Health

కరోనా కలకలం…TNI ప్రత్యేక కధనాలు

Corona Virus Stories Across The Globe

1.శతాబ్దానికో మహమ్మారి! – ప్రపంచాన్ని వణికించిన ప్లేగు, కలరా, ఫ్లూ
ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల శతాబ్దానికో అంటువ్యాధి ప్రబలుతుందనేది ఓ నమ్మిక. గత ఘటనలను ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇది నిజమేనని నమ్మేందుకు తగిన ఆధారాలున్నాయి. ప్రస్తుతం కోవిడ్(కరోనా వైరస్) మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు కుదిపేశాయి. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయని పరిశోధకులంటున్నారు. దీనిని బట్టి చూస్తే, స్వార్థం కోసం ఎవరైనా కావాలనే వీటిని సృష్టించి జనంపైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వ్యాధులు వస్తాయోననే భయం కలగకమానదని ‘ఏలియన్ న్యూస్’ అనే వెబ్ మీడియా పేర్కొంది.
**1720లో ప్లేగు
1720లలో యూరప్ ప్రజలను బ్యుబోనిక్ ప్లేగ్ కలవరపెట్టింది. ఫ్రాన్సులోని మర్సెయిల్స్లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. మొత్తమ్మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్ష మంది ఈ వ్యాధితో చనిపోయారు.
**1820లో కలరా
యూరప్ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్లాండ్, ఇండోనేసియా దేశాల్లో ఈ వ్యాధి కూడా లక్ష మంది ఉసురుతీసింది. కలరా బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు.
***1920లో స్పానిష్ ఫ్లూ
ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచయమైన పేరు స్పానిష్ ఫ్లూ.
100 కోట్ల మంది ఈ బారినపడగా ఒక కోటి మంది మృత్యువాతపడ్డారు. మానవ జాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన భయంకర వ్యాధి ఇది.
**2020లో కోవిడ్
స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజులు గడిచేకొద్దీ ఈ వ్యాధి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది
2. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఫలితాలు రావడంతో సర్కారు అప్రమత్తమైంది. అతన్ని గాంధీలోని ఐసోలేష్‌ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. తాజాగా, మరో ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. వారంతా ఇటలీ, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌కు వెళ్లొచ్చినట్టు తెలిసింది.ఇక కరోనా కలకలం నేపథ్యంలో వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, అధికారులు రఘునందన్‌రావు, యోగితారాణి, శాంతకుమారి, దానకిషోర్‌, లోకేష్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు చర్చించనున్నారు.
*ఇవీ కోవిడ్‌ లక్షణాలు…
జ్వరం, అలసట, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కోవిడ్‌ సాధారణ లక్షణాలు. గొంతునొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు 20% కేసులలో కనిపిస్తాయి. చైనా వైద్య ఆరోగ్యశాఖ అంచ నా ప్రకారం ఇటువంటి లక్షణాల్లో 81% కేసులు తేలికపాటివి, 14 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఉం టుంది. 5 శాతం మందికి వెంటిలేటర్‌ లేదా క్లిష్టమైన సంరక్షణ నిర్వహణ చర్యలు అవసరం. కోవిడ్‌ లక్షణాలు 2 నుంచి 14 రోజుల్లో బయటపడతాయి. శ్వాసకోశ స్రావాల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే బిందువుల ద్వారా .. కలుషితమైన వస్తువులు, దగ్గరి పరిచయాల ద్వారా పరోక్షంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
3. సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కరోనా కేసును గుర్తించామని కొణిదెల ఉపాసన వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌, వీడియోను పెట్టిన ఆమె, కరోనా వైరస్‌ పై అపోలోనే స్క్రీనింగ్‌ ప్రొటోకాల్స్‌ ను అత్యంత కచ్ఛితత్వంతో పాటిస్తున్నామని అన్నారు.సదరు పేషంట్‌ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్‌ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు
4. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఫలితాలు రావడంతో సర్కారు అప్రమత్తమైంది. అతన్ని గాంధీలోని ఐసోలేష్‌ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. తాజాగా, మరో ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. వారంతా ఇటలీ, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌కు వెళ్లొచ్చినట్టు తెలిసింది.ఇక కరోనా కలకలం నేపథ్యంలో వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, అధికారులు రఘునందన్‌రావు, యోగితారాణి, శాంతకుమారి, దానకిషోర్‌, లోకేష్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు చర్చించనున్నారు.
**ఇవీ కోవిడ్‌ లక్షణాలు…
జ్వరం, అలసట, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కోవిడ్‌ సాధారణ లక్షణాలు. గొంతునొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు 20% కేసులలో కనిపిస్తాయి. చైనా వైద్య ఆరోగ్యశాఖ అంచ నా ప్రకారం ఇటువంటి లక్షణాల్లో 81% కేసులు తేలికపాటివి, 14 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఉం టుంది. 5 శాతం మందికి వెంటిలేటర్‌ లేదా క్లిష్టమైన సంరక్షణ నిర్వహణ చర్యలు అవసరం. కోవిడ్‌ లక్షణాలు 2 నుంచి 14 రోజుల్లో బయటపడతాయి. శ్వాసకోశ స్రావాల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే బిందువుల ద్వారా .. కలుషితమైన వస్తువులు, దగ్గరి పరిచయాల ద్వారా పరోక్షంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
5. కోవిడ్‌ 19 వ్యాధితో బాధపడేవారికి గోవు మూత్రం, ఆవు పేడతో చికిత్స అందించ్చవచ్చు అని అస్సాం బిజెపి ఎమ్మెల్యే సుమన్‌ హరిప్రియ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సమయంలో బంగ్లాదేశ్‌కు అక్రమంగా గోవులను తరలిస్తున్నారన్న అంశంపై చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గన్న ఎమ్మెల్యే హరిప్రియ. గోవుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ సోకిన వారికి కూడా గోమూత్రం పనిచేస్తుందన్నారు. ఆవు పేడ ఎంత విశిష్టమైందో అందరికీ తెలిసిందేనని, గోవు మూత్రాన్ని కూడా చల్లితే, ఆ ప్రాంతాన్ని అది శుద్ధి చేస్తుందని, గోమూత్రం, ఆవుపేడలతో.. కరోనా వైరస్‌ను కూడా అదుపు చేయవచ్చు అన్న అభిప్రాయాన్ని ఆమె వినిపించారు. క్యాన్సర్‌తో పాటు ఇతర అనేక వ్యాధులకు గోవుల ద్వారా చికిత్స అందిస్తారని, గుజరాత్‌లోని ఓ ఆయుర్వేదిక్‌ హాస్పిటల్లో.. క్యాన్సర్‌ పేషెంట్లను గోవులతో గడిపేలా చేస్తారని, వారికి పేడను రుద్దుతారని, గోమూత్రం నుంచి తయారు చేసిన పంచామ్రుతాన్ని ఇస్తారని సుమన్‌ హరిప్రియ వివరించారు…
6. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ ఫలితాలు రావడంతో సర్కారు అప్రమత్తమైంది. అతన్ని గాంధీలోని ఐసోలేష్‌ వార్డులో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. తాజాగా, మరో ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆస్పత్రిలో చేరారు. వారంతా ఇటలీ, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌కు వెళ్లొచ్చినట్టు తెలిసింది.ఇక కరోనా కలకలం నేపథ్యంలో వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, అధికారులు రఘునందన్‌రావు, యోగితారాణి, శాంతకుమారి, దానకిషోర్‌, లోకేష్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు చర్చించనున్నారు.
**ఇవీ కోవిడ్‌ లక్షణాలు…
జ్వరం, అలసట, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కోవిడ్‌ సాధారణ లక్షణాలు. గొంతునొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు 20% కేసులలో కనిపిస్తాయి. చైనా వైద్య ఆరోగ్యశాఖ అంచ నా ప్రకారం ఇటువంటి లక్షణాల్లో 81% కేసులు తేలికపాటివి, 14 శాతం మందికి ఆస్పత్రి అవసరం ఉం టుంది. 5 శాతం మందికి వెంటిలేటర్‌ లేదా క్లిష్టమైన సంరక్షణ నిర్వహణ చర్యలు అవసరం. కోవిడ్‌ లక్షణాలు 2 నుంచి 14 రోజుల్లో బయటపడతాయి. శ్వాసకోశ స్రావాల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే బిందువుల ద్వారా .. కలుషితమైన వస్తువులు, దగ్గరి పరిచయాల ద్వారా పరోక్షంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
7. కరోనాకు ముందు జాగ్రత్తగా ఆయుష్‌ ఔషధాలు
గత కొన్నిరోజులుగా చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వైరస్‌ రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయుష్‌ విభాగం ఔషధాలను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం ప్రకారం హోమియోపతి మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హోమియోపతి మందులను ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ హోమియోపతి మందులను మూడు రోజుల పాటు రోజుకు ఆరు చొప్పున వేసుకోవాలి. ఏడాది లోపు చిన్నారులకు రోజుకు మూడు చొప్పున తల్లిపాలలో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని ఆయుష్‌ వైద్యులు తెలిపారు.
8. కరోనా ఎఫెక్ట్‌.. కరచాలనం చేయం: ఇంగ్లాండ్‌
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనెల 19 నుంచి శ్రీలంకతో తలపడే టెస్టు సిరీస్‌లో ఆ ఆటగాళ్లతో కరచాలనం చేయబోమని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ మంగళవారం స్పష్టం చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇంగ్లిష్‌ జట్టు అక్కడ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. పది మంది ఆటగాళ్లతో పాటు కొందరు సహాయక సిబ్బందికి సైతం అంతుచిక్కని వైరస్‌ సోకింది. అనంతరం వారు త్వరగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కోవిడ్‌-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో లంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో తాము కరచాలనం చేయమని రూట్‌ అన్నాడు.
9. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
కరోనా వైరస్‌ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమావేశం నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయితీరాజ్‌శాఖల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయాశాఖ కార్యదర్శులు, శాఖాధిపతులతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. జీహెచ్‌ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, వివిధ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
10. కొవిడ్‌తో అమెరికాలో ఆరుగురి మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19(కరోనా) వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. మృతులంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందినవారే. ఇక అమెరికాలో మొత్తం 91 మందికి వైరస్ సోకినట్లు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. వీరిలో 43 మందికి అమెరికాలోనే సోకగా.. మరో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారని తెలిపారు. అమెరికాలో తొలి మరణం శనివారం సంభవించిన విషయం తెలిసిందే. మరోవైపు కొవిడ్‌-19కు వచ్చే వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి చికిత్స అందుబాటులోకి వస్తుందని పెన్స్‌ తెలిపారు. వాక్సిన్‌ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాల్సిందేనన్నారు. ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. అమెరికాలో వేసవి జూన్‌ నుంచి ప్రారంభమవుతుంది. చైనాలో మరో 125 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గత ఆరు వారాల్లో కొత్తగా సోకిన వారి సంఖ్య ఇదే తక్కువ కావడం గమనార్హం. ఇక మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాలో కరోనా మరణాల సంఖ్య 2,943 చేరింది. దక్షిణ కొరియాలో కొత్తగా 473 మందికి కరోనా సోకింది. దీంతో బాధితుల సంఖ్య అక్కడ 4,680 దాటింది. పాకిస్థాన్‌లో కొత్తగా ఒక కేసు నమోదుకావడంతో బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. ఇటు భారత్‌లోనూ రెండు కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మన దేశంలో ఐదు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు ప్రారంభించాయి.
11. కరోనా వైరస్ పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవ్
కరోనా వైరస్ పేరుతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ గుర్తించిన నేపథ్యంలో మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు వైద్య, ఆరోగ్య శాఖ తోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ సరైన వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో వచ్చిన ఇతర వైరస్ లతో పోలిస్తే.. కరోనా వైరస్ లో మరణాల రేటు అతి తక్కువగా ఉందన్నారు. వైరస్ వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్న మంత్రులు .. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం గా ఉన్నాయన్న ఈటెల..పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్ కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే పాజిటివ్ ప్రచారం నిర్వహించాలన్నారు. ఇందుకోసం సమాచార మరియు ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని చెప్పారు. తెలుగు ,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు కరోనా వైరస్ పైన అవగాహన కల్పించే సమాచారం అందించాలి. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వైరస్ సమస్యని ఉపయోగించుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
12. శుభ్రతే వైరస్‌కు చక్కటి మందు – కరచాలనం చేయకపోవడం మేలు – కళ్లు, ముక్కు నులుముకోవద్దు
కరోనా వైరస్‌ మన గడపదాకా వచ్చిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం శ్రేయస్కరమంటున్నారు. వైరస్‌ సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య సగటున 1% మాత్రమేననీ మృతుల్లోనూ 40% మందికిపైగా రోగ నిరోధకశక్తి తక్కువున్న 60 ఏళ్లకు పైబడిన వారని చెబుతున్నారు.
****వైద్య నిపుణుల సూచనలివే
 వైరస్‌ నేరుగా మన శరీరంలోని ఏదో ఒక భాగంపై ప్రభావం చూపుతుందని చెప్పలేం. కరోనా వైరస్‌ విషం కాదు… కాబట్టి సోకినవారు తక్షణం చనిపోరు. చైనాలో చాలామంది కోలుకుంటున్నారు. ఇది ఎవరికైనా సోకితే 14 రోజుల్లోపు బయట పడుతుంది. లేదంటే ఏమీ లేదన్నట్లే లెక్క.
 కరోనా వైరస్‌ వ్యాప్తి చెందాలంటే ఏదైనా వాహకం ఉండాలి. లేకపోతే బతకలేదు. ఉదాహరణకు ఒక వస్తువుకు వైరస్‌ అంటుకుంటే… దాన్ని మరొకరు ఎవ్వరూ తాకకుంటే అది 3-5 రోజులకు చచ్చిపోతుంది. అంటే కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తి వాడిన వస్తువులను వెంటనే ఇతరులు ఉపయోగిస్తే… అది సోకడానికి అవకాశం ఉంటుంది.
 వైరస్‌ మన చేతులకు అంటుకున్నా ప్రమాదం ఉండదు. అయితే ఆ చేతులతో కళ్లు, ముక్కును నలుముకుంటే అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్‌ ప్రధానంగా శరీరంలోకి చొరబడేది కళ్లు, ముక్కు ద్వారానే. అందుకే ముక్కుకు మాస్క్‌ పెట్టుకోవడం అత్యవసరం.
 నిజానికి మనుషులను చంపే శక్తి ఈ వైరస్‌కు లేదు. అప్పటికే వారికున్న ఇతర సమస్యల కారణంగానే మరణాలు సంభవిస్తాయి. ఉదాహరణకు కరోనా సోకిన 60 ఏళ్ల వ్యక్తికి ఇప్పటికే అతిసారముంటే అది తగ్గదు. ఒకవేళ మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకుంటే ఈ వైరస్‌తో మరణం సంభవించే అవకాశమే ఉండదు.
****కరచాలనం చాలిద్దాం కరోనాను ఓడిద్దాం
శుభ్రంగా ఉంటే సుబ్బరంగా బతికేయవచ్చని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే వారు ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను సైతం ప్రజలు ‘చేతులు జోడించి’ దూరంగా నెట్టేయవచ్చని వైద్యులూ స్పష్టం చేస్తున్నారు. కరచాలనం చేయకుంటేనే మంచిదంటున్నారు. నివారణ చర్యలు, జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం అత్యంత అవసరమన్నారు. కరోనాపై భయాందోళనలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో దీని గురించిన వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిల్లీలోని పలువురు వైద్య నిపుణులతో మాట్లాడింది…
*****చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులతో వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంటుందా?
చైనా నుంచి షిప్‌మెంట్లు మన దేశానికి రావడానికి 20రోజులు పడుతుంది. అందువల్ల అక్కడి నుంచి వచ్చే వస్తువులు, సెల్‌ఫోన్ల ద్వారా ఈ వైరస్‌ విస్తరిస్తుందని చెప్పడానికి ఆధారాల్లేవు. అక్కడ వస్తువులను ఒకసారి లోడ్‌ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేంతవరకు వాటిని ఎవ్వరూ తాకే అవకాశమే ఉండదు. దిగుమతుల ద్వారా వైరస్‌ వచ్చినట్లు ఇంతవరకు ఒక్క ఆధారమూ లభించలేదు. సమాచారలోపంతోనే ఇలాంటి ప్రచారం జరుగుతోంది. దిగుమతి చేసుకొనే వస్తువుల నుంచి ఇది సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్యాకింగ్‌ సామగ్రి, పుస్తకాలు, ఇతర వస్తువుల ద్వారా ఇది విస్తరించదని స్పష్టంచేసింది. ఒకవేళ వైరస్‌ సోకిన మాంసం లాంటి జీవకణజాలం ఉన్న వస్తువులను దిగుమతి చేసుకుంటే అందులో వైరస్‌ ఉండటానికి వీలుంటుంది.
*****అధిక వేడిపై వండే మాంసంలో వైరస్‌ ఉంటుందా?
 చికెన్‌, మటన్‌లను మనం అధిక ఉష్ణోగ్రతల్లో వండుతాం. అప్పుడు వాటికి అంటుకున్న వైరస్‌ కచ్చితంగా చనిపోతుంది. అయితే వండటానికి ముందు ముక్కలుగా కోసేటప్పుడు అందులోని వైరస్‌ మన చేతులకు అంటుకుంటుంది. అవే చేతులతో మనం కళ్లు, ముక్కులను నులుముకుంటే వైరస్‌ సోకే ప్రమాదముంది.
 ఇక్కడ తినడం కంటే తాకడం వల్లనే వైరస్‌ విస్తరిస్తుంది. కరోనా వైరస్‌ విస్తరణకు ముఖమే అత్యంత అనువైంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖాన్ని చేతులతో తడుము కోవడం, తుడుచుకోవడం లాంటివి చేయకూడదు. శుభ్రమైన గుడ్డ, న్యాప్కిన్లను వాడాలి. తర్వాత వాటిని మూతలున్న చెత్తబుట్టల్లో పడేయాలి.
*****దీనికి నివారణ మార్గం ఏంటి? మన ఆర్థిక రంగంపై దీని ప్రభావం ఎంత?
ఈ వైరస్‌ నివారణకు టీకాల అభివృద్ధిపై కసరత్తు జరుగుతోంది. చైనా ఇప్పటికే ‘ఫవిలవిర్‌’ అనే మందుకు ఆమోదముద్ర వేసింది. ఈ వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. మనం బల్క్‌ డ్రగ్స్‌, ఇతర అంశాల్లో చైనాపై ఎక్కువ ఆధారపడ్డాం. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే బల్క్‌ డ్రగ్స్‌ ద్వారా వైరస్‌ విస్తరించదు. అందులోని రసాయనాల కారణంగా వైరస్‌ వృద్ధి చెందదు. ఇంట్లోని ఉప్పునకు బూజు పట్టనట్లుగానే రసాయనాలు ఉండే మందులకూ వైరస్‌ సోకదు.
*****కరోనా వైరస్‌ ఇదివరకే జంతువుల్లో ఉంది కదా? ఇప్పుడు ఎందుకింత భయాందోళనలు ప్రబలాయి?
 కరోనా కొత్తదేమీ కాదు. ఇదివరకే జంతువుల్లో కనిపించింది. ప్రస్తుతం ఇందులో జన్యుమార్పులు జరిగినట్లు అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ) చెబుతోంది. ఇందులో నిజం ఎంతుందన్నది మనకు తెలియదు. ఇప్పుడు దీన్నుంచి తప్పించుకోవాలంటే చేతులకు తొడుగులు, ముక్కుకు మాస్క్‌ ఉపయోగించడం మంచిది. దీనికి చికిత్స, టీకా లేదు.
*****ఆహారం.. ఇతర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 కరోనా వైరస్‌ను తప్పించుకోవడానికి సబ్బులు, ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌ వాడితే బాగుంటుంది. అలాంటివి లేకపోయినా కనీసం నీళ్లతో గంటలకోసారి చేతులను శుభ్రం చేసుకోవాలి.
వైరస్‌ సోకిన తిండి తిన్నా ఏమీ కాదు. ఎందుకంటే కడుపులో ఉండే ఆమ్లాలు(యాసిడ్లు) దాన్ని చంపేస్తాయి. నోట్లోంచి తీసుకొనే పదార్థాల కంటే కళ్లు, ముక్కు నులుముకోవడంతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి.
****ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించే అవకాశముందా?
మనుషులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే గాలి ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని కొందరు అంటున్నారు. గాలి ద్వారా వ్యాపించే లక్షణాలు దీనికి ఉన్నాయా? లేదా? అన్నది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే… బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండటం మేలు.
****ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
 ప్రస్తుతానికి కొన్ని రోజులు కరచాలనం చేయకపోవడమే మంచిది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ‘నమస్తే’ అంటూ చేతులు జోడించడం మేలు.
 చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు, కళ్లను, ముక్కును నులుముకోవద్దు. మాస్కులు ధరించాలి.
 ఈ విషయాలను ఎవరికివారుగా ఇతరులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలి.
13.గోమూత్రం అవుపెడతో కరోనా నయమవుతుంది అంట
కరోనా వైరస్ రాకక్సి ప్రపంచాన్ని గడగడలాదిస్తుంది. వ్యాధి బారినపడి ఇప్పటికే మూడు వేల మంది చనిపోగా 86 వేల మందికి సోకి మృత్యు ఘంటికలు మోగిస్తుంది. భారతదేశంలో కూడా రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా అసోం భాజపా నేత మాత్రం కొత్త భాష్యం చెప్పారు. వైరస్ కు మందు ఇదేనంటూ సెలవిచ్చారు.
*ఇదీ పరిష్కారం ?
అసోంలోని హజో అస్మేబ్లీ నుంచి సుమన్ హరిప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆవుపేడ పరిష్కార మార్గం అని చెప్పారు. ఇవీ తీసుకుటే వైరస్ వెళ్తుందని మళ్ళీ దరి చేరాడని కూడా చెప్పారు. ఇంతేకాదు అగ్ని ముందు దేవుళ్ళను ఆరాధిస్తే కూడా మంచి జరుగుతుందని వరిఅస్ రాదని చెప్పారు. వైరస్ ప్రబలిన చైనాలో ఆవు పేడను ఉపయోగితే అక్కడ గాలి స్వచ్చగా మారుతుందని చెప్పారు.
14. రుయా ఆస్పత్రిలో చేరిన తైవాన్ దేశస్తుడికి కోవిడ్-19 నెగిటివ్ వచ్చింది. అతడి రక్త నమూనాలను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ల్యాబ్‌కు పంపారు. అక్కడ పరీక్షల అనంతరం కరోనా లేదని నిర్థారించారు. దీంతో తైవాన్ దేశస్తుడిని ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని రుయా సూపరింటెండెంట్ ఎన్వీ రమణయ్య తెలిపారు.తైవాన్‌ కు చెందిన చెన్‌ షి షన్‌ పలమనేరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో మెషిన్‌ రిపేర్‌ కోసం చిత్తూరు జిల్లాకు వచ్చారు. అస్వస్థతకు గురవడంతో రుయాలో చేరారు. తైవాన్ వ్యక్తికి కరోనా సోకిందనే ప్రచారంతో తిరుపతి ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఆయనకు కరోనా వైరస్ సోకిందా లేదా అని తేల్చడం కోసం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపారు. నెగిటివ్ రిపోర్ట్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు…
15. క‌రోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో మ‌రో డాక్ట‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. వుహాన్ సెంట్ర‌ల్ హాస్పిట‌ల్‌లో ఆప్తామాల‌జీ శాఖ‌లో డిప్యూటీ డైర‌క్ట‌ర్‌గా చేస్తున్న మియా జాంగ్‌మింగ్ అనే డాక్ట‌ర్ ఇవాళ మ‌ర‌ణించాడు. క‌రోనాతో పోరాటం చేస్తూ ఆయ‌న ప్రాణాలు విడిచిన‌ట్లు పేర్కొన్నారు. ఆ డాక్ట‌ర్ వ‌య‌సు 57 ఏళ్లు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన డాక్ట‌ర్ లీ వెన్‌లియాంగ్‌కు స్నేహితుడే డాక్ట‌ర్ జాంగ్‌మింగ్‌. వుహాన్ సెంట్ర‌ల్ హాస్ప‌ట‌ల్లో.. క‌రోనాతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన మూడ‌వ డాక్ట‌ర్‌గా మియా నిలిచాడు. క‌రోనా నియంత్ర‌ణ కోసం వైద్య సిబ్బంది నిరంతరం శ్ర‌మిస్తున్న‌ది. ప్ర‌త్యేక మాస్క్‌ల ద్వారా పేషెంట్ల‌కు చికిత్స‌ను అందిస్తున్నారు. మ‌రో వైపు బీజింగ్‌లో కొత్త ఆదేశాలు జారీ చేశారు. కొరియా, ఇట‌లీ, ఇరాన్‌, జ‌పాన్ దేశాల నుంచి వ‌చ్చే వారికి 14 రోజుల పాటు క్వ‌రెంటైన్‌కు పంప‌నున్నారు.
16. గల్ఫ్ దేశాలనూ వణికిస్తున్న కరోనా.. సౌదీ కీలక ప్రకటన
గల్ఫ్ దేశమైన సౌదీ ఓ కీలక ప్రకటన చేసింది. దేశంలో మొట్టమొదటి కరోనా కేసును అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ నుంచి బహ్రెయిన్ మీదుగా వచ్చిన ఓ సౌదీ దేశస్తుడికి కరోనాను గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్ ఖాతాలో వివరించింది. అయితే కరోనా వ్యాధి సోకిన వ్యక్తి.. ఎప్పుడు ఇరాన్‌కు వెళ్లాడు..? తిరిగి ఎప్పుడు సౌదీకి తిరిగొచ్చాడు..? అతడి పూర్వాపరాలేమిటి..? అన్న వివరాలను మాత్రం సౌదీ వెల్లడించకపోవడం గమనార్హం. కరోనా వ్యాధి సోకిన ఆ వ్యక్తి ఎవరెవరితో కలిసి తిరిగాడు..? అన్న వివరాలను సేకరించి.. వారికి కూడా వైద్య పరీక్షలు చేసినట్లు సౌదీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధిని దేశంలోకి రానివ్వకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు సౌదీ ప్రకటించింది.. కాగా.. గల్ఫ్ దేశాల్లో కరోనా కలకలం రేపుతోంది.. ఇప్పటికే కువైట్‌లో 56, బహ్రెయిన్‌లో 49, యూఏఈలో 21, ఒమన్‌లో 6, ఖతర్‌లో 7 కేసులు నమోదయ్యాయి. తాజాగా సౌదీలో ఒక కేసు నమోదయింది.. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నిర్మూలనకు నిర్దిష్టమైన చికిత్స లేనందున కొవిడ్-19 బారినపడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలిన సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. తప్పని సరిగా మాస్కులు ధరించడంతోపాటు.. తరచూ సబ్బుతో చేతులు కనీసం 20 సెకన్లపాటు శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు.కరోనా (కొవిడ్-19) వైరస్.. చైనాలో ఉద్భవించి, ప్రపంచ నలుమూలలకు పాకింది. దీని బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 3వేలు దాటింది. దాదాపు 70 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవగా.. 90వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. చైనాలో ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం కొంతమేరకు తగ్గినప్పటికీ.. ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. మరికొంత మందికి వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భారత్‌లో కూడా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
17. ఆ దేశాల నుంచి వచ్చేవారికి వీసాలు రద్దు చేసిన కేంద్రం
ఇటలీ, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చేవారికి..భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేసింది. నూతన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటలీ, చైనా, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియ దేశాలలో..అనవసర పర్యటనలు చేయరాదంటూ భారత పౌరులకు కేంద్రం సూచింది. నా, దక్షిణకొరియా, ఇరాన్, ఇటలీ, హాంకాంగ్, మకావ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్, సింగపూర్, తైవాన్ నుంచి వచ్చే వారికి..మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే అనుమతి ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
18. కోవిడ్‌-19, ట్విటర్‌ కీలక ఆదేశాలు
సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌-19 కొత్త భూభాగాల్లో కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మొత్తం 5 వేల మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేయాలని కోరింది. దీనికి సంబంధించి హాంకాంగ్, జపాన్‌, దక్షిణ కొరియా కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు మాండేటరీ ఆదేశాలు జారీ చేసింది. అనవసర ప్రయాణాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం తాజా నిర్ణయం తీసుకుంది.కోవిడ్‌-19 విస్తరణకు అడ్డుకట్ట వేసే యోచనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రోత్సహిస్తున్నామని ట్విటర్‌ ప్రకటించింది. ప్రభుత్వ ఆంక్షల కారణంగా హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం తప్పనిసరని పేర్కొంది.
19. నిర్మానుష్యంగా మారిన మహీంద్రా హిల్స్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్‌కూ వచ్చేసింది. హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సికింద్రాబాద్‌లోని మహేంద్రా హిల్స్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో జంట నగరాలు భయం గుప్పిట్లో చేరిపోయాయి. ఇక మహేంద్రా హిల్స్ పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు సంబంధించి కొన్ని భయంకర నిజాలు వెలుగులోకి రావడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు సైతం జంకుతున్నారు. ప్రస్తుతం మహేంద్రా హిల్స్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోయింది