Kids

ప్రపంచం అది కాదని చెప్పండి

Keep your kids away from smartphone-Telugu Kids News

* కాలికి ముల్లు గుచ్చుకున్నా సరే… దాన్ని ఎలా తీయాలో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ చూసే కాలం ఇది.

ఏ చిన్న సమస్య వచ్చినా గూగుల్‌ తల్లి సహాయం తీసుకునేవారూ పెరిగారు.

దీంతో చిన్నచిన్న సమస్యలకు సైతం భయపడుతున్నారు. అదే ఆందోళన, కుంగుబాటుకు దారితీస్తోంది.

* ఏ వస్తువు ఉన్నా, లేకపోయినా సరే… ఫోన్‌ వెంట లేకపోతే మాత్రం ఇప్పటి వారు జీవించడం చాలా కష్టంగా భావిస్తున్నా రు.

👉అదే ప్రపంచం కావడంతో ఇతరులతో మాట్లాడే అవకాశమూ తగ్గిపోయింది.

మొబైలే ప్రపంచంగా మారిపోయింది. వీటన్నింటితో ఎవరితో ఎలా ఉండాలో వారికి అర్థం కావడంలేదు.

👉ఇతరులు ఓ మాట అన్నా… ఎలా స్వీకరించాలో తెలియని పరిస్థితి.

దాంతో ఏ విషయంలోనూ సర్దుకోలేకపోతున్నారు. చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూడటం మొదలుపెడుతున్నారు.

ఇవన్నీ ప్రవర్తనాపరమైన మార్పులకు దారి తీస్తున్నాయి.