DailyDose

పోలీస్ విచారణలో కమల్-నేరవార్తలు

Kamal Appears Before Police-Telugu Crime News Roundup Today

*ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ నేడు చెన్నై పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గత నెలలో కమల్‌ హాసన్‌ నటిస్తున్న ఇండియన్‌ 2 సినిమా షూటింగ్‌ సందర్భంగా క్రేన్‌ విరిగి పడిపోవడంతో ముగ్గురు మరణించగా, మరొక 9మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విచారణలో భాగంగా కమల్‌ హాసన్‌ను ప్రశ్నించడానికి తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు నోటీసు పంపారు. ఈ కార‌ణంగా కమల్‌ హాసన్‌ నేడు పోలీసుల ఎదుట హాజరయ్యారు.
*నోటీసు ఇవ్వకుండా ప్లాన్ డీవియేట్ అయిన ఇండ్లను కూల్చివేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లకు కట్టబెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 178 (2) ప్రకారం ప్లాన్ డీవియేట్ అయి కట్టిన ఇండ్లను కూల్చివేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై సోమవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. “చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటారా? చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలని తెలియదా? అప్రూవల్ చేసుకున్న ప్లాన్‌‌కు అటూ ఇటూ మార్చి ఇండ్లు కట్టేస్తే నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చేస్తారా? మున్సిపల్‌‌ యాక్ట్‌‌లోని సెక్షన్‌‌ 178 (2)ను విడిగా చూసి చట్టాన్ని అమలు చేస్తే ఎలా? ఉరి,యావజ్జీవ శిక్షల కేసుల్లో సైతం నిందితుల వాదనలు వినడం జరుగుతోందని అధికారులు మర్చిపోతున్నారా? అక్రమ నిర్మాణదారుడికి నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చుడు నిర్ణయం ఏమిటి” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
*మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న సౌందర్య.. అదే జీహెచ్ఎంసీకి చెందిన చెత్త లారీ కింద పడి మృతిచెందింది.
*తండ్రి వంద రూపాయలు ఇవ్వలేదని క్షణికావేశంలో ఓ యువకుడు బైక్ను తగులబెట్టి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు సోమవారం వెల్లడించారు.
*హైదరాబాద్‌ నగరంలో నిత్యం చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను దక్షిణ మండల టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో ముందుగానే రెక్కీ నిర్వహించి.. రాత్రి పూట ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి, చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
*ఢిల్లీ అల్ల‌ర్ల స‌మ‌యంలో తుపాకీతో కాల్పులు జ‌రిపిన షారుక్ అనే వ్య‌క్తి ని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
* హైదరాబాద్‌ నగరంలో నిత్యం చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
* జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్థాపూర్‌ వాసి లింగన్నను జమ్ముకశ్మీర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం కింద అరెస్టయిన వ్యక్తికి లింగన్న డబ్బులు పంపాడని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో ఉంటున్న స్నేహితుడి సూచన మేరకు నగదు పంపినట్లు వివరించారు. రూ.5వేల నగదును గూగుల్‌ పే యాప్‌ ద్వారా రాకేశ్‌ అనే వ్యక్తికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనపై రాకేశ్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతని బ్యాంక్‌ అకౌంట్లు పరిశీలిస్తున్న క్రమంలో కుస్థాపూర్‌ వాసి లింగన్న అతడికి డబ్బులు జమ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇక్కడికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
*గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్‌-జీపు ఒకదానికి ఒకటి పరస్పరం ఢీకొని 8మంది చనిపోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
*ఎగ్జామ్స్ టెన్షన్ తట్టుకోలేక ఓ ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత తన రూమ్లోకి వెళ్లి కిటికీకి చీరతో ఉరేసుకున్నాడు. హైదరాబాద్ లోని సైదాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
*బ్రెజిల్‌లోని అమెజాన్ న‌దిలో ప‌డ‌వ బోల్తా ప‌డింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో సుమారు 18 మంది మ‌ర‌ణించారు. 70 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఫెర్రీ.. అమెజాన్‌కు చెందిన జారి ఉప‌న‌దిలో బోల్తాప‌డింది.
*విజయవాడలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై రైల్వేగార్డు అనీల్‌కుమార్‌ (40) లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
*అభం శుభం తెలియని చిన్నారి. చిన్న దెబ్బ తగిలినా. తట్టుకోలేని వయస్సు. అలాంటి అమాయక బాలుడి శరీరంలో సిరంజి సూదులు గుచ్చి ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు. శరీరంలోని వివిధ భాగాల్లో పది సూదులు ఉన్నాయి.
*అచ్చంపేట మండలం ఐనోల్ గ్రామ సమీపంలోని, వ్యవసాయ పొలం దగ్గర రాత్రి నిద్రిస్తున్న సమయంలో, పెనిమిళ్ళ నర్సింహా(60). అనే వ్యక్తిని నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు
*శ్రీసిటి హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, చిలమత్తూరు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు… ఈ సందర్భంగా శ్రీసిటీ డిఎస్పీ విమల కుమారి గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఇరోజు ఉదయం 4గం”ల నుండి 7గం”ల వరకు పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించామన్నారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తుల వివరాలుపై విఛారించి ,గుర్తింపు లేని 16 ద్విచక్ర వాహనాలు మరియు ఓక ఆటో స్వాధీనం చేసుకున్నామని.వాహన ధ్రువపత్రాలు తనిఖీ చేసి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేస్తామన్నారు..ఈ తనిఖీల్లో సి.ఐ. జగదీష్ నాయక్, ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి, ఏ.ఎస్సైలు దయానిధి నాయుడు, బాలలచంద్ర నాయుడు మరియు సివిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు,ఎస్పీవోలు పాల్గొన్నారు…
*మనోహరాబాద్‌ మండలం కళ్లకల్‌ మహాలక్ష్మి స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. బాయిలర్‌ క్రేన్‌ తెగిపోవడంతో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు స్టీల్‌ప్లాంట్‌కు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా సమాచారం. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు…
*అభం శుభం తెలియని చిన్నారి.. చిన్న దెబ్బ తగిలినా.. తట్టుకోలేని వయస్సు.. అలాంటి అమాయక బాలుడి శరీరంలో సిరంజి సూదులు గుచ్చి ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. శరీరంలోని వివిధ భాగాల్లో పది సూదులు ఉన్నాయి. అవి శరీరంలోకి ఎలా వచ్చాయో తెలియడం లేదు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
*రుసుము చెల్లించలేదని కారణం చూపుతూ కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని 20 మంది విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ తొలి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు ఉన్నాయంటూ యాజమాన్యం హాల్‌టికెట్లు ఇవ్వడానికి నిరాకరించింది.
*విశాఖపట్నం జిల్లా గొలుగొండ గురుకులానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి హేమంత మోకాలిలోకి ఆటోకు చెందిన ఇనుప ఊచ దిగి తీవ్ర రక్తస్రావమైంది. సోమవారం సాయంత్రం చీడిగుమ్మల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
*విజయవాడలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై రైల్వేగార్డు అనీల్‌కుమార్‌ (40) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనీల్‌కుమార్‌ తాడేపల్లిలో నివాసం ఉండేవాడు
*మిర్చి లోడ్తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం, శ్రీరాంపురం తండా వద్ద చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మిర్చి రైతులు మృతిచెందారు. మరో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చిని మార్కెట్కు తీసుకెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో మార్చురీకి తరలించారు. అనంతరం, పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
*కరీంనగర్లో ఇంటర్ విద్యార్థి రాధిక హత్య కేసు చిక్కుముడి వీడిపోనుందా? ఫిబ్రవరి 10న కరీంనగర్లోని వెంకటేశ్వర కాలనీలో ఇంట్లోనే ఆమెను కిరాతకంగా గొంతు కోసి చంపేశారు.
*బహ్రెయిన్ దేశస్థుడు ఎబ్రాహిం షుక్రల్లా మొహమ్మద్ బైరమి (60) తన సోదరిని బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని అంబర్పేట్కు చెందిన ఓ యువతి ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. యువతి, ఆమె తరఫు బంధువులే తనపై దాడిచేసి పాస్పోర్టు లాక్కున్నారని ఎబ్రాహిం ఫిర్యాదు చేశాడు.
*తాను చనిపోవడానికి రైల్వే డిప్యూటీ సీఈ ఎస్కే శర్మ కారణమని రైల్వే గుత్తేదారు వెంకట్రెడ్డి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య మాగనూరు కాంట్రాక్టరు క్యాంపులో ఆ అధికారి మద్యం మత్తులో అందరి ముందు తనను పరుష పదజాలంతో దూషించినట్లు లేఖలో పేర్కొన్నారు.
*చిరుత దాడిలో కర్ణాటకలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తుమకూరు జిల్లా కణవకుప్పె పంచాయతీ బైచేనహళ్లిలో శనివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. చందన అనే మూడేళ్ల చిన్నారిని తాత చిక్క గంగణ్ణ ఇంటి బయట ఆడిస్తుండగా చిరుత ఎత్తుకుపోయింది. ఆయన కేకలు పెట్టడంతో స్థానికులు వెంటపడి చిన్నారిని విడిపించేలోగా అరకిలోమీటరు దూరం వరకు తీసుకెళ్లింది.
*నల్గొండ జిల్లా అనుముల మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న 90 ఏళ్ల వృద్ధురాలిపై ఓ తాగుబోతు అత్యాచారం చేసి హత్య చేశాడని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. హాలియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*రెండు గూడ్సురైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు రైల్వే సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లా పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు లోడుతో ఉత్తర్ప్రదేశ్ వైపు వెళ్తున్న గూడ్సు రైలు మరో ఖాళీ గూడ్సురైలును ఢీకొంది. ప్రమాదంలో ఒక ఇంజిన్, 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఇంజిన్ నుంచి మూడు మృతదేహాలను బయటకు తీశారు.
*అసోంలోని చాక్లా గ్రామంలో 10వ తరగతి విద్యార్థులు ఏడుగురు కలిసి ముక్కుపచ్చలారని ఓ 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తరవాత ఆ బాలికను చెట్టుకు ఉరి తీసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. 10వ తరగతి పరీక్షలు రాసి వచ్చిన వీరంతా పార్టీ చేసుకుంటున్నామని చెప్పి ఆ బాలికను శుక్రవారం ఓ ఇంటికి ఆహ్వానించారు. అక్కడ అత్యాచారం చేసి, సమీపంలోని అడవికి తీసుకువెళ్లి అక్కడ ఒక చెట్టుకు ఉరి వేసి పరారయ్యారు.
*కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్సై విష్ణునారాయణ అదృశ్యమయ్యారన్న వార్త ఆదివారం సంచలనం సృష్టించింది. 13 గంటల తర్వాత సాయంత్రం ఆయన ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 26న రుద్రవరం మండలం నరసాపురంలో ఇరువర్గాల మధ్య గొడవ, సంబంధిత కేసుల నమోదు విషయంలో ఎస్సై ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనను జిల్లా కేంద్రానికి ఎస్పీ రప్పించినట్లు సమాచారం.
*చెన్నై నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థపై ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) చేసిన దాడుల్లో లెక్కలు చూపని రూ.400 కోట్ల నల్ల ధనం వెలుగు చూసింది. దేశ వ్యాప్తంగా అనేక శాఖలున్న ఈ వ్యాపార సంస్థ ఫెర్రస్, సీసం, రాగి, అల్యూమినియం విడి భాగాలను సరఫరా చేస్తోంది. దాదాపు రూ. వెయ్యి కోట్ల టర్నోవర్ కలిగిన ఈ సంస్థ రూ. 400 కోట్లకు పైగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సదరు సంస్థ కార్యాలయం నుంచి రూ. కోటి నగదుతో పాటు లావాదేవీలకు సంబంధించిన ఇతర దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*గుంటూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద కాల్వలోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో మిర్చి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బోధిలవీడుకు చెందిన రైతులు మిర్చి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టవేరా వాహనం వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాకుమాను గ్రామానికి చెందిన బంధువులంతా గుంటూరు రూరల్ మండం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
*రాత్రి పాన్షాప్ మూసి వేసి ఇంటికి వెళ్లిన యజమాని.. ఉదయం వచ్చి చూడగా సిగరెట్లు మొత్తం ఎత్తుకెళ్లారు. వెంటనే పాన్షాప్లోని సీసీ కెమెరాఫుటేజీని పరిశీలించగా.. చోరీకి పాల్పడింది ఓ మహిళ అని తెలియడంతో అవాక్కయ్యాడు. సరూర్నగర్ ఠాణా కర్మన్ఘాట్లో శనివారం రాత్రి జరిగిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. ఇక్కడి మందమల్లమ్మ ఫంక్షన్హాల్ సమీపంలో శ్రీకాంత్ పాన్షాపు నిర్వహిస్తున్నాడు.
*సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికపై(16) యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ తనను ప్రేమించాలంటూ రెండేళ్లుగా ఆమెను వేధిస్తున్నాడు.
*ట్యాబ్ కోసం అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం పన్నెండేళ్ల బాలుడి ప్రాణం తీసింది. ఆవేశంలో భవనంపై నుంచి దూకి ఆ చిన్నారి మరణించిన విషాదఘటన హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.
*ఇంటి ముందున్న నీటి బకెట్లో పడి ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ కవిత, నర్సింలు దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు సాకేత్ (2) ఆడుకుంటూ ఇంటి ముందున్న బకెట్ వద్దకు వెళ్లి తలకిందులుగా అందులో పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు కొనఊపిరితో ఉన్నట్లు గుర్తించి వెంటనే కామారెడ్డి జిల్లా పిట్లం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
*రైల్వే పనుల గుత్తేదారు ఒకరు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో శనివారం వెలుగు చూసింది.
*పాఠశాలలో గోడ కూలి మీద పడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఆలమూరు మండలం చెముడులంకలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగింది.
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసులో నిందితుడు తిరునగరు మారుతీరావుకు చెందిన షెడ్డులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెండో పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్పల్లి ప్రధాన రహదారి చెంత ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదుట మారుతీరావుకు చెందిన ఖాళీ షెడ్డు ఉంది.
*చెన్నై నగర శివారు మాధవరంలోని ఓ ప్రైవేటు గోదాములో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి రౌండ్ రానాలోని ఓ గోదాములో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. నిమిషాల వ్యవధిలో మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించాయి.
*హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అలకపూరిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని తన గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన తేజస్వినిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.