NRI-NRT

అర్వింగ్ అగ్నిప్రమాద బాధితులకు నాట్స్ సాయం

NATS Helps February 2020 Irving Fire Accident Victims-అర్వింగ్ అగ్నిప్రమాద బాధితులకు నాట్స్ సాయం

టెక్సాస్ రాష్ట్ర అర్వింగ్‌లో 29వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) సాయం అందించింది. నాట్స్ ప్రతినిధులు బాపునూతి, రాజేంద్ర మాదాలతో తదితరులు బాధితులను కలిశారు. ఈ ప్రమాదంలో బాధితులు తమ విలువైన డాక్యుమెంట్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు కుటుంబాలతో పాటు తెలుగు విద్యార్ధులు కూడా ఇక్కడే గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు, ప్రాణహాని సంభవించలేదు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి నాట్స్ తనవంతు సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రమాద కారణాలపై విచారణ ప్రారంభమయింది. బాధితులకు అందించే సహాయ సహకారాలను పొడిగిస్తున్నామని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడిలు తెలిపారు.