WorldWonders

తుపాకీ వెదకడానికి ₹7.5కోట్లు ఖర్చు

Maharashtra And Karnataka Government Spends 7.5 Crores For Gun Search

అభ్యుదయవాదులు నరేంద్ర దాబోల్కర్‌, గోవింద పనేసర్‌, ఆచార్యుడు ఎం.ఎం.కలబురగి, సీనియర్‌ విలేకరి గౌరీ లంకేశ్‌ హత్యలకు ఉపయోగించిన తుపాకీని గాలించేందుకు ప్రత్యేక దర్యాప్తు దళం రూ.7.5 కోట్లు ఖర్చు చేసింది. తుపాకీ దొరక్కపోవడంతో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అభియోగ పత్రాన్ని దాఖలు చేయడం సాధ్యం కాలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు తాము తుపాకీని కాళీ నదిలో పడేశామని, అరేబియా సముద్రంలో పారేశామని చెబుతూ వచ్చారు. చివరకు సముద్రంలో 40 అడుగుల లోతుకు స్కూబా డైవింగ్‌ ఉపకరణాలతో వెళ్లి నిందితులు దాన్ని పూడ్చిపెట్టారని తెలుసుకున్నారు. దుబాయ్‌కు చెందిన ఓసంస్థ, నార్వేలో తయారు చేసిన ఉపకరణాలతో గాలింపు చేపట్టి తుపాకీని గుర్తించింది. దీనికైన ఖర్చును మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తాయని ప్రత్యేక దర్యాప్తు దళానికి నేతృత్వం వహిస్తున్న డీసీపీ ఎం.ఎన్‌.అనుచేత్‌ తెలిపారు. సీబీఐ అధికారులకు అనుబంధంగా తామూ దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. తుపాకీ దొరకడంతో త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.