Movies

ముక్కు షేవ్ చేసుకోమన్నారు

Jacqueline Fernandez Speaks Of Her Initial Days And Nose Shave Suggestions

చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో కొందరు వ్యక్తులు తనని పేరు మార్చుకోమని సూచించారని అంటున్నారు బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. శ్రీలంకకు చెందిన జాక్వెలిన్‌.. సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ముంబయిలో మకాం ఏర్పాటు చేసుకున్నారు. 2009లో ‘అల్లాదీన్‌’ చిత్రంతో నటిగా బాలీవుడ్‌కి పరిచయమైన ఆమె.. ఇప్పటివరకూ ఎందరో అగ్ర, యువ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా జాక్వెలిన్‌ ఓ ఆంగ్ల పత్రికవారు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారిలా. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు విభిన్నంగానే ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను నాలాగానే ఉండాలనుకున్నాను. ఆ సమయంలో కొందరు.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ అనే పేరు వినడానికి మరీ పాశ్చాత్యంగా, చాలా కొత్తగా ఉందన్నారు. కాబట్టి నా పేరుని ముస్కన్‌ అని మార్చుకోమన్నారు. కానీ నేను మాత్రం పేరు మార్చుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను. మరొకొందరైతే చిన్నప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ముక్కును కూడా మార్చుకోమన్నారు. (ముక్కును షేప్‌ చేయించుకోమన్నారు).’ అని జాక్వెలిన్‌ తెలిపారు.