DailyDose

మారుతీరావు అంత్యక్రియల్లో అమృత గోబ్యాక్ నినాదాలు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today=Amrita Asked To Leave At Marutirao Rituals

* తండ్రి మృతదేహాన్ని చూసేందుకు అమృత పోలీసుల భద్రతతో స్మశానవాటికకు వెళ్ళినా ఆమెకి చుక్కెదురు అయింది. . మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్‌ అంటూ పెద్ద  ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. తండ్రి చావుకు కారణమైన అమృత గో బ్యాక్‌, మారుతీరావు అమర్‌ రహే అంటూ అక్కడి వారు నినాదాలు చేశారు. తన తండ్రిని చూడాలని అమృత భావిస్తే, తానేమీ అడ్డుకోబోనని, ఈ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని మారుతీరావు సోదరుడు శ్రవణ్ ఇంతకు ముందు క్లారిటీ ఇచ్చారు. ఇంటి వద్దకు కాకుండా స్మశానానికి తీసుకుని వెళతామని చెప్పి, ఆమెను భారీ బందోబస్తు మధ్య పోలీసు వాహనంలోనే తీసుకుని వచ్చారు. అయినా ఆమె వచ్చేందుకు వీల్లేదంటూ, పలువురు స్థానికులు, బంధువులు నినాదాలు చేయడంతో, ఆమె వెనుదిరిగి వెళ్లిపోయింది.  

* తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రత కోరింది. అయితే తండ్రిని చూసేందుకు తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అంగీకరించలేదు. మారుతీ రావు స్వగృహంలో మృతదేహానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పిస్తున్నారు. ఉదయం 10 గంటలకు మారుతీరావు అంతిమయాత్ర మొదలు కానుంది. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిక (షాబునగర్) లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మారుతీరావు పోలీసులు అంతిమ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

* బంగారంలాంటి కూతురు.. అల్లుడు, పండంటి మనుమడితో అందమైన జీవితాన్ని గడపకుండా కులమే అడ్డుగోడలు స అష్టించిందంటూ నటి మాధవీలత మారుతీరావు ఆత్మహత్యను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘కూతురిని జీవితకాలపు విషాదంలోకి నెట్టివేసిందీ.. తన భార్యను శోకంలో ముంచిందీ.. ఈయన జీవితాన్ని నేరమయం చేసి.. శిక్ష పడక ముందే కుల సంఘం సత్రంలోనే చివరకి హరించిందీ.. పాపం ప్రేమించిన నేరానికి హత్యతో శిక్షించిందీ.. ఆ హత్య తప్పుకాదు అని మాట్లాడే దుర్మార్గులను స అష్టించిందీ కులమే.. ఇంకేమీ కాదు… కులమే’ అని ఆమె పేర్కొన్నారు.రాజకీయంలో భాగమవుతూ కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆమె చెప్పారు. వివక్షకు పునాది వేసి, ద్వేషానికి పాలు పోస్తూ, ‘సామాజిక వర్గం’ గా చెలామణీ అవుతున్న సామాజిక నేరం కులమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుల విష సర్పం నేడు సిగ్గు విడిచి, కొత్త దర్పం చూపిస్తున్నదని, ఒకప్పటి, నేటి, బాధితుల ద్వారానే వ్యాప్తి చెందుతుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

* వరంగల్ రైల్వే స్టేషన్లు రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహిత కొమ్ముల లత(27). ను కాపాడిన గ్ర్ప్. భర్త వేధింపులు భరించలేక, రైలు కిందపడి చనిపోయేందుకు నర్సంపేట నుండి వచ్చినట్లు చెబుతున్న కొమ్ముల లత తెలిపింది.

* పురుగుల మందు తాగి, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కూసుమంచి మండలం, బలియా తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు కళ్యాణ్‌ (22).. పాలేరు రిజర్వాయర్‌ అలుగు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు.. అతడి కుటుంబానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారిస్తున్నారు. మృతుడి వ్యవహార శైలి, ఇటీవల అతని ప్రవర్తనకు సంబంధించిన విషయాలపై విచారణ చేపట్టారు.

* అనంతపురం జిల్లా లేపాక్షి మండలం చోళసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం రోడ్డుపై నిల్చున్న తల్లీకుమార్తెపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమార్తె సుజాత(38) మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన తల్లి నరసమ్మను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* పురుగులు పట్టిన చాక్లెట్‌ను విక్రయించి వినియోగదారు కూతురు అనారోగ్యానికి కారణమైన మోర్‌ మెగాస్టోర్‌పై హైదరాబాద్‌ వినియోగదారుల ఫోరం-3 మండిపడింది. తినుబండారాల సంరక్షణ పద్ధతులు పట్టించుకోనందుకు రూ.36,080 జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన కోమరగిరి సుబ్బారావు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఎర్రమంజిల్‌లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌లో 2018 అక్టోబర్‌ 11న చాక్లెట్‌లు కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఫిర్యాదుదారు కూతురు క్యాడ్బరీ డైరీ మిల్క్‌ ఫ్రూట్‌ అండ్‌ నట్‌ చాక్లెట్‌ను కొద్దికొద్దిగా తింటూ ఉండగా అందులో పురుగులు ఉన్నాయని సుబ్బారావు కుమారుడు గమనించి అరిచాడు.

* పాకిస్థాన్ లో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. రావల్పిండి నుంచి స్కర్దుకు వెళుతున్న బస్సు ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలను ప్రారంభించారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాల్ని బయటికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.