NRI-NRT

కాలిఫోర్నియాలో మహా పూర్ణాహుతి

California Telugu NRI NRT News - TNILIVE - Purnahuti Trisakthi Yagam In Livermore Temple

కాలిఫోర్నియాలోని లివర్​మోర్​ నగరం శివ-విష్ణు ఆలయంలో త్రిశక్తి యాగం నిర్వహించారు. మార్చి 5న ప్రారంభమైన యాగం ఆదివారంతో ముగిసింది. ఈ యాగంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని లివర్​మోర్​ నగరం శివ-విష్ణు ఆలయంలో త్రిశక్తి యాగం వైభవంగా నిర్వహించారు. మార్చి 5న ప్రారంభమైన ఈ యాగం 8న ముగిసింది. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ యాగంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. త్రిశక్తి స్వరూపిణి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.వేద పండితుల సమక్షంలో ఐదు కాలాల్లో శ్రీసూక్తం, ధర్మాసూక్తం, మేధా సూక్తం 1440 సార్లు పఠిస్తూ యాగం చేశారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన సహస్ర సువాసిని పూజను 1008 మంది మహిళలతో నిర్వహించారు. ఈ యాగంలో భాగంగా గణపతి పూజ, విశ్వక్సేన పూజ, పుణ్య వచనం, పంచగవ్య ప్రసన్నం, కూష్మాండ హోమం, భూమిపూజ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం, అభిషేకం, మహా పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు చేశారు.