ScienceAndTech

మీ మొటిమలకు కారణం…మీ ఫోను

Cell Phones Causing Acne-Telugu SciTech News

ఫోన్‌ మాట్లాడేటప్పుడు కాస్త దూరంగా పెట్టుకొని, మాట్లాడాలి. వీలైతే ఇయర్‌ ఫోన్స్‌ వాడాలి. ఎప్పటికప్పుడు ఫోన్‌ను క్లీన్‌ చేసుకొని, మాట్లాడితే మొటిమల సమస్య ఎదురుకాదు. ఫోన్‌ను ముఖం దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం. దీనివల్ల ఫోన్‌కు ఉన్న బ్యాక్టీరియా మన ముఖంపై చేరి, మొటిమల సమస్యకు కారణమవుతుంది. ఫోన్‌కు చెమట అంటుకొని, అది మళ్లీ ముఖానికి చేరి మొటిమల సమస్య మరింత అధికమవుతుంది. చర్మాన్ని స్క్రబ్‌ చేయడం ముఖ్యమే. ఎందుకంటే దీనివల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. మొటిమల సమస్యలు ఉన్నవారు స్క్రబ్‌ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే స్క్రబ్బింగ్‌ వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి మొటిమలతో బాధపడే వారు స్క్రబ్బింగ్‌కు దూరంగా ఉండాలి. ముఖం కడగడం వల్ల ఫేస్‌ క్లీన్‌ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. కానీ అతిగా కడగడం లాంటివి చేస్తే చర్మంలోని సహజ నూనెలు తగ్గి, సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలా చేయడం వల్ల ముఖంలోని సహజ తేమ తగ్గి, నూనె ఉత్పత్తి పెరుగుతుంది. జంక్‌ ఫుడ్‌ అధికంగా తీసుకోవడం, సరైన నిద్ర లేకపోవడం, అధిక టెన్షన్స్‌ కారణంగానూ మొటిమల సమస్య తీవ్రతరం అవుతుంది. తాజాపండ్లు, కూరగాయలు తీసుకొని, నీటిని ఎక్కువగా తాగాలి.
cell phones cause acne-telugu science and technology news by tnilive