Editorials

భారత మహిళా…నీ భద్రత ఎక్కడమ్మా?

A glimpse into safety issues of women in India-Telugu TNILIVE Editorials

భారతావని నిత్యం చదువుతున్న వార్త ‘నిర్భయ’ హంతకుల ఉరి తేదీ ఖరారు.. వాయిదా! ఃఉరిః సహేతుకమైనదా? కాదా? అంటే కాదనే చెప్తున్నాయి చాలా మహిళాసంఘాలు. అది వేరే సంగతి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఉన్న చట్టం అమలులో ఎదురవుతున్న సమస్యలు. చట్టాల్లోని లొసుగుల్ని నేరస్థులు ఉపయోగించుకుంటున్న తీరు ఃనిర్భయః ఉదంతం కళ్లకు కడుతోంది. నేటి సమాజంలో మహిళల దుస్థితిలో మార్పు రాలేదు సరికదా.. అంతకంతకూ భయోత్పాతం కలిగించే సంఘటన రోజుకొకటి దేశంలో ఏదో మూల జరుగుతోందనేది వాస్తవం. ఃస్వేచ్ఛః, ఃస్వాతంత్య్రంః అన్న మాటలకు అర్థమే లేకుండా పోతోంది. అర్ధరాత్రి కాదు కదా.. పట్టపగలైనా మహిళలకు రక్షణ లేని వ్యవస్థలో ఉన్నారు మహిళలు. ఏదో ఒక ఘోరం జరిగిన తర్వాత కొత్త చట్టం కళ్లు తెరుస్తోంది. కానీ, జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం తర్వాతా, దిశ యాప్‌ వచ్చినా మహిళల మీద అత్యాచారాలు, హత్యాచారాలు ఆగలేదు. ఈ నేపథ్యంలో ఆమెకున్న చట్టాలైనా ఉక్కు కవచాల్లా ఉండాలంటే.. అసలు చట్టాలేంటో.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి!
**చనిపోయాక అంత్యక్రియల్లాగ … తరచూ హత్యాచార సంఘటనల్లో చట్టపరమైన చర్యలు ఉంటున్నాయి. ఘోరాలను తొలి దశలోనే ఆపటం అసాధ్యమా అంటే సాధ్యమే అనేది సమాధానం. సాధ్యాసాధ్యాలు ఆచరణను బట్టే ఉంటాయి. సి.సి కెమెరాల వంటి ఆధునిక సాంకేతికతను మనం సరిగ్గా ఉపయోగించు కోలేకపోతున్నామా అనేది న్యాయనిపుణుల సందేహం. ఢిల్లీ అల్లర్లలోనూ మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కావడం దేనికి సంకేతం అనేది వ్యవస్థను నిగ్గదీసి అడుగుతున్న ప్రశ్న. ప్రజలకు స్వీయ రక్షణ హక్కులు ఉన్నాయి. ఆమె ఆత్మరక్షణ కోసం హత్య చేసినా చట్టం సానుకూలంగానే స్పందిస్తుంది. మహిళలకు మరిన్ని రక్షణ చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ మహిళాసంఘాలు ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్నవే. వాటి గురించి ఎంతమందికి తెలుసు అంటే.. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. వీటిపైన అవగాహన లేకపోవడం వల్ల సమస్య ఎదురైనప్పుడు మోసపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి స్త్రీ ఈ చట్టాల గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
**ఆత్మరక్షణ కోసం
స్నేహ యూనివర్శిటీ నుండి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో బస్టాండ్‌లో దిగి, అక్కడ తన స్కూటీ తీసుకుని ఊరు చివరున్న ఇంటికి వెళ్లాలి. ఇలా రోజూ వెళ్లడం స్నేహకు అలవాటే. కానీ ఆమె ప్రతిరోజూ భయపడుతూనే వెళ్లేది. ఆరోజు యూనివర్శిటీలో ఫ్రెండ్‌ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ వల్ల ఆలస్యమైంది. స్కూటీపై వెళుతున్న క్రమంలో దారంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే అటుగా వెళ్తున్న కారులో నుండి కుర్రోళ్లు కేకలు వేసుకుంటూ ఆమెను పక్క నుండి దూసుకుంటూ వెళ్లారు. ఆమెను చూసి మళ్లీ వెనక్కి వచ్చి, కారులోంచి తాగుతూనే ఆమెను చుట్టుముట్టి, మృగాల్లా తెగబడుతుంటే, ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్క క్షణంలో మెరుపులా ఒకతని చేతిలోని బాటిల్‌ను లాక్కొని, పగలగొట్టి, అతని కడుపులో కసితీరా పొడిచేసింది. అంతే రక్తం చిమ్ముతూ అతను అక్కడే కుప్పకూలిపోయాడు. మిగిలిన ఇద్దరూ భయంతో కారులో పారిపోయారు. దీని నుంచి కొద్దిసేపటికి తేరుకున్న స్నేహ ఇంటికి చేరిందేగానీ, తను చేసింది కరెక్టేనా? అని మధనపడింది..
**ఆత్మరక్షణకి సంబంధించిన శిక్షాస్మృతి (ఐ.పి.సి) సెక్షన్లు 100 నుండి ఐ.పి.సి 104 వరకూ ఉన్నాయి. తనకి ప్రాణ ప్రమాదం ఉన్నప్పుడు చేసిన ఎదురుదాడిలో ఎవరైనా మరణిస్తే అది నేరం కాదు. కానీ, ఆ విషయం రుజువు కావాలి. ప్రధానంగా అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతున్న పరిస్థితుల్లో.. మహిళలు ఆత్మరక్షణ కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ చట్టం ఒకరకంగా మహిళలకు భరోసాని ఇచ్చేది. అందుకే స్త్రీలు విపత్కర పరిస్థితుల్లో పిరికితనం పోకుండా ఎదురుతిరగాలి.
***గృహహింస
ప్రసన్న ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ప్రసవానికి వచ్చిన ఆమెను ఏడాదిన్నర అవుతున్నా భర్త కాపురానికి తీసికెళ్లడం లేదు. అప్పుడప్పుడు ఆమెను పుట్టింట్లోనే కలిసిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఎప్పుడు తీసికెళతావని నిలదీస్తే, చేతికి దొరికిన క్రికెట్‌ బ్యాట్‌తో ఆమెను విరగ్గొట్టేశాడు. ఆమె వంటి నిండా గాయాలే.. పైపెచ్చు ఆడపిల్లను కనడం ఆమె చేసిన నేరమంటూ ఆరోపణ. దీంతో ప్రసన్నకు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ స్నేహితురాలికి ఫోన్‌ చేసింది. స్నేహితురాలి సహకారంతో పోలీసు కేసు పెట్టింది.ఃః ఇలాంటి ప్రసన్నలు మనచుట్టూ కోకొల్లలు. కొన్ని సందర్భాల్లో భార్య అంగీకారం లేకుండా గర్భస్రావం చేయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రాణానికే ప్రమాదం. దీనికి సంబంధించినవే. ఐపిసి 312 నుండీ 316 సెక్షన్లు. ఇవి శిక్షార్హమైన నేరాలు. ఏడు నుండీ పదేళ్ల వరకు శిక్ష, జరిమానా విధించదగినవి. మహిళలు ఇలాంటివి జరగకుండా ఎదురు తిరగాలి. అవసరమైతే, పోలీసు కేసు పెట్టాలి.
కిడ్నాప్‌ చేస్తే..
సుగుణ కాలేజీ నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. తల్లీదండ్రులకు సరైన పనుల్లేక ఇంట్లో ఇబ్బందిగా ఉంది. ఆ పరిస్థితుల్లో అటుగా కారులో వచ్చిన సుబ్బారావు అంకుల్‌ సుగుణను పలకరించాడు. ఃఈ కష్టాలన్నీ ఇంకెన్నాళ్లమ్మా? ఎంచక్కా నా మాట వింటే మీ అమ్మానాన్న కూడా గుండెల మీద చేతులేసుకుని పడుకుంటారు!ః అన్నాడు. ఆ మాటలు విని, అతను చెప్పినట్లే రెండు రోజుల తర్వాత వెళ్లింది. అతనితో వెళ్లిన సుగుణ ఇంతవరకూ ఆచూకీ లేదు. తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు.ఃః సుగుణలాగా నేడు రాష్ట్రంలో అనేకమంది ఆడపిల్లలు కిడ్నాప్‌కు గురవుతున్నారు. అమ్మాయిలను వ్యభిచార గృహాల్లో అమ్మేస్తున్న ముఠాలు ఏదొక రూపంతో ఎర వేస్తుంటాయి. వాటి వలలో చిక్కకుండా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కేసుల్లో ఐపిసి సెక్షను 363 ప్రకారం కిడ్నాపు చేసిన నేరస్థుడికి ఏడేళ్ల జైలు, జరిమానా ఉండొచ్చు.
అత్యాచారాలు..
నిర్భయ, దిశ సంఘటనలకు ముందు తర్వాత అనేక అత్యాచారాలు జరిగాయి. నిర్భయ ఘటన తర్వాత వర్మకమిటీని వేసింది నాటి ప్రభుత్వం. ఆయన చేసిన సిఫారసులు నేటికీ అమలుకు నోచుకోకపోవడమే నిర్భయ నుండి నేటికీ జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట పడకపోవడం. అలాగే మహిళల మీద అత్యాచారాలు తరచుగా జరుగుతున్న నేరాలు. ఐపిసి 375, 376 దీనికి సంబంధించినవి. అత్యాచార నేరానికి కనీసం ఏడు సంవత్సరాలు శిక్ష ఉంటుంది. 376 బి, సి, డి, 377 వరకు అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లు.
***మోసాలు.. వేధింపులు..
వివాహ సంబంధం నేరాలు ఐపిసి సెక్షన్లు 493 నుండీ 498 వరకూ ఉంటాయి. నేరానికి తగిన శిక్షలుంటాయి. వివాహితులూ వివిధ కారణాలతో మోసపోతున్నారు. ఃఫేస్‌బుక్‌, టిక్‌-టాక్‌ః సామాజిక మాధ్యమాలు వచ్చాక అపరిచితులతో కమ్యూనికేషన్‌ చేయడం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. అనైతిక, వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. ఆధునికత అనర్థాలకు దారితీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మైనర్ల మీద లైంగిక నేరాల నిరోధానికి ఃఫోక్సోః చట్టం వచ్చింది. అలాగే గృహహింస (డొమిస్టిక్‌ వైలెన్స్‌) చట్టం, వరకట్న వేధింపుల నిరోధక చట్టం (ఐ.పి.సి – 498ఎ) అమలులో ఉన్నాయి. మహిళలకు కుటుంబ న్యాయస్థానాలు ఏకైక దిక్కుగా ఉంటున్నాయి. వారి పోషణ, మనోవర్తి, విడాకుల వంటి అవసరాలకు లాయరు లేకుండా కేసులు దాఖలు చేయవచ్చును. దిశ కేసు తర్వాత మహిళల రక్షణకు, ఆకతాయిల ఆట కట్టించటానికి పోలీసులు తక్షణ సాయం చేసేందుకు యాప్‌ను ఏర్పాటు చేశారు