Sports

మీడియాపై కోహ్లీ ఆగ్రహం

Kohli Angry On Media And Journalists-Telugu Sports News

పోస్ట్‌‌ మ్యాచ్‌‌ మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ.. లోకల్‌‌ జర్నలిస్ట్‌‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం రెండో ఇన్నింగ్స్‌‌లో కివీస్‌‌ కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ ఔటైనప్పుడు.. విరాట్‌‌ ప్రేక్షకుల వైపు చూస్తూ నోటి మీద వేలుపెట్టి కీప్‌‌.. క్వైట్‌‌ అన్నట్లు సంజ్ఞలు చేశాడు. సోషల్ మీడియాల్లో ఈ వీడియో వైరల్‌‌గా మారడంతో విరాట్‌‌ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. దీంతో ఓ జర్నలిస్ట్‌‌ ఈ విషయంలో విరాట్‌‌ స్పందనను అడిగే ప్రయత్నం చేశాడు. దీనిపై కోహ్లీ.. ‘ఇందులో మీరేమనుకుంటున్నారు?’ అని ఎదురు ప్రశ్నించాడు. నేను మీ అభిప్రాయాన్ని అడిగితే.. నన్ను చెప్పమనడం ఏంటని బదులు ప్రశ్నించిన జర్మలిస్ట్‌‌.. మీరు (కోహ్లీ) మైదానంలో సరిగ్గా ప్రవర్తించాల్సిందన్నారు. దాంతో ఆయనపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని రావాలి. అసంపూర్తి సమాచారంతో ఇక్కడికి వచ్చి మాట్లాడకూడదు అంటూ విరాట్ ధ్వజమెత్తాడు. ఒకవేళ మీరు (జర్నలిస్ట్‌‌) వివాదాలు సృష్టించాలనుకుంటే ఇది సరైన వేదిక కాదని ఘాటుగా స్పందించాడు. అయితే రిపోర్టర్లతో గొడవపడటం కోహ్లీకి ఇదేమీ కొత్త కాదు. మరోవైపు కోహ్లీ ప్రవర్తన గురించి విలియమ్సన్‌‌ను అడిగితే.. ప్యాషన్‌‌తో క్రికెట్‌‌ ఆడే విరాట్‌‌లో ఇదో విలక్షణమైన తీరు అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.