Devotional

7 నుండి నెమలి బ్రహ్మోత్సవాలు

Nemali 2020 Brahmotsavams From March 7th

1.7 నుండి నెమలి బ్రహ్మోత్సవాలు – ఆద్యాత్మిక వాతలు – 03/03/2020
* కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి వారు. భక్త జనోద్ధరణకు స్వయం వ్యక్తముగా భూగర్భం నుండి సాక్షాత్కరించి అనేకమంది భక్తులు కోరు వరములు ప్రసాదించుచు మహాత్తరములైన దృష్టాంతరములను ప్రదర్శించుచూ భక్తుల అభీష్టములు నెరవేర్చుచున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవములు. ది. 7-03–2020 మంగళవారం నుండి ది. 12–03–2020 ఆదివారం వరకు అతి వైభవముగా జరుగును. భక్తులు యావన్మంది విచ్చేసి శ్రీ స్వామి వారిని సేవించి తీర్థప్రసాదములు స్వీకరించి తరించ ప్రార్థన. ది. 9–03–2020 గురువారం రాత్రి గం, :11–00 లకు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణము జరుగును.
2.పొన్న వాహనంపై ఊరేగిన నారసింహుడు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం అలంకార వేడుక, రాత్రి వాహన సేవ ఉత్సవాన్ని చేపట్టారు. ఉగ్రనరసింహుడిని వటపత్రశయనుడిగా తీర్చిదిద్ది భక్తజనుల మధ్య ఊరేగించారు. రాత్రివేళ పొన్నవాహన సేవ ఉత్సవాన్ని చేపట్టారు. వేడుకల విశిష్టతనూ ఈ సందర్భంగా వివరించారు. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు సోమవారం నుంచి ప్రారంభమయ్యే ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయి. మంగళవారం నుంచి విశేష ఉత్సవాలు మొదలవుతాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
3.. నేటి నుంచి యాదాద్రిలో విశేష ఉత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విశేష పర్వాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు ఎదుర్కోలుతో శ్రీకారం చుడతారు. బుధవారం మధ్యాహ్నం ఆస్థానపరంగా తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. భక్తుల సందర్శనార్థం అదే రోజు రాత్రి కొండకింద పాత జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తారు. గురువారం రథోత్సవాన్ని బాలాలయంలో నిర్వహించి రాత్రి పట్టణ వీధుల్లో ప్రచార రథాన్ని ఊరేగిస్తారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం గోవర్ధనగిరిధారిగా అలంకృతుడైన నారసింహుడు భక్తజనులకు దర్శనమిచ్చాడు. రాత్రివేళ సింహవాహనంపై విహార పర్వాన్ని నిర్వహించారు. ధార్మిక, సాహిత్య, సంగీత, సాంస్కృతికోత్సవాలను ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తిలు ప్రారంభించారు.
4. పంచాంగము 03.03.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణ
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: శుక్ల
తిథి: అష్టమి ఉ.09:08 వరకు
తదుపరి నవమి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: మృగశిర పూర్తి
యోగం: వృషకుంభ ప.12:23 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బవ ప.01:45 వరకు
తదుపరి కౌలవ
వర్జ్యం: ప.12:06 – 01:45
దుర్ముహూర్తం: 08:54 – 09:42
రాహు కాలం: 03:25 – 04:54
గుళిక కాలం: 12:28 – 01:56
యమ గండం: 09:30 – 10:59
అభిజిత్ : 12:05 – 12:51
సూర్యోదయం: 06:32
సూర్యాస్తమయం: 06:23
వైదిక సూర్యోదయం: 06:36
వైదిక సూర్యాస్తమయం: 06:19
చంద్రోదయం: ప.12:12
చంద్రాస్తమయం: రా.12:42
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృషభం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: దక్షిణం
హోళీక అష్టాహ్నికారంభం
లలితా కాంతీదేవి వ్రతం
శ్రీ దాదుదయాళ్ జయంతి
శృజ్ఞ్గేరీ శారదాంబ రథోత్సవం
5. రాశిఫలం – 03/03/2020
థి:
శుద్ధ అష్టమి ఉ.8.33, కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
మృగశిర పూర్తి
వర్జ్యం
ఉ.11.47 నుండి 1.23 వరకు
ర్ముహూర్తం:
ఉ.8.24 నుండి 9.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు ,విశేషాలు: హోళికాష్టక ప్రారంభం
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా వుంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి వుంటుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శువార్తలు వింటారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణబాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవుతుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఋణప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం వుంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తపడుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
6. జ్ఞానదీపం
అస్తమిస్తున్న సూర్యుడు అడుగుతాడు- ‘నా విధులను నిర్వహించేవాళ్లు ఇక్కడ ఎవరున్నారు?’ అని. ‘నా శక్త్యానుసారం నేను ప్రయత్నం చేస్తా ప్రభూ!’ అని సమాధానమిస్తుంది మట్టి దీపం. విశ్వకవి రవీంద్రుడి కవితా చరణాల భావం ఇది. ‘చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపమైనా వెలిగించడం మంచిది’ అని ఆర్యోక్తి.భారతీయ సంప్రదాయంలో దీపానికి చాలా వైశిష్ట్యం ఉంది. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అన్నారు. ‘ఓ దీప దైవమా! నీవు బ్రహ్మ స్వరూపానివి. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి మా కోర్కెలన్నింటినీ దయతో తీర్చుమా’ అని దీపారాధన అనంతరం ఆ వెలుగును ప్రార్థిస్తారు. దీపం వెలిగించి శుభకార్యం ప్రారంభించడం మన సంప్రదాయం. మరణానంతరం తల వెనక దీపం ఉంచుతారు కదా. ప్రపంచాన్ని మనకు కనబరచే విశ్వవ్యాప్త శక్తి వెలుగు. ఆ వెలుగు పరమాత్మ స్వరూపం. అందుకే పోతన- లోకాలు, లోకులు, లోకేశులు నశించిన తరవాత పెనుచీకటికి¨ అవతల నిశ్చలంగా వెలిగే పరమాత్ముణ్ని సేవిస్తానన్నాడు. వెలుగు లేనిదే రోజు గడవదు. జీవకోటికి ప్రాణాధారం వెలుగు.‘తమసోమా జ్యోతిర్గమయ’- ఉపనిషద్వాక్యం. మన హృదయాల్లో చీకటి లాంటి అజ్ఞానం నశించడానికి, మన ఇళ్లలో చీకటి నశించడానికి దీపం అవసరం. గృహంలో ఎప్పుడూ వెలుగు ఉండాలని, చీకటి ఉండకూడదని మన పెద్దలు అంటారు. పగటి పూట సూర్యుడు ఉంటాడు గనుక వెలుగుకు మరో ఉపకరణం అక్కరలేకపోయేది. గృహ నిర్మాణం దానికి అనుకూలంగా జరిగేది. ఆధునిక నిర్మాణాలు అందుకు అనువుగా లేవు. పట్టపగలు దీపాలు వెలిగించుకోవలసిన పరిస్థితి కొన్నిచోట్ల చూస్తున్నాం. సాయంకాలం అయిన వెంటనే ఇంట్లో చీకటి ప్రవేశించకుండా దీపాన్ని వెలిగించాలి. అది సూర్యోదయం వరకూ ఉండాలని అని పెద్దలు చెప్పేవారు. అలా ఉండే గృహంలో దారిద్య్రం ఉండదని భావించేవారు.తూర్పు దిక్కున దీపం ఉంటే ఆయువు వృద్ధి చెందుతుందని, ఉత్తరంగా ఉంటే ధనం లభిస్తుందని, పడమటి దిక్కున దీపం దుఃఖహేతువని, దక్షిణ దిశలో దీపం ఉంచడం హాని కలిగిస్తుందని శాస్త్ర వచనం. అన్ని దిక్కులా దీపాలు పెట్టేవారికి ఈ నియమం వర్తించదు. అలా చేయడం శుభప్రదమే.వెలుగును జ్ఞానానికి ప్రతీకగా భావిస్తాం. ఏ దీపమూ సూర్యుడికి ఎలా ప్రత్యామ్నాయం కాలేదో, అలాగే జ్ఞానాన్ని బోధించేవారందరూ మహర్షులు కాలేరు. వేదరుషులు క్రాంతదర్శులై మానవాళికి జ్ఞానమార్గం చూపారు. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తుల వెలుగులో భారత జాతి తన జీవన శైలిని తీర్చిదిద్దుకుంది. కాలం గడిచేకొద్దీ సమాజంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అందులో కొన్ని వికృతులు జాతిని అపసవ్యమార్గం పట్టిస్తాయి. ఈ తరుణంలో తమతమ పరిధుల్లో జాతిని జాగృతం చేయడానికి వివిధ కాలాల్లో ఎందరో ఉపదేష్టలు ఉద్భవించారు. మట్టిదీపం సూర్యుడి బాధ్యతను స్వీకరించినట్లుగా ఎవరికి వారు చేతనైనంత వరకు తోటివారికి హితాన్ని బోధిస్తూనే ఉన్నారు. అలా చేయాలి కూడా. ఇతరులకు చెప్పగలిగి కూడా చెప్పకుండా ఉదాసీనంగా ఉండేవారు, బుద్ధిమంతులై ఉండి కూడా అజ్ఞానంతో ప్రవర్తించేవారు సమాజానికి నష్టకారులు.ఒకప్పుడు రుషులు కావ్యేతిహాసాలు అందించారు. గొప్ప కవులు తమ కావ్యాల ద్వారా ధర్మోపదేశాలు అందించారు. ఈ తరంలో తమ అవగాహన స్థాయిలో ఆధ్యాత్మిక రచయితలు సమాజానికి విలువలు ప్రబోధిస్తున్నారు. వారి ప్రయత్నమెప్పుడూ స్తుతి పాత్రమే. ‘దివ్వె- కాంతిని ఇస్తుంది. దానికి కృతజ్ఞతలు తెల్పు. కాని ఆ దివ్వెను పట్టుకుని వెనక నీడలో నిశ్చలమైన సహనంతో నిలబడిన వ్యక్తిని మాత్రం మరచిపోకు’ అన్న రవీంద్రుడి వాక్యాలూ సమాజం గుర్తుంచుకోవాలి.
7. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం,
03.03.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-29C°
• నిన్న 69,096 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 కంపార్ట్మెంట్ లో
భక్తులు సర్వదర్శనం కోసం
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.09 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free
#18004254141
8. చరిత్రలో ఈ రోజు
03 మార్చి, 2020
మంగళవారం
సంవత్సరములో 63వ రోజు 9వ వారం
సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)
ప్రత్యేక దినాలు
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
[వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. వన్యప్రాణులసంరక్షణ రెండు దశలలో చేస్తారు. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను, మొక్కల సమాజాన్ని కాపాడటం, రెండవది జన్యువు వైవిధ్యం జాగ్రత్తపరచడానికి అన్ని జాతుల మొక్కలను, జంతువులను కాపాడుట. అనేక దేశాల వారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించారు. ]
జాతీయ రక్షణ దినోత్సవం
[దేశరక్షణకు మీరే కీలకం. జాతియావత్తూ చేస్తుంది మీకు సలాం. జాతీయ రక్షణ దినోత్సవం సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు. అమరజవాన్లకు జన నీరాజనాలు.
సంఘటనలు
1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
image.gif
1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.
image.gif
1967 : నక్సల్బరీ ఉద్యమం మొదలైంది.
image.gif
1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
image.gif
2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
image.gif
2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
జననాలు
image.gif
1847: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1922)
image.gif
1880: ఆచంట లక్ష్మీపతి, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)
image.gif
1891: కొంగర సీతారామయ్య, ప్రముఖ రంగస్థల నటుడు,కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)
image.gif
1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త . (మ.1973)
image.gif
1937: సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.
image.gif
1939: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
image.gif
1955: జస్పాల్ భట్టి, ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
image.gif
1967: శంకర్ మహదేవన్, ప్రముఖ భారతీయ గాయకుడు, స్వరకర్త.
image.gif
1982: జెస్సికా బీల్, అమెరికా నటీమణి, పూర్వపు మోడల్.
image.gif
1989: కృష్ణ దేశగాని, ప్రముఖ రచయిత, సంఘసేవకుడి జననం
image.gif
1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషెడ్జీ టాటా జననం.
మణాలు
1943: శ్రీపాద కామేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు,మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకలాల్ను ఆంధ్రావళికి అనువదించి అందించారు.
1993: అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త అల్బెర్ట్ సాబిన్
2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)
2008: వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి కుమారి.