ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ ఛానెళ్లనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్ ద్వారా ఆయన్ను 4 కోట్ల 47 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విటర్‌లో 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. మిగతా అకౌంట్లను కలుపుకుంటే మోడీని సోషల్ మీడియా ద్వారా 15 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. సామాజిక మాధ్యమాల నుంచి మోడీ ఎందుకు వైదొలుగుతున్నారో తెలియరాలేదు.
Flash:మోడీ సంచలన నిర్ణయం
Related tags :