WorldWonders

మరోసారి స్టే-ఇంకెప్పుడు ఉరి తీస్తారు?

Nirbhaya Hanging Postponed Again For Third Time

* నిర్భయ దోషుల ఉరి అమలుపై స్టే
* మూడోసారీ నిలిచిన మరణశిక్ష అమలు
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై పటియాల హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే కొనసాగుతుందని తెలిపింది. వాస్తవానికి రేపు ఉదయం (మార్చి 3న) నలుగురు దోషులనూ ఉరి తీయాల్సి ఉంది. తమ డెత్ వారెంట్లపై స్టే ఇవ్వా లంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన అక్షయ్ రాష్ట్రపతికి క్షమాబిక్ష అభ్యర్థన పెట్టుకోగా ఆయన తిరస్కరించారు. ఈ కేసులో మరో దోషి పవన్ గుప్తా రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనపై పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ కోర్టు దృష్టికి తెచ్చారు. క్షమాభిక్ష అభ్యర్థనపై రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న దృష్ట్యా ఉరిపై ఇస్తే ఇవ్వాలని పవన్ న్యాయవాది కోరడంతో కోర్టు స్టే విధించింది. దీంతో నలుగురి మూడోసారి వాయిదా పడినట్లు అయింది.