Devotional

గురువారం నుండి తిరుమలలో తెప్పోత్సవాలు

Telugu Devotional News-Teppotsavam 2020 In Tirumala TTD

1. నేటి నుండి తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు – 04/03
తిరుమలలోని స్వామి పుష్కరిణిలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను తితిదే నిర్వహించనుంది. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు వివిధ రూపాల్లో పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు తిరుమలలోని ఆర్జితం కౌంటర్లో రూ.200 చెల్లించి టికెట్ ఖరారు చేసుకోవచ్చు. వేడుకల కారణంగా ఈ నెల 5, 6 తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, 7, 8, 9 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, 9న పౌర్ణమి గరుడ సేవను తితిదే రద్దు చేసింది.
2. యాదాద్రిలో ఘనంగా ఎదుర్కోలు
యాదాద్రి పుణ్యక్షేత్రంలోని వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక పర్వాలు మంగళవారం రాత్రి నిర్వహించిన ఎదుర్కోలుతో మొదలయ్యాయి. ఉదయం జగన్మోహిని అలంకార సంబరాన్ని, రాత్రి వేళ ఎదుర్కోలు ఉత్సవాన్ని చేపట్టారు. పెళ్లి చూపులు, మాటాముచ్చట, ఒప్పందం, పూలు, పండ్లు, వర పూజ తతంగాలను జరిపారు. కల్యాణ ముహూర్తాన్ని నిశ్చయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టువస్త్రాలు, తలంబ్రాలను అందజేశారు.
3. మన కోసం మరో షిరిడీ
షిరిడీలో కొలువై ఉన్న సాయిబాబాను భక్తులు ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు. దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు మహారాష్ట్రలోని షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల భక్తుల కోసం భారీ స్థాయిలో మరో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించినట్లు నామక్కల్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ అధినేత, ‘దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ’ బోర్డు చైర్మన్‌ కే చంద్రమోహన్‌ తెలిపారు. ఈనెల 8న వెయ్యిశంఖాలతో మండలపూజ నిర్వహించనున్న సందర్భంగా ఆలయ నిర్మాణానికి దారితీసిన అనుభవాలు, అనుభూతులను మీడియాకు వివరించారు. ‘అందరు దేవుళ్లను సాధారణంగా కొలవడమేగానీ షిరిడీ బాబా పట్ల ప్రత్యేకమైన భక్తిప్రపత్తులు ఉన్నవాడిని కాదు. ఒకరోజు స్నేహితునితో కలిసి 2008లో షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాను. కొద్ది రోజుల్లోనే నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక పాప నన్ను ఉద్దేశించి బాబా ఆలయాన్ని నిర్మించాలని కోరింది. ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం మీ ఊరికి సమీపంలోనే ఉందంటూ ఒక వేపచెట్టు, పక్కనే బండరాయి, సమీపంలో తాటిమాను ఉన్న ప్రాంతాన్ని చూపింది. ఉలిక్కిపాటుతో మేల్కొన్న నేను కలలో చూసిన ప్రాంతం కోసం ఎంతగానో అన్వేషించగా తిరుచ్చిరాపల్లి జిల్లా అక్కరపట్టి, సమయపురం, టోల్‌గేట్‌ సమీపంలో సరిగ్గా అదేస్థలం కనపడింది. ఆ స్థల యజమానైన ఒక రైతు ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా ఆదేశాల ప్రకారం అక్కడే నిర్మించడం ఎలాగని ఆలోచనలో పడగా సరిగ్గా వారం రోజుల తరువాత అదే రైతు నన్ను వెతుక్కుంటూ వచ్చి అర ఎకరా స్థలాన్ని ఇవ్వడం విశేషం. వెంటనే 2009లో చిన్నపాటి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాను. పెద్ద సంఖ్యలో భక్తుల రాక పెరగడంతో అన్నదాన కార్యక్రమాలను చేపట్టాను.షిరిడీ పద్ధతుల్లో రోజుకు మూడు సార్లు అదే భాషలో హారతులు ప్రవేశపెట్టి పెద్ద ఆలయాన్ని నిర్మించాలని 2016లో నిర్ణయించుకున్నాను. జర్మనీ నుంచి అత్యంత ఖరీదైన అలంకరణ రాళ్లను తెప్పించి రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ ఆలయ నిర్మాణం పూర్తికాగా జనవరిలో కుంభాభిõÙకం చేసి బాబాకు అంకింతం చేశాం. కుంభాభిõÙక మహోత్సవానికి తమిళనాడుతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 80 వేల మంది భక్తులు హాజరైనారు. ఆలయానికి అనుబంధంగా శాశ్వత ప్రాతిపదికన ఉచిత వైద్యం, వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాన’ని ఆయన తెలిపారు.
*** మహిమాన్వితుడైన బాబా
ఆలయ నిర్మాణం తలపెట్టినప్పటి నుంచి బాబా ఆశీస్సులతోపాటు ఎన్నో మహిమలు చోటుచేసుకున్నాయని చంద్రమోహన్‌ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల బాబా జన్మస్థలంపై వివాదం తలెత్తగా షిరిడీలోని బాబా ఆలయాన్ని మూడు రోజులపాటు మూసివేశారు. అనుకోకుండా అవే మూడు రోజుల్లో ఇక్కడి కొత్త ఆలయంలో బాబాకు కుంభాభిషేకం జరగడం అనూహ్యమైన పరిణామం. తిరుపతి నుంచి చెన్నైకి కారులో వస్తూ పూందమల్లికి 10 కి.మీ దూరంలో రోడ్డుపక్కన ఉన్న ఒక పెద్ద బోర్డును చూసి ఆలయ ప్రచారానికి ఎంత ఖరీదైనా చెల్లించి వాడుకోవాలని ఆశించగా వారు నిరాకరించారు. ప్రయాణం సాగుతుండగానే కొద్దిసేపట్లో వారే ఫోన్‌ చేసి ఉచితంగా ఇస్తామన్నారు. మరికొద్ది దూరంలో మరో బోర్డును దాని యజమాని కూడా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.
*8న మండల పూజ
కుంభాభిషేకం ముగిసిన సందర్భంగా ఈనెల 8వ తేదీన వెయ్యి శంఖాలతో మండల పూజను చేపడుతున్నట్లు దక్షిణాది షిరిడీ సాయిబాబా ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ టి సురేష్‌ తెలిపారు. అనతికాలంలోనే ఆలయ విశిష్టత నలు చెరగులా ప్రచారం కావడంతో తమిళనాడు టూరిజం శాఖలో చేర్చారు. అంతేగాక భక్తుల సౌకర్యార్థం తిరుచ్చిరాపల్లి నగరం నుంచి ఆలయం వద్దకు టూరిజంశాఖ ఉచిత బస్సులను నడుపుతోంది. ఆలయ సందర్శనార్థం వచ్చే తెలుగువారు 9600005060 సెల్‌ఫోన్‌ నంబరులో సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందజేయగలనని సురేష్‌ తెలిపారు.
4. పంచాంగము 04.03.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: శుక్ల
తిథి: నవమి ఉ.09:09 వరకు
తదుపరి దశమి
వారం: బుధవారం (సౌమ్య వాసరే)
నక్షత్రం: మృగశిర ఉ.07:06 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ప్రీతి ఉ.11:25 వరకు
తదుపరి ఆయుష్మాన్
కర: కౌలవ ప.01:54 వరకు
తదుపరి గరజి
వర్జ్యం: ప.03:33 – 05:09
దుర్ముహూర్తం: 12:04 – 12:51
రాహు కాలం: 12:27 – 01:56
గుళిక కాలం: 10:58 – 12:27
యమ గండం: 08:01 – 09:29
అభిజిత్ : 12:04 – 12:50
సూర్యోదయం: 06:32
సూర్యాస్తమయం: 06:23
వైదిక సూర్యోదయం: 06:35
వైదిక సూర్యాస్తమయం: 06:19
చంద్రోదయం: ప.01:03
చంద్రాస్తమయం: రా.01:37
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: పశ్చిమం
ఆనంద నవమి వ్రతం
పూర్వాభాద్ర కార్తె
5. రాశిఫలం – 04/03/2020
తిథి:
శుద్ధ నవమి ఉ.8.35 , కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
మృగశిర ఉ.6.41
వర్జ్యం:
మ.3.09 నుండి 4.45 వరకు
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. మానసికాందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి వుంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
6. ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జ‌రుగుతోంది. స్వామివారి కళ్యాణమహోత్సవంలో దేవ‌దాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్వామి వారికి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆల‌యానికి వ‌చ్చిన మంత్రి అల్లోల దంప‌తుల‌కు ఆల‌య ఈవో, అధికారులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లుక‌గా… అర్చ‌కులు వేదాశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు. అనంత‌రం మంత్రి అల్లోల దంప‌తులు ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహెందర్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, త‌దిత‌రులు పాల్గొన్నారు