Food

అన్నమా? చపాతీనా?

The race between rice and roti to weight loss

ప్రస్తుత కాలంలో అందరు ఎక్కువుగా జంక్ ఫుడ్స్ కి ఎక్కువగా అలవాటు పడిపోయారు. ఇది బరువు పెరగటానికి ప్రధాన కారణం, మరియు పని ఒత్తిడి, నిద్రలేమి ఇలా అనేక కారణాల వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలనే ఆలోచన వచ్చిన వెంటనే మొదటిగా చేసే పని అన్నం తినడం మానేసి చపాతీ తింటారు. అయితే ఆరోగ్యానికి అన్నం, చపాతీ రెండింటిలో ఏది మంచిది..

​కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి..

బియ్యం, గోధుమలు ఆహారం విషయంలో రెండూ ముఖ్యమే. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణం… కానీ బరువు తగ్గే విషయానికి వస్తే, మొదట ఈ రెండు ఆహారాలపైనే దృష్టి పెడతాం, ఎందుకంటే ఈ రెండింటిలో బరువు తగ్గటానికి ఏది ఎక్కువ సహాయపడతుందా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ రెండూ కార్బోహైడ్రేట్స్‌తో నిండి ఉంటాయి.
అయితే, బరువు తగ్గడానికి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి. వంటకాల్లో మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి . బరువు తగ్గడానికి, మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి. అందువల్ల, తక్కువ కార్బోహైడ్రేట్స్‌తొ కూడిన ఆహారం బరువు తగ్గడానికి అనువైనది.

​డైట్‌లో ఇది ముఖ్యమే..

అన్నం, చపాతీ వీటిని మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో ఉంటాయి. వీటిని మనం తరచుగా తీసుకుంటాం. అయితే రెండింటిలో ఏ ఆహారం తినకుండా మానేయాలన్న కష్టం. అయితే ప్రతి డైట్ ప్లాన్‌లో మనం ఇష్టపడే ఆహారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.

​కార్బోహైడ్రేట్స్‌ తీసుకోకపోవడం..

ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ లేకపోతే త్వరగా బరువు తగ్గుతారు. చాలా మంది బరువు తగ్గటానికి వారి ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ని తగ్గిస్తారు. ఏదేమైనా భారతీయ ఆహారంలో, ప్రధాన పిండి పదార్ధాలు బియ్యం, గోధుమలు. అన్నం, చపాతీ అనేవి భారతీయుల డైట్‌లో భాగమైపోయాయి. చాలా వరకూ మన ఆహారాలు గోధుమ ఆధారిత, బియ్యం ఆధారితమైనవి కాబట్టి, బియ్యం, చపాతీలను పూర్తిగా మానేయ్యడం సరైంది కాదు.

​ఇదే తేడా..

వైద్య సమస్యల కారణంగా వారి ఆహారం నుండి సోడియంను తొలగించాలని కోరుకునే వారికి చపాతీ చక్కటి పరిష్కారం. కానీ బరువు తగ్గడానికి చపాతీ ఎందుకు మంచిదంటే.. చపాతీతో పోలిస్తే అన్నంలో తక్కువ ఆహార ఫైబర్, ప్రోటీన్, కొవ్వు కలిగి ఉంటుంది. అన్నంలో అధిక కేలరీలు కలిగి ఉంటాయి, ఇది రెండు చపాతీలు ఇచ్చే సంతృప్తిని అందించదు.

​రోజుకు నాలుగు చపాతీలు..

బరువు తగ్గటానికి ఎక్కువగా ఉపయోగించే ఆహారంలో చపాతీ ఒకటి. అయితే చాలా మంది అన్నానికి బదులుగా చపాతీ తీసుకుంటారు. అయితే చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బరువు తగ్గటానికి అన్నానికి బదులుగా చపాతీ తినడం మంచిదే. అయితే వాటిని ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే. చపాతీలని ఎక్కువగా కూడా తినకూడదు. బరువు తగ్గటానికి రోజుకి గరిష్టంగా నాలుగు చపాతీలు తినడం మంచిది.

​డిన్నర్ ఇప్పుడే చేయాలి..

చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులు చపాతీ మంచిది అని చెబుతారు. వీటిలో ఏది మంచిది. అన్నం కంటే గోధుమ పిండిలో మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్‌ పెరగకుండా ఇది సహకరిస్తుంది. అన్నం కంటే చపాతీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్‌ ఉండటం వల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు. అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహవ్యాధి ఉన్నవారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి.

రాత్రి చపాతీ తినాలనుకుంటే..

గోధుమలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. అందుకే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. చాలామంది రాత్రి పూట చపాతీ ఆరోగ్యానికి మంచిదని అంటారు. అయితే, ఒకవేళ రాత్రి మీ ఆహారంగా చపాతీ తినాలనుకుంటే, రాత్రి 7:30 గంటలకు ముందు తినేయడం మంచిదని చెబుతున్నారు వైద్యులు . అయితే మీ శరీరానికి ఏది బాగా సరిపోతుందో ముందుగా మీరు తెలుసుకోవడం అవసరం.