DailyDose

మారుతీరావు మృతికి అదే కారణం-నేరవార్తలు

మారుతీరావు మృతికి అదే కారణం-నేరవార్తలు

* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఖైరతాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సైఫాబాద్‌ సీఐ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..మారుతీరావు విషం తీసుకున్నట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలిపారు. ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్‌ టీంతో తనిఖీలు చేయించాం. పరుపుపై పడి ఉన్న మారుతీరావును వెంటనే ఆస్పత్రికి తరలించాం. డాక్టర్లు మారుతీరావును పరీక్షించిన అనంతరం మృతిచెందినట్లు ధృవీకరించారు. ఘటనాస్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోలీసులు మారుతీరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడ తీసుకెళ్లారు.

* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తుల పేర్లు, వారి ఫోటోలు, అడ్రస్సులతో కూడిన హోర్డింగ్‌లను లక్నో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయడం సంచలనమైంది.

* గుంటూరు జిల్లాలో విఆర్ఓ అదృశ్యం. బొల్లాపల్లి మండలం వెల్లటూరు విఆర్ఓ సుభాని గత రెండు రోజులుగా అదృశ్యం ఆందోళనలో కుటుంబ సభ్యులు. అతను రాసిన నోట్ ను తీసుకుని స్వగ్రామం సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు.

* గాజువాక చైతన్య నగర్ స్క్రాప్ షాపు వద్ద అగ్నిప్రమాదం. తప్పిన పెనుముప్పు. వాహనాలు తగులబడకుండా మంటలు అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది.

* కాజీపేట దర్గా శివారు లో, రైల్వే పట్టాల ప్రక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. సంఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని, విచారణ జరుపుతున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ప్రక్కన ద్విచక్రవాహనం ఉంది. ద్విచక్రవాహనంపై పోలీస్ అని స్టికరింగ్ ఉంది.