Health

పాదచలనాన్ని ఆవిష్కరించిన కరోనా-TNI ఆరోగ్య కథనాలు

Coronavirus Invents New Form Of Greeting-FootShake

1.నమస్కార్ కరోనా! – పాదచాలనమూ ముద్దే! – రూపుమారుతున్న సంప్రదాయాలు – చుంబనాలు, కరచాలనాలకు స్వస్తి!
***ఏ ఇద్దరు కలిసినా ఆప్యాయతతో పలకరించుకునే తీరు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కొందరు కరచాలనం చేస్తే.. ఇంకొందరు చేతులు కలుపుతూ చప్పట్లు కొట్టుకుంటారు. ఇంకొందరు హత్తుకుని ఆలింగనం చేసుకుంటారు. మరికొందరు బుగ్గలమీద, ముక్కులు కలిసేలా చుంబనాలు చేస్తారు. భారత్లోనైతే చేతులెత్తి నమస్కరిస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలివి. కరోనా వైరస్ దెబ్బకు ఇవన్నీ రూపు మారిపోతున్నాయి. కొన్ని సంప్రదాయలకు ‘దూరంగా’ ఉండాలని అంతర్జాతీయంగా వైద్య, ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి.
*****చైనా : చేతులు జోడించి..
కరచాలనం వద్దేవద్దని.. దీనికి బదులు చేతులు జోడించి పలకరించుకోవడమే మేలని చైనా సూచిస్తోంది. లేదా హలో చెప్పడం కోసం ‘గాంగ్ షోవ్’ (ఒక అరచేతిలో మరో చెయ్యి పిడికిలిని అడ్డంగా పెట్టడం) విధానాన్ని అనుసరించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
****ఇరాన్ : పాదచాలనం
ఇరాన్లో కరచాలనానికి బదులు పాదచాలనం చేసుకుంటున్నారు. బూట్లు ధరించిన కాళ్లను ఒకరినొకరు తాకించుకుని ఆత్మీయతను వెలిబుచ్చుకుంటున్నారు. ఈ కొత్త అలవాటుతో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వీడియోలూ ప్రసారం చేస్తున్నారు.స్నేహితుల్ని కలిసినపుడు మాస్కులు ధరించండని, జేబుల్లో చేతులు పెట్టుకోండని సూచిస్తున్నారు.
***ఫ్రాన్స్ : కళ్లలోకి కళ్లుపెట్టి..
ఈ దేశంలో ఆత్మీయంగా ఏ ఇద్దరు పలకరించుకోవాలన్నా చెంపలపై ముద్దులు, కరచాలనాలు చేసుకునే సంప్రదాయం ఉంది. ఈ పద్ధతులు ఇక చాలించాలని.. వీటికి బదులు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటే సరిపోతుందని పత్రికలన్నీ ప్రచారం చేస్తున్నాయి.
**(*ఆస్ట్రేలియా : వెన్నుతడితే చాలు
ముద్దులు పెట్టుకుంటూ, కరచాలనం చేసుకుంటూ ఆత్మీయతను చాటే పద్ధతి ఈ దేశంలోనూ ఉంది. దీనికి బదులు వీపుపై తట్టాలని న్యూసౌత్ వేల్స్ ఆరోగ్య మంత్రి సూచిస్తున్నారు. ఒకవేళ ముద్దు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడుతున్నామో చూసుకుని జాగ్రత్తలు పాటించాలంటున్నారు.
***జర్మనీ : చిరునవ్వుతోనే..
ఈ దేశంలో ఇప్పుడు ప్రముఖులు కూడా కరచాలనానికి ఇష్టపడటం లేదు. దీనికి బదులు మందహాసం, చేతులు గాల్లో ఊపడం వంటివి చేస్తున్నారు.
***బ్రెజిల్ : అలా తాగొద్దు..
దక్షిణ అమెరికాలో విస్తృత ప్రజాదరణ పొందిన ఓ కెఫీన్ పానీయాన్ని (చిమారో) లోహపు గొట్టాల(మెటల్ స్ట్రాలు)తో తాగే అలవాటుంది. ఈ స్ట్రాలను ఒకరికొకరు మార్చుకుని తాగుతుంటారు. ఈ పద్ధతి వద్దని బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రజలకు స్పష్టంచేసింది.
**యూఏఈ : గాల్లో చేతులూపండి
యూఏఈ, ఖతార్లలో ముక్కు-ముక్కు తాకించుకుని పలకరించుకునే సంప్రదాయం ఉంది. ఇకపై ఇలా చేయొద్దని, కరచాలనమూ వద్దని ప్రచారం చేస్తున్నారు. దీనికి బదులుగా గాల్లోకి చేతులుపుతూ పలకరించుకోవాలని యూఏఈ ప్రభుత్వం సూచించింది.
2. కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.
– కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది. కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్ని అరికట్టినట్టే. ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్నిా ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది. ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. కొన్నాళ్ళు ఐస్క్రీ్మ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యంగా..
*గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.
* కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్నిు నివారించవచ్చు.
3. కరోనా లక్షణాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు 040 2465 1119 నంబరును అందుబాటులోకి తెచ్చారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఈ నంబర్ ను సంప్రదించాలని కోరారు. ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం, ఒళ్లు.. గొంతు.. తల.. ఛాతి నొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం, పొడి దగ్గు, ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరేచనాలు ఉంటే.. సంప్రదించాలని, పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
4. హైదరాబాద్‌లో కలకలం రేపిన కరోనా వైరస్ ఇప్పుడు తూర్పుగోదావరి వాసులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అనంతరం స్వగ్రామమైన వాడపాలేనికి వెళ్లాడు.విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ అధికారులు, అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో, అతడికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా అధికారులు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడు స్వగ్రామం నుంచి తన అత్తగారి ఊరైన గోదశపాలెం వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ వార్త కాస్తా వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, బాధితుడికి కరోనా వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు…
5. కరోనా వైరస్ -కేవలం హ్యాండ్ క్లీనింగ్ తో పోదు-రోగ నిరోధకశక్తి పెరిగేలా జీవన విధానం మార్చుకోండి-
(1) సూర్య నమస్కారాలు -యోగా
(2) రాగి బిందెలో నీరు- (కుండ వద్దు) గోరు వెచ్చని నీరు
(3) ఉపవాసాలు
(4) పండ్లు-ఫలహారాలు దేవుని నైవేద్యం
(5) భగవత్ చింతన -మంచి ఆలోచనలు
(6) అభ్యంగన స్నానం (ఆయిల్ మసాజ్ )
(7) ప్రాణాయామం ( స్వచ్చమైన వాతావరణంలో గడపడం)
(8) స్వేదనం – వేడిలో గడపడం ( ఆయుర్వేద పంచకర్మలు)
(9) సుఖ విరోచనం(పంచకర్మలు)
(10) సరియైన మోతాదులో నీరు త్రాగడం
(11) సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయాక తినకపోవడం ( గూటిలో దీపం -నోట్లో ముద్ద పెద్దల సామెత)- రాత్రిళ్ళు త్వరగా ఆదమరచి నిదురపోవడం-
(12) వేళకు భోజనం చేయడం
(13) అతి తక్కువ మాంసాహారం
(14) బ్రహ్మీ ముహుర్తంలో పెందలకడనే లేచి – ధ్యానం చేయడం-పనులు చేసుకోవడం
(15) పగలు నిద్రపోకపోవడం (లేదా పదినిమిషాలు నిద్రపోవడం)
(16) తిన్న వెంటనే నిద్రపోకపొవడం -నేలమీద కూర్చొని -ఆహారాన్ని పూజ్య భావంతో నమిలి తినడం
(17) చల్లటి వాతావరణం (సాయంత్రం 7గంటల తరువాత బయట తిరగకుండా-త్వరగా నిదురపోవడం
(18) పాశ్చాత్య ఆహారాలు -కూల్ డ్రింక్స్ -జంక్ ఫుడ్ తినకపోవడం
(19) కోపం-పగ -చెత్త రాజకీయాలు- చెత్త న్యూస్ – చెత్త ఫేస్ బుక్ వెధవలకు,చెత్త సీరియల్స్ కు దూరంగా ఉండటం-
(20) మంచిగా నటించేవారిని ,స్వార్దపరులకు దూరంగా ఉండటం(భగవద్గీత)
(21) మానసిక వత్తిడి లేకుండా-ఆదాయంలోనే ఖర్చులు పెట్టుకుని- డబ్బు దాచుకోవడం-మంచివారితో, ఇంట్లో వారితో రోజూ కాసేపు మంచిగా మాట్లాడటం
(22) ప్రజా సేవలు చేయడం
(23) తేలికగా అరిగే ఆహారాలు, పోషకాహారాలు మాత్రమే తినడం
(24) కష్టపడి పనిచేయడం-ఎండలో గడపడం
(25) తిన్న వెంటనే వజ్రాసనం వేయడం
(26) చక్కెర-ఉప్పు -నూనెలు తగ్గించి-భారతీయ సాంప్రదాయ వంటలు తినడం
(27) కుక్కర్ లో వండిన ఆహారం అరగని వారు -విడిగా మెత్తగా గుజ్జుగా వండుకోవడం
(28) ఫ్యాన్ గాలి-పడమటిగాలి-చలిగాలి-చల్లటి నీటి స్నానం -Ac లలో గడపడం తగ్గించి వేయడం
(29) భారతీయ ఉసిరి- జామ లాంటి విటమిన్ c అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం
(30) చింతపండు కంటే, చింతకాయ-మామిడికాయ- కూరల్లో వాడటం
(31) పసుపు-వెల్లుల్లి-అల్లం -పోపు దినుసులు సరైన మోతాదులో వాడటం
(32) కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం -కష్టపడి పగలంతా పని చేస్తూనే ఉండటం- రక్త ప్రసరణ సరిగా ఉండేలా చూసుకోవడం-
ఇలాంటి మన భారతీయ పద్దతులకు దగ్గరగా ఉంటే, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది- అప్పుడు ఏ వైరస్ అయినా 90% మిమ్మల్ని ఏం చేయదు- అయితే మీరు ముందు నుంచే-జీవన విధానం మార్చుకోండి
6. మహేంద్రహిల్స్‌లో స్కూళ్లకు సెలవు
కరోనా వైరస్‌ కారణంగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని మహేంద్రహిల్స్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కరోనా (కొవిడ్‌-19)వైరస్‌ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇదే ప్రాంత నివాసి కావడంతో కంటోన్మెంటు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.ఇప్పటికే మహేంద్రహిల్స్‌ ప్రాంతంలో ముమ్మరంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 19న దుబాయి నుంచి బెంగళూరుకు వచ్చిన యువకుడు అక్కడి నుంచి 22న మహేంద్రహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అయిదు రోజులపాటు కాలనీలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఎక్కడెక్కడ తిరిగాడు?ఎవరెవర్ని కలిశాడు?తదితర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతని నివాసం వద్దకు మంగళవారం మీడియా వెళ్లినా…ఇంట్లో ఎవరూ కన్పించలేదు. పరీక్షల కోసం కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కంటోన్మెంట్‌ పారిశుద్ధ్య విభాగంలోని 30 మంది సిబ్బందితో ఇంటి పరిసరాలను, వీధులను శుభ్రం చేయించారు.
7. కాకినాడ జీజీహెచ్‌లో కరోనా అనుమానితుడు
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కలకలం రేపింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల దక్షిణకొరియా వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లోని అధికారులు ఉద్యోగి వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డికి అందజేశారు. ఈ సమాచారంతో జిల్లా అధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమై అనుమానిత వ్యక్తిని గుర్తించి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
8. అమెరికాలో తొమ్మిదికి చేరిన కొవిడ్‌ మృతులు
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీరంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికిచ చెందినవారే. మరోవైపు బాధితుల సంఖ్య 100దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు చైనాలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారం 115 మందికి కొవిడ్‌ సోకినట్లు గుర్తించారు. మరో 38 మంది మృత్యువాతపడడంతో మృతుల సంఖ్య 2,981కి చేరింది. ఇక దక్షిణ కొరియాలో 142 మంది కొత్తవారికి వైరస్‌ సంక్రమించినట్లు ధ్రువీకరించారు. దీంతో బాధితుల సంఖ్య 5,528కి తాకింది. మంగళవారం మరో నలుగురు మరణించడంతో మృతుల సంఖ్య 32కు చేరింది. వివిధ దేశాల్లో కొవిడ్‌ మరణాలు, బాధితుల సంఖ్య ఇలా ఉంది…
దేశం బాధితుల సంఖ్య మరణాల సంఖ్య
చైనా 80,270 2,981
దక్షిణ కొరియా 5328 32
ఇరాన్‌ 2,336 77
ఇటలీ 2,263 79
అమెరికా 108 09
జపాన్‌ 294 06
ఫ్రాన్స్‌ 204 04
హాంకాంగ్‌ 100 02
భారత్‌ 06 00
ప్రపంచవ్యాప్తంగా 92,787 3,201
* అర్జెంటీనాలో తొలికేసు నమోదైంది. బాధితుడు ఇటీవల ఇటలీ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
* హైదరాబాద్‌లో ఓ వ్యక్తి కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దుబాయ్‌ నుంచి అతను ఇండిగో విమానంలో ఫిబ్రవరి 20న భారత్‌కు వచ్చాడు. దీంతో ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బందిని ఇంట్లోనే ఉండాలని ఇండిగో సంస్థ ఆదేశించింది.
* భారత నావికాదళం విశాఖపట్నంలో ఈ నెలలో జరగాల్సిన ‘మిలన్‌-2020’ విన్యాసాలను వాయిదా వేసింది. దీంట్లో దాదాపు 30 దేశాలు పాల్గొనాల్సి ఉంది.
* ఇటు భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రలో ఆరుగురు అనుమానితుల్ని ప్రభుత్వం వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. ఇప్పటి వరకు 149 మందికి పరీక్షలు జరపగా.. అందరికీ నెగటివ్‌ అని తేలినట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు నివేదికలు రావాల్సి ఉంది.
9. ఐపీఎల్‌కు కరోనా ఎఫెక్ట్?
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌ను కూడా కలవరపెడుతోంది. భారత్‌లో కరోనా కేసులు నమోదు కావడంతో మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. అయితే ఐపీఎల్‌కు కరోనా ప్రభావం లేదని, షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు. ‘‘ఇప్పటివరకు ఐపీఎల్‌కు ఎటువంటి కరోనా ముప్పులేదు. అయితే దానిపై కూడా దృష్టిసారిస్తాం’’ అని వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి మే 24 వరకు జరుగుతుంది.
10. విజయవాడలో కరోనా కలకలం
బెజవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్‌ని తిరుపతికి పంపించే ఆలోచన చేస్తున్నారు.
11. మహమ్మారిలా విస్తరిస్తున్న కరోనా వైరస్‌.. ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఆ ప్రాణాంతక వైరస్‌ను అదుపు చేసేందుకు అన్ని దేశాలు నడుం బిగించాయి. కరోనాపై పోరాటం చేస్తున్న అభివఅద్ధి చెందుతున్న దేశాలకు .. వరల్డ్‌ బ్యాంక్‌ సుమారు 12 బిలియన్ల డాలర్లు సాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ ప్యాకేజీ తరహాలో వరల్డ్‌ బ్యాంక్‌ ఆయా దేశాలకు ఆ డబ్బును ఖర్చు చేయనుంది. తక్కువ వడ్డీతో రుణాలు, గ్రాంట్లు, టెక్నికల్‌ సహకారం అందించేందుకు కూడా వరల్డ్‌ బ్యాంక్‌ సిద్ధమైంది. కరోనా వ్యాప్తితో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వరల్డ్‌ బ్యాంక్‌ భారీ రుణ సాయానికి సిద్దమైంది. తాము ఇచ్చే నిధులతో అభివఅద్ధి చెందుతున్న దేశాలు.. పబ్లిక్‌ హెల్త్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని వరల్డ్‌ బ్యాంక్‌ పేర్కొంది. అత్యంత పేద దేశాలను ఎంపిక చేసి.. నిధులను చేరవేస్తామని వరల్డ్‌ బ్యాంక్‌ చెప్పింది.
12. కరోనా బిజినెస్‌: వాటి ధర ఇప్పుడెంతో తెలుసా?
సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా కలకలం రేగింది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో మహేంద్రహిల్స్‌ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఆ ప్రాంత రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లోని పలు స్కూళ్లు బుధవారం సెలవు కూడా ప్రకటించాయి. పొరుగునే ఉన్న అడ్డగుట్టలో సైతం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను తిరిగి ఇళ్లకు పంపించివేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పలు విద్యాసంస్థల్లో మాస్కులు ధరించి పిల్లలు తరగతులకు హాజరయ్యారు. ఈనేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
*ఒక్కసారిగా పెరిగిన ధరలు..
కరోనా భయాల నేపథ్యంలో వ్యాపారులు నోటి మాస్కులకు అమాంతం రేట్లు పెంచేశారు. రెండు లేయర్లతో ఉన్న మాస్క్‌ హోల్‌సేల్‌ ధర రూ.1. 60 పైసలు కాగా, కొందరు మెడికల్‌ దుకాణాదారులు ఒక్కోదానికి రూ.20 నుంచి 25 వరకు వసూలు చేస్తున్నారు. రూ.30-40 విలువ చేసే ఎన్‌95 మాస్కును రూ.300 వరకు అమ్ముతూ ప్రజల్ని దోచేస్తున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద మాస్కులు డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్‌ అమ్మకందార్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మాస్కులకు ఎలాంటి కొరతా లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
13. గాంధీ హాస్పిటల్‌ ఐసోలేషన్‌ వార్డు హౌస్‌ ఫుల్‌ అయింది. గాంధీ ఆసుపత్రికి కెపాసిటీకి మించి కరోనా అనుమానిత కేసులు వస్తున్నాయి. ఐసోలేషన్‌లో ఉన్న పడకలు 40 మాత్రమే.. కానీ 40 గంటల వ్యవధిలో గాంధీకి 50 మంది అనుమానితులు వచ్చారు. దీంతో బెడ్ల కొరతతో పెయిడ్‌ రూమ్స్‌ను సైతం ఐసోలేషన్‌కి వినియోగిస్తున్నారు. తక్కువ సిమ్‌టమ్స్‌ ఉన్నవారిని హౌం ఐసోలేషన్‌కు వైద్యులు ప్రిఫర్‌ చేస్తున్నారు.
14. కరోనా బిజినెస్‌: వాటి ధర ఇప్పుడెంతో తెలుసా?
సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా కలకలం రేగింది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో మహేంద్రహిల్స్‌ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఆ ప్రాంత రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లోని పలు స్కూళ్లు బుధవారం సెలవు కూడా ప్రకటించాయి. పొరుగునే ఉన్న అడ్డగుట్టలో సైతం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను తిరిగి ఇళ్లకు పంపించివేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పలు విద్యాసంస్థల్లో మాస్కులు ధరించి పిల్లలు తరగతులకు హాజరయ్యారు. ఈనేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
*ఒక్కసారిగా పెరిగిన ధరలు..
కరోనా భయాల నేపథ్యంలో వ్యాపారులు నోటి మాస్కులకు అమాంతం రేట్లు పెంచేశారు. రెండు లేయర్లతో ఉన్న మాస్క్‌ హోల్‌సేల్‌ ధర రూ.1. 60 పైసలు కాగా, కొందరు మెడికల్‌ దుకాణాదారులు ఒక్కోదానికి రూ.20 నుంచి 25 వరకు వసూలు చేస్తున్నారు. రూ.30-40 విలువ చేసే ఎన్‌95 మాస్కును రూ.300 వరకు అమ్ముతూ ప్రజల్ని దోచేస్తున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద మాస్కులు డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్‌ అమ్మకందార్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మాస్కులకు ఎలాంటి కొరతా లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
15. ఢిల్లీలో ఇటలీ పర్యాటకులు.. 15 మందికి కరోనా
భారత పర్యటనకు వచ్చిన 15 మంది ఇటలీ దేశస్థులకు కరోనా వైరస్‌ సోకింది. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వీరి రక్త నమూనాలను సేకరించి.. పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఈ పదిహేను మందికి కరోనా సోకినట్లు పుణె ల్యాబ్‌ నిర్ధారించింది. దీంతో 15 మంది పర్యాటకులను ఢిల్లీలోని చావ్లా ఐటీబీపీ కేంద్రానికి తరలించారు. 15 మందిలో ఒక భారతీయుడు ఉన్నారు. ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఇండియన్‌ కూడా ఉన్నారు. వీరిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నారు. భారత పర్యటన కోసం ఇటలీ నుంచి మొత్తం 23 మంది పర్యాటకులు గత నెలలో రాజస్థాన్‌కు వచ్చారు. అయితే మొదట ఒకరికి మాత్రమే కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆయన భార్యతో పాటు మిగతా వారికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వైరస్‌ సోకిన వారి సంఖ్య ఇండియాలో 21కి చేరింది. 21 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకులు, ఒక ఇండియన్‌(ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసులు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
16. ప్రపంచ దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో
కరోనా(కొవిడ్-19)వైరస్‌ వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3 వేల మందికి పైగా మృతిచెందగా 90 వేల మంది దీని బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కరోనాను అడ్డుకొనేందుకు ఉపయోగించే వైద్య పరికరాల కొరతపై ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌ సోకకుండా రక్షణగా ఉపయోగించే వైద్య పరికరాల ధరలు పెరిగి, వాటికి డిమాండ్ ఏర్పడుతున్న కారణంగా వైద్య ఉత్పత్తుల తయారీ సంస్థలు, ప్రభుత్వాలు 40 శాతం మేర ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేసింది.దీనిపై డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్‌ జనరల్ టెడ్రాస్‌ అధానోమ్‌ గెబ్రెయేసస్‌, జెనీవాలో మాట్లాడుతూ ‘‘క్లుప్తంగా చెప్పాలంటే ఫ్లూ కంటే కొవిడ్‌-19 తక్కువ తీవ్రతతో వ్యాపిస్తుంది. ఇది అనారోగ్యం బారిన పడని వ్యక్తుల నుంచి వ్యాపించడంలేదు. దీని కోసం ఇప్పటి వరకు ఎటువంటి మందు కనుగొనలేదు’’ అని తెలిపారు. ఈ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్‌95 మాస్క్‌ల ధరలు మూడు రెట్లు, రక్షణగా ధరించే గౌన్ల ధరలు రెండు రెట్లు పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రతి నెలా 89 మిలియన్‌ మాస్కులు, 76 మిలియన్‌ గ్లౌజులు, 1.6 మిలియన్‌ కళ్ల అద్దాల అవసరం ఉందని తెలిపింది.
17. కరోనా ఎఫెక్ట్‌: అన్నీ రెడీ అయ్యాక వద్దన్నారు!
కోవిడ్‌-19 ఎఫెక్ట్‌ శుభకార్యాలపై కూడా పడింది. వివాహ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్‌ ఘనంగా జరుపుకుందామని భావించిన ఓ జంట కరోనా భయంతో ఫంక్షన్‌ను వాయిదా వేసుకుంది. ఈ సంఘటన చింతల్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే గోపాల్ రెడ్డి, భారతీ దంపతులు తమ 25వ పెళ్లిరోజు వేడుక (సిల్వర్‌ జుబ్లీ)ను గురువారం జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, హైదరాబాద్‌లో కరోనా తొలి కేసు నమోదు కావడంతో వారు అప్రమత్తమయ్యారు.
18. దేశంలో 28 మందికి కరోనా: కేంద్ర మంత్రి
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పటిష్ఠ చర్యలు చేపట్టామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు గుర్తించామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేస్తున్నామన్నారు. ఇరాన్‌లో కూడా ఒక ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇరాన్‌ నుంచి వచ్చే భారతీయులకు అక్కడే పరీక్షలు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఇటలీ నుంచి వచ్చిన బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. 45 మందికి వైరస్‌ లేదని తేలిందని మరో ఇద్దరికి సంబంధించి శాంపిల్స్‌ను పుణెకు పంపించామని చెప్పారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి గాంధీలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నాడని వివరించారు.
19. కరోనా ఎఫెక్ట్ తో మెట్రో క్లీన్ .. సిబ్బందికి సేఫ్టీ ఏది?
కరోనా వైరస్ వ్యాప్తితో తెలంగాణలో అలర్ట్ అయ్యారు అధికారులు.అటు మెట్రో అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మెట్రో రైలు, స్టేషన్లను క్లీన్ చేయిస్తున్నారు. డిటర్జెంట్, క్రిమిసంహారక మందులతో సిబ్బంది మెట్రోను కడుగుతున్నారు. అయితే మెట్రో రైళ్లలో ,స్టేషన్లలో క్లీన్ చేస్తున్న సిబ్బంది ముఖానికి, చేతులకు ఎలాంటి మాస్క్ లు కానీ, గ్లోవ్స్ వేసుకోకుండా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసేదే వైరస్ వ్యాప్తి చెందకుండా.. మరీ సిబ్బందికి వైరస్ సోకదా? సిబ్బంది పట్ల అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఏమిటంటూ విమర్శలు వస్తున్నాయి.
20. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా కేసులు భారత్‌లో కూడా వెలుగులోకి వస్తుండటంతో బెంగళూరు ప్రభుత్వం అక్కడి మెట్రో రైళ్లు, బస్సులలో పలు రకాలుగా క్లీనింగ్ చర్యలు చేపట్టింది. బస్సులు, రైళ్లలోని అద్దాలు, డోర్లు, డోర్ హ్యాండిల్స్ లాంటివన్నీ శుభ్రం చేయాలని బెంగళూర్ బీఎంటీసీ అక్కడి అధికారులను ఆదేశించింది.బెంగుళూర్‌లో ఎలాగైతే రైళ్లు, బస్సులను శుభ్రం చేస్తున్నారో అలాగే తెలంగాణలో కూడా శుభ్రం చేయాలని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులను, ఆర్టీసీ అధికారులను కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో పాటు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ పువ్వాడ అజయ్‌ను కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బెంగుళూరులో రవాణ కోసం ఉపయోగించే మెట్రో రైళ్లను, బస్సులను అక్కడి అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. అలాగే మన దగ్గర కూడా వీలైనంత త్వరగా మెట్రో రైళ్లను, బస్సులను శుభ్రం చేయాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
21. కరోనా వైరస్ సోకకుండా ఇట్లా చేస్తే సేఫ్…
కరోనా లేదా కొవిడ్ వైరస్ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ జబ్బు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ విస్తరిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, వియత్నాం దేశాల్ని కలవరపెడుతోంది. లేటెస్ట్గా మన దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో అడుగుపెట్టింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ వైరస్ అంటేనే అందరూ భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలి.కరోనా వైరస్ సైజులో పెద్దది. ఒక కణం వ్యాసం 400–-500 మైక్రోలు. అందువల్ల ముసుగు వేసుకుంటే వైరస్ చొరబడకుండా ఆపొచ్చు. ఇది గాల్లో స్థిరంగా ఉండదు. గాలి ద్వారా వ్యాపించదు. మెటల్ వస్తువులపై 12 గంటల పాటు బతికి ఉంటుంది. అందువల్ల ఆయా ఐటమ్స్ని పట్టుకున్నాక చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఫ్యాబ్రిక్ మెటీరియల్పైన కరోనా వైరస్ పడితే 9 గంటల పాటు ఉంటుంది. కాబట్టి బట్టల్ని శుభ్రంగా ఉతకాలి లేదా 2 గంటల సేపు ఎండలో ఆరేయాలి. కరోనా వైరస్ మనిషి చేతులకు అంటుకుంటే 10 నిమిషాలు ప్రాణాలతో ఉంటుంది. అలా ఉండకూడదంటే జేబులో ఎప్పుడూ ఆల్కహాల్ స్టెరిలైజర్ని ఉంచుకోవటం బెటర్. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా, తీసుకున్నా వెంటనే చేతులను స్టెరిలైజర్తో వాష్ చేసుకోవాలి. కరోనా వైరస్ 26–-27 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్కి గురైతే చనిపోతుంది. ఎందుకంటే ఇది వేడి ప్రాంతాల్లో మనుగడ సాగించలేదు. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే వేడి నీరు తాగాలి. ఎండలో కూర్చోవాలి. ఐస్ క్రీం, చల్లటి పదార్థాలు తినొద్దు, తాగొద్దు.
***దూరం.. దూరం..
వెచ్చని, ఉప్పు నీటితో నోటిని పుక్కిలించుకోవటం ద్వారా టాన్సిల్స్ సూక్ష్మక్రిములు చనిపోయి ఊపిరితిత్తుల్లోకి చేరవు. వీటితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల్నీ పాటించాలి. అవి.. చేతులను నీట్గా కడుక్కోకుండా ముక్కు, నోటి దగ్గర పెట్టుకోవద్దు. కరోనా వైరస్ సోకినవారు తుమ్ముతున్నప్పుడు ముక్కుకి టిష్యూ లేదా కర్చీఫ్ పెట్టుకోవాలి. ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగాలి. దగ్గు, తుమ్ములు, జ్వరం ఉన్నోళ్లకీ మనకీ మధ్య కనీసం మీటర్ (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి. విదేశాలకు వెళితే నాన్ వెజ్ని బాగా ఉడికించే తినాలి. పచ్చిగా ఉన్నవాటిని లేదా సగం ఉడికిన మాంసాన్ని, గుడ్లను తినకుండా ఉండాలి.
***ప్రతిఒక్కరూ తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు..
కరోనా వైరస్ ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. కాబట్టి వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్కనోళ్లకు వచ్చే ప్రమాదం ఉంది. మనిషి మాట్లాడినప్పుడు తుప్పర్ల ద్వారా సోకే ఛాన్స్ ఉంది. పేషెంట్ని టచ్ చేసినా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రోగులు ముట్టుకున్న వస్తువులను మనం పట్టుకున్నా డేంజరే. పరిచయంలేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. వ్యాధి ప్రస్తుతం తీవ్రంగా ఉంది కాబట్టి మనకు తెలియనివారితో కలిసి మెలిసి తిరగొద్దు. ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు. వ్యాధి కారకాలు ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది కాబట్టి అపరిచితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్తోనే పోవాలి. కొద్ది సమయంలోనే, ఒకేసారి చాలా మందికి వ్యాధి సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరి. జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. గర్భిణిలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు బీ కేర్ఫుల్. చలి ప్రదేశాల్లో తిరగొద్దు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నోళ్లు బయటకు రావొద్దు.
****అన్నింటికీ మించి..
దగ్గు, జ్వరం వచ్చినోళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉండి బాగా నీళ్లు తాగాలి. ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్లను ముందే కలవాలి. వ్యాధి తీవ్రమైతే ప్రాణాల మీదకి వస్తుంది. నొప్పి, జ్వరం, దగ్గుకు మందులు వాడాలి. నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్ ఇవ్వొద్దు. కొవిడ్‌–-19 (కరోనా) వైరస్‌ అనగానే ఆందోళన పడొద్దు. ధైర్యంగా ఉండాలి. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సౌత్ ఇండియాలో టెంపరేచర్లు 28–30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉన్నందున కరోనా వ్యాపించడం కష్టం. ఇంత వేడి వాతావరణంలో 99 శాతం వైరస్ శాతం చనిపోతుంది. కరోనా వైరస్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్(104)ను ఏర్పాటు చేసింది.
****రోగ లక్షణాలు
2019 నోవెల్ కరోనా వైరస్ (2019 ఎన్సీఓవీ) లక్షణాలు.. దగ్గు, జలుబు, ముక్కు కారుతూ ఉండటం, జ్వరం,- తలనొప్పి,- గొంతు మంటగా ఉండటం, ఒళ్లు నొప్పులు, ఛాతీలో నొప్పి, న్యుమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు. దీనివల్ల కిడ్నీల పనితీరు దెబ్బతిని చివరికి చనిపోయే ప్రమాదం ఉంది.
22. ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి
ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి చెందారు. డెబ్భయేళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా అతనికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ రోగిని సులైమనియాలోని ఈశాన్య ప్రాంతంలో నిర్బంధించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు. దేశంలో ఇదే తొలి కరోనా మరణమని ఇరాక్‌ పభుత్వం ప్రకటించింది. కాగా.. ఇరాక్‌లో ఇప్పటి వరకు 32 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు వ్యాధి నిర్దారణ అయినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అందులో కొంతమంది ఇటీవల ఇరాన్‌ నుంచి వచ్చినట్లు తెలిపింది.
23. తూర్పుగోదావరి రాజమండ్రి
విదేశాల నుంచి వచ్చిన కోనసీమ లోని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు కరోనా అనుమానిత లక్షణాలుపై ఆరా తీసిన ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ళనానికాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికార్ల తో ఫోన్ లో మాట్లాడి కరోనా పై వివరాలు తెలుసుకున్న మంత్రి నానికాకినాడ,రాజమండ్రి ఆస్పత్రిలలో కరోనా కేసులకై ప్రత్యేక ఐసోలేషన్ వార్డులలో ఏర్పాట్లపై సమీక్షడాక్టర్లు ,అధికారులు కరోనా కోవెడ్ 19 అనుమానిత కేసులపై అప్రమత్తంగా వుండాలని మంత్రి ఆదేశం
24. ఏపీలో 11 కరోనా అనుమానిత కేసులు!
ఏపీలో కొవిడ్‌-19 (కరోనా)వైరస్‌ కలకలం రేపుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. విశాఖలో 5, శ్రీకాకుళంలో 3, ఏలూరు, విజయవాడ, కాకినాడలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనా అనుమానిత కేసులతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అనుమానితులను వెంటనే ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
25. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దని వైద్యులు సూచిస్తోన్న నేపథ్యంలో చాలా చోట్ల ప్రజలు ఫంక్షన్‌లను వాయిదా వేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని చింతల్‌లో దంపతులు గోపాల్‌ రెడ్డి, భారతి తమ 25వ పెళ్లిరోజు వేడుకను జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.రేపు ఈ వేడుక జరగాల్సి ఉండగా ఫంక్షన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు వారు తమ బంధుమిత్రులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఇప్పటికే వారు ఫంక్షన్‌ హాల్‌తో పాటు కేటరింగ్‌ వంటి అన్ని బుకింగ్‌లు చేసుకున్నారు. ఇటువంటి ఘటనలే పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి.
విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాలు ‘మిలాన్‌ -2020’ని కూడా వాయిదా వేశారు. ఈ నెల 18 నుంచి 28 వరకు నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పాల్గొనేందుకు పలు దేశాలను ఆహ్వానించారు. దాదాపు 30 దేశాలు ఇందుకు అంగీకారం కూడా తెలిపాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ‘మిలాన్‌ -2020’ని వాయిదా వేశారు…
26. కోవిడ్‌ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించాలంటూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి ఈ మేరకు బుధవారం హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో హోలీ సంబరాలు జరుగనున్నాయని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్‌ పిటిషన్‌లో కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్‌ బారినపడకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. కోవిడ్‌ వైరస్ విజృంభిస్తున్న‌ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రజలు కూడా వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మోడీ ట్విటర్‌లో తన సందేశాన్ని ట్వీట్‌ చేశారు..
27. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈ నెల హైద్రాబాద్ LB స్టేడియం లో, 15 వ తారీకున CAA కు మద్దతుగా తలపెట్టిన అమిత్ షా సభ రద్దు.
28. కరోనా ఎఫెక్ట్.. ఒలింపిక్స్‌ వాయిదా?
అనుమానమే నిజమయ్యేలా ఉంది..! నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడా సంబురం ఒలింపిక్స్‌‌కు కరోనా కాటు వేయనుంది..! కొవిడ్ వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌‌ వాయిదా పడే ప్రమాదం కనిపిస్తోంది..! విశ్వక్రీడలను ఈ ఏడాది ఎప్పుడైనా నిర్వహించుకునే అధికారం తమకు ఉందని జపాన్‌‌ ఒలింపిక్‌‌ మినిస్టర్‌‌ ఆ దేశ పార్లమెంట్‌‌లో చెప్పడం క్రీడారంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది..! మరోవైపు ఒలింపిక్స్‌‌ను సక్సెస్‌‌ఫుల్‌‌గా నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నామని ఇంటర్నేషనల్‌‌ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్‌‌ థామస్‌ బాచ్‌‌ చెబుతున్నారు..! కానీ, పరిస్థితి చూస్తుంటే జులై 25న మొదలవ్వాల్సిన ఒలింపిక్స్.ఏడాది చివరకు వాయిదా పడేలా ఉన్నాయి.
* ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌‌‌‌ వైరస్‌‌‌‌ వల్ల టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ నిర్వహణపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. షెడ్యూల్‌‌‌‌ ప్రకారం విశ్వక్రీడలను విజయవంతంగా నిర్వహిస్తామని ఇంటర్నేషనల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కమిటీ(ఐఓసీ) ప్రెసిడెంట్‌‌‌‌ థామస్‌‌‌‌ బాచ్‌‌‌‌ గతవారం చెప్పినప్పటికీ పోస్ట్‌‌‌‌పోన్‌‌‌‌ వార్తలు ఆగడం లేదు. మెగా ఈవెంట్‌‌‌‌ వాయిదా తప్పదనే ప్రచారం కొనసాగుతోంది. జపాన్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ సికో హషిమోటో మంగళవారం పార్లమెంట్‌‌‌‌లో చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. కాంట్రాక్ట్‌‌‌‌ నిబంధనల ప్రకారం ఒలింపిక్స్‌‌‌‌ను 2020లో ఎప్పుడైనా నిర్వహించవచ్చు అని హషిమోటో అనడం మరింత ఆందోళన పెంచింది. అయితే గేమ్స్‌‌‌‌ను రద్దు చేసే అధికారం మాత్రం ఐవోసీకే ఉందని ఆమె స్పష్టత ఇచ్చారు. కానీ కొవిడ్‌‌‌‌ మరింత వ్యాప్తి చెందితే గేమ్స్‌‌‌‌ పరిస్థితేంటి అని హషిమోటోను ప్రశ్నించగా.. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే లూసానెలో జరిగిన ఒలింపిక్‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌లో థామస్‌‌‌‌ బాచ్‌‌‌‌ మాట్లాడుతూ జూన్‌‌‌‌ 15–17 తేదీల్లో జరిగే ప్రి గేమ్స్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ బోర్డు మీటింగ్‌‌‌‌లో చాలా అంశాలపై తుది నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దీని తర్వాత జులై 18–19 తేదీల్లో టోక్యో వేదికగా ఐవోసీ బోర్డు మరోసారి సమావేశం కానుంది. దీంతో చివరి నిమిషం దాకా ఉత్కంఠ తప్పేలా లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం జులై 25 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి పారాలింపిక్స్‌‌‌‌ మొదలవుతాయి. ఒలింపిక్స్‌‌ను వాయిదా వేస్తే.. తిరిగి ఈ ఏడాది చివర్లో నిర్వహించే చాన్సుంది. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌‌‌‌లో ఏదైనా మార్పు జరిగితే బ్రాడ్‌‌‌‌కాస్టర్లు పెద్ద మొత్తంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఒలింపిక్స్‌‌‌‌ మూడు సార్లు రద్దు అయ్యాయి. అన్ని సార్లు యుద్ధాలే కారణం.
*జపాన్‌‌‌‌లో పరిస్థితేంటి..
ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం జపాన్‌‌‌‌లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 230 మంది కరోనా వైరస్‌‌‌‌ బారినపడ్డారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌‌‌‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు స్కూల్స్‌‌‌‌కు సెలవులు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్‌‌‌‌ సంబంధింత ఈవెంట్స్‌‌‌‌తోపాటు ఇతర స్పోర్టింగ్‌‌‌‌ కాంపిటిషన్స్‌‌‌‌ కూడా రద్దు చేశారు. మెగా ఈవెంట్‌‌‌‌ ఆర్గనైజర్స్‌‌‌‌ ఇంకా 17 టెస్ట్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ఏప్రిల్‌‌‌‌ 4–6 తేదీల్లో జరిగే జిమ్నాస్టిక్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ తప్ప మిగిలిన వాటిలో స్థానిక అథ్లెట్లే పాల్గొంటారు. మంగళవారం జరగాల్సిన పారాలింపిక్‌‌‌‌ వీల్‌‌‌‌చైర్‌‌‌‌ రగ్బీ టెస్ట్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ను రద్దు చేశారు. జపాన్‌‌‌‌ ప్రొఫెషనల్‌‌‌‌ బేస్‌‌‌‌బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ను ఖాళీ స్టాండ్స్‌‌‌‌ మధ్య నిర్వహిస్తున్నారు. సాకర్‌‌‌‌ జే–లీగ్‌‌‌‌ను మార్చి 18కి వాయిదా వేశారు. ప్రతిష్టాత్మక టోక్యో మారథాన్‌‌‌‌ను 100 మంది రన్నర్స్‌‌‌‌తో పూర్తి చేశారు.
*ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌ ఈవెంట్లకూ ముప్పు
వివిధ దేశాల్లో జరగాల్సిన ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌ ఈవెంట్లను కూడా కొవిడ్‌‌‌‌ ప్రభావితం చేస్తోంది. తైవాన్‌‌‌‌ వేదికగా ఏప్రిల్‌‌‌‌లో జరగాల్సిన బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ జూన్‌‌‌‌కు వాయిదా పడింది. అలాగే, చైనాలో షెడ్యూల్‌‌‌‌ చేసిన అన్ని క్వాలిఫయిర్స్‌‌‌‌ను వేరే దేశాలకు తరలిస్తున్నారు. చైనాకు చెందిన పలు జట్లు, చాలా మంది అథ్లెట్లు వేరే దేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు.