DailyDose

విజయవాడ KLUలో కులఘర్షణలు-నేరవార్తలు

Caste Riots In VIjayawada Koneru Lakshmaiah Univ-Telugu Crime News Roundup Today

* కెఎల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య వర్గ పోరుయూనివర్సిటీ ఫెస్ట్ నిర్వవహణలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుఓ వర్గానికి చెందిన విద్యార్థిపై దాడి చేసి గాయపరచిన, ఇంకో వర్గానికి చెందిన విద్యార్థులువిద్యార్థులపై దాడిచేసిన వారిలో కొంతమంది విద్యార్దులు కానీవారు,బయట వ్యక్తులు కుడా ఉండటం గమనార్హం..యూనివర్సిటీలో రోజురోజుకు పెరుగుతున్న విషసంస్కృతి..కుల,మత, ప్రాంత, రాజకీయ రంగులు పూసుకుని గ్రూపులు కడుతున్న విద్యార్థులు..తమపై అకారణంగా ,కక్షపూరితంగా దాడి చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు.

* మేడికొండూరు గ్రామంలో ఇళ్ళ స్థలాల పంపిణీ గ్రామ సభలో గందరగోళం.ఇల్లు ఉన్న వారికే స్థలాలు మంజూరు చేశారని వీఆర్వో ని నిలదీసిన గ్రామస్తులు.నిజమైన లబ్ధిదారుల ఎంపిక చేయని అధికారుల పై గ్రామస్తుల మండిపాటు.

* సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు రాంపూర్‌ కోర్టు ఆమె నోటీసులు జారీ చేసింది.ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ 20న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

* వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో గోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, ఆటో మరియు డిసిఎమ్ వాహనాలు డీకొని ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా పద్దెనిమిది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి వీరందరినీ వనపర్తిజిల్లా ఆసుపత్రి కి తరలించారు, ఇందులో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత విశమంగా వుందని డాక్టర్లు తెలియజేశారు మృతి చెందిన వారిలో 50 సంవత్సరాల మహిళ,6 సంవత్సరాల బాలుడు వున్నారు వీరందరినీ వనపర్తి జిల్లా ఆసుపత్రి లో ప్రతమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కై ఇద్దర్ని కర్నూల్ కు 9మందిని మహబూబ్ నగర్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తరలించారు,వీరంతా వనపర్తిజిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ మరియు పెబ్బేరు పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారుకాగా వీరంతా గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా లో వున్న చర్చి లో ప్రార్థనలు చేసేందుకు మధ్యహ్నం ఇంటినుంచి వెళ్ళి అక్కడ సాయంత్రం ప్రార్థనలు చేసుకొని రాత్రి భోజనాలు ముగించుకొని స్వంత వూల్లకు తిరుగు ప్రయాణంలో అయిదు నిమిషాల్లో ఇంటికి చేరుతామనంగా ఈ గోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

* వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కట్రాపెళ్లి గ్రామం లో దారుణం జరిగింది.25 సంవత్సరాల మానసిక వికలాంగురాలు పై ఒక కామాంధుడు అత్యాచారం చేశాడు…గ్రామం లోని కందుకూరు జీన్నయ్య – లక్ష్మి దంపతుల కు ఏకైన కుమార్తె చిన్నతనం నుంచి మానసిక వికలాంగురాలు.రెక్కాడితే కాని డొక్కాడని వారి కుటుంబం రోజు ఒకరు పని కి వెళ్తే మరొకరు ఇంటివద్ద ఉన్న కుమార్తె ను చూసుకునే వారు.దీంతో జేన్నయ్య తమ్ముడు కొడుకు ను దత్తత తీసుకొని చడువించుకుంటున్నరు.దీంతో ఇద్దరు పనులకు వెళ్ళిన తన తమ్ముడు కొడుకు వారి కుమార్తె ను ఇంటివద్ద ఉంది చూసుకునే వాడు .ఈ క్రమం లో ఈ రోజు ఉదయం పని నిమిత్తం జన్నయ్య వర్ధన్నపేట కు వెళ్ళగా భార్య లక్ష్మి పొలం పని కి వెళ్ళింది.పరీక్షలు కావటం తో తమ్ముడు కొడుకు కూడా కాలేజ్ కు వెళ్ళటం తో తన కూతురు మైబు మానసిక వికలాంగురాలు ఒక్కతే ఉండటం తో కోలన్ పెళ్లి గ్రామానికి చెందిన వంగాల ఏళ్లస్వామి 29 రాయపర్తి వెళ్ళటానికి బైక్ పై వెళ్తుండగా కట్రాపెళ్ళి వద్ద బండి పంక్షర్ కావటం తో పక్కనే ఉన్న జెన్నాయ్య ఇంట్లోకి వెళ్ళటం తో నిస్సహాయత తో ఉన్న వికలాంగురాలు పై కామాంధుడి రాక్షసత్వం బయటపడింది.ఆ మానసిక వికలాంగురాలు పై అత్యాచారం చేసి బయటకు వెళ్తుండగా గమనించిన కాలని వాసులు అతన్ని పట్టుకొని స్థంభానికి కట్టి పోలీసులు సమాచారం ఇవ్వటం వర్ధన్నపేట ఏసిపి రమేష్, స్థానిక సి ఐ విశ్వేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు బాధితురాలిని వరంగల్ సి కె యం ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు వివరించారు….ఇలాంటి వాటి పై కటినంగా చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

* చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం.నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని మహిళను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.తీవ్రంగా గాయపడిన మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.బండ్లగూడ డిపోకు చెందిన TS 07UG2888 గల సర్వీసు కోటి నుండి గౌరెల్లి కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పోలీసుల అదుపులో ఆర్టిసి బస్సు డ్రైవర్.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.