Health

ఏపీలో ఒక్క కొరోనా కేసు లేదు:డీజీపీ-TNI కథనాలు

AP DGP Gautam Savang Speaks About Corona

* ఆంధ్రప్రదేశ్‌లో లో ఇప్పటి వరకు కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వదంతులు నమ్మవద్దు… మీడియా, సోషల్ మీడియా లో కరోనా వైరస్ పై అపోహాలు సృష్టించి హాల్ చల్ చేస్తే కేసులు నమోదు చేస్తాం. ప్రతి రోజూ రాష్ట్ర వైద్య కమిషనర్ మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖ కరోనా పై ప్రత్యేక బులెటెన్ రిలీస్ చేస్తుంది. వదంతులు సృష్టించి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తే కేసులు నమోదు చేయమని జిల్లా పోలీసులు కు ఉత్తర్వులు. జారీ.

* ఢిల్లీలోని ఉత్త‌మ్ న‌గ‌ర్‌కు చెందిన మరో వ్య‌క్తికి క‌రోనా వైరస్‌ సోకిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్య‌ద‌ర్శి సంజీవ కుమార్ ప్రకటించారు. దీంతో భారత్‌లో కరోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 31కి చేరుకుంది.

* కరోనా భయాల నేపథ్యంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈనెల  31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులల ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు వేయొద్దని తెలిపింది. దాని బదులు రిజిస్టర్‌లో హాజరు నమోదు చేసుకోవాలని సూచించింది. వైరస్‌ చేరిన ఉపరితలాన్ని తాకడం వల్ల కరోనా బారిన పడే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

* జిల్లాలో మరో అనుమానిత కరోనా కేసు. జగ్గయ్యపేటలో కరోనా అనుమానితురాలు. కరోనా అనుమానితురాలిని గుర్తించిన అధికారులు. జగ్గయ్యపేటకు చెందిన పెద్దిరెడ్డి బాలశ్రీ అనే యువతిని కరోనా అనుమానిత లక్షణాలు. వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడకు తరలింపు. ప్రస్తుతం ఆమెకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నా వైద్యులు.