతో భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం పాలయ్యాడు. శామీర్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, గూరండి మండలం, లోసరిపురానికి చెందిన పాటిక్‌ బాలకృష్ణ(55) ఆయన భార్య లక్ష్మితో కలిసి కొన్నాళ్ల క్రితం మేడ్చల్‌ జిల్లా కొంపల్లికి వలస వచ్చారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో బంధువులను కలిసేందుకు బస్సులో ప్రయాణమయ్యారు. బస్టాండ్‌లో దిగిన భార్యాభర్తలు తుర్కపల్లి శివాలయం కమాన్‌ వద్ద రాజీవ్‌ రహదారిని ముందుగా లక్ష్మి దాటి వెళ్లింది. వెనకాల వస్తున్న బాలకృష్ణను సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే ఆయన దుర్మరణం చెందారు. తన కళ్ల ముందే భర్త మృత్యువాత పడటంతో ఆమె రోదన పలువురిని కంట తడిపెట్టించింది.

* నగరంలోని పాతబస్తీలో సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

* కరీంనగర్‌లో గత నెల 10న దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ డేటా, హత్య జరిగిన టవర్‌లోని ఫోన్ కాల్స్ డేటా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రాధికను హత్య చేసింది బయటి వ్యక్తులు కాదని పోలీసులు నిర్ధారణకొచ్చారు. కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఆమెను హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. తాజాగా, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆమె ఇంట్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్టు సమాచారం.

* దేశ రాజధాని ఢిల్లీలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్న చాంద్ బాగ్, ముస్తఫాబాద్, బ్రజ్‌పురీ, గోకుల్‌పురీ, మౌజ్‌పురీ, జఫ్రాబాద్, ఖజూరీ ఖాస్, ష్యోపుర్, శివవిహార్, కరావల్ నగర్‌లలో గల మురుగు కాలువలు అల్లర్లకు సాక్ష్యాధారాలుగా నిలిచాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హింసాయుత ఘటనల్లో మరణించినవారి మృతదేహాలు మురుగు కాలువల్లో లభ్యం కానున్నాయని తెలుస్తోంది. అల్లరి మూకలు కొందరిని హత్య చేసి, శవాలను ఈ నాలాలలో పడేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐబీ ఉద్యోగి అంకిత్‌శర్మ మృతదేహం కూడా చాంద్‌బాగ్ నాలాలో లభ్యమయ్యింది. హింసాయుత ఘటనలు జరిగిన రాత్రి అల్లరి మూకలు పెద్దపెద్ద సంచులను తీసుకువెళుతుండటాన్ని చూశామని స్థానికులు చెబుతున్నారు.

* కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ, రైల్వే స్టేషన్ సమీపంలోని, హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కెడియా) పరిశ్రమలో, కొందరు వ్యాపారులు జంతు కళేబరాలను, చనిపోయిన పందులు వాటి కళేబరాలతో, కల్తీ నూనె, మొక్కలతో దాన తయారు చేస్తున్నారు. దీంతో వస్తున్న దుర్వాసనతో, స్థానికులు పరిశ్రమ లోకి, వెళ్లి వాళ్ళ బండారం బయట పెట్టారు.