DailyDose

నిజామాబాద్ జిల్లాలో నరబలి కలకలం-నేరవార్తలు

నిజామాబాద్ జిల్లాలో నరబలి కలకలం-నేరవార్తలు

* నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం. లక్ష్మీ అనే వివాహిత హత్య. మృతదేహం ఎదుట దీపం, పసుపు కారం. కాలి వేళ్ళు కత్తిరింపు. ప్రతీకారమా. క్షుద్రతతంగమా?కొనసాగుతున్న దర్యాప్తు.

* వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్ది పై బీరు బాటిళ్ళతో టీడీపీ కార్యకర్తల దాడిక్షతగాత్రుని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుకైనా వైద్యం కోసం గుంటూరు తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* పాల వ్యాన్‌ను లారీ ఢకొన్న ఘటన మంగళవారం ఉదయం పెదపాడు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పెదపాడు జాతీయ రహదారిపై, పాల వ్యాన్‌ను, లారీ ఢకొనడంతో, వ్యాన్‌ బోల్తాపడింది. పాల ప్యాకెట్ల సరుకంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. వ్యాన్‌లో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాపాయమేమీ జరగలేదు.

* ఇద్దరూ డాక్టర్లు.. ప్రేమ వివాహం చేసుకున్నారు! సొంత ఆస్పత్రి ఉంది!! వారి అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా పదేళ్ల బాబు ఉన్నాడు. అన్నీ ఉన్నా.. అందరి జీవితాల్లో లాగే వారి జీవితంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. భర్త మీద కోపంతో భార్య పుట్టింటికి వెళ్లిపోతే.. భార్య మీద కోపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు! తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో తలకు గురిపెట్టుకుని.. పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చుకుని ఉసురుతీసుకున్నాడు. హైదరాబాద్‌ కాప్రా పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన విషాదమిది. బలవన్మరణానికి పాల్పడిన ఆ వ్యక్తి.. దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య హాస్పటల్స్‌ ఎండీ డాక్టర్‌ రవీంద్రకుమార్‌. సిద్దిపేటకు చెందిన డాక్టర్‌ రవీంద్రకుమార్‌ (42) ఆయన భార్య స్మిత(36)ది ప్రేమ పెళ్లి.

* హనుమంతుని పేట రైల్వే గేట్ దగ్గర, మాస్టర్ సిద్ధార్థ స్కూల్ టాటా ఏసీ వ్యాన్ బోల్తా. 15మంది విద్యార్థులకు గాయాలు. 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

* ఇద్దరు ఏసీ మెకానిక్‌లు ఘర్షణపడి గొడ్డలితో దాడి చేసుకున్న ఘటన మంగళవారం కాకినాడలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాల త్రిపుర సుందరి గుడి, ఘంటసాల విగ్రహం వద్ద ఇద్దరు ఏసీ మెకానిక్‌లు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి గొడ్డలితో అవతలి వ్యక్తిని నరకడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరి మధ్య ఉన్న పాత గొడవల నేపథ్యంలోనే ఈ పరస్పర దాడులు చేసుకున్నట్లు సమాచారం. తీవ్రగాయాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

* అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. 1,68,750 రూపాయలు విలువ చేసే గుట్కాస్ స్వాధీనం. ముగ్గురి అరెస్ట్, వాహనం స్వాధీనఒ.

Image result for narabali