Devotional

తుళ్లూరు అనంతవరం వెంకన్న బ్రహ్మోత్సవాలు

Tulluru Ananthavaram Venkateswara Swamy Brahmotsavam 2020

టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 6 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 3వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.మార్చి 7వ తేదీ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వ‌ర‌కు మేష‌ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 8న రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహంచనున్నారు. మార్చి 9వ తేదీ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వ‌సంతోత్స‌వం, చక్రస్నానం, రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి.అదేవిధంగా మార్చి 10న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఉద‌యం 9 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజలసేవ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.మార్చి 25వ తేదీన ఉగాది సందర్భంగా ఉదయం 3.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. ఆలయంలో ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు ఘ‌నంగా ప్రారంభ‌మైన్నాయి. మార్చి 7, మార్చి 14, మార్చి 21వ తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.