Food

నులిపురుగులను హతమార్చే పుదీనా

Mint leaves will kill hookworms

పుదీనా రుచికి కొంచెం మంట, తిమ్మిరి స్వభావం కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువగా ఫంక్షన్స్‌లో, అప్పుడప్పుడు పచ్చడి చేసుకోవడం, వారానికొకసారి నాన్‌వెజ్‌లోనూ వాడుతుంటాం. కానీ పుదీనాలో ఉన్న ఔషధ గుణాల గురించి చాలామందికి తెలీదు. ఇది పూర్వకాలం నుంచి మనుగడలో ఉంది. చరకసంహితలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌ సి ఉన్నాయి. సౌందర్య సాధనాల తయారీ పెరగడం, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో పుదీనా ఉపయోగాలు, ఔషధీయ గుణాలు మరింత జన బాహుళ్యమయ్యాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
*జీర్ణక్రియ
జీర్ణక్రియను పెంచుతుంది. అరుచిని పోగొట్టి, ఆకలిని కలిగిస్తుంది. అజీర్తితో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. మింట్‌ ఆయిల్‌ క్రిమినాశినిగా పనిచేసి, టేప్‌వార్మ్‌ లాంటి అనారోగ్య కారకాలను నశింపజేస్తుంది. మలినాలను శరీరం బయటికి పంపుతుంది.సాధారణ జలుబును తగ్గిస్తుంది. తగు మోతాదులో తీసుకోవడం వల్ల ఉబ్బసం కూడా తగ్గుతుంది.శ్వాసనాళాలు మూసుకుపోయి, ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఉపయోగించే ఇన్‌హేలర్లలో ఈ మింట్‌ నూనెనే ఉపయోగిస్తారు.రెగ్యులర్‌గా పుదీనా టీ తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు తగ్గుతుంది. టీ వేడిగా తీసుకుంటాం. కాబట్టి మంచి రిలీఫ్‌ని ఇస్తుంది. గొంతునొప్పి, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది.మామూలు తలనొప్పి పుదీనాను వాసన చూడటం ద్వారా తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు తలనొప్పికి మింట్‌ ఆయిల్‌తో తయారైన బామ్స్‌ మంచి ఉపశమనాన్నిస్తాయి. పరగడుపున నాలుగైదు పుదీనా ఆకులను నమిలినా ఫలితం ఉంటుంది.బ్రష్‌ చేసుకున్న వెంటనే కొన్ని పుదీనా ఆకులను నమిలి, మింగితే నోరు ఫ్రెష్‌గా ఉంటుంది. నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది మింట్‌ ఆయిల్‌ క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే టూత్‌పేస్ట్‌ల్లో పుదీనాను ఉపయోగిస్తున్నారు.బరువు తగ్గడంలో పుదీనా జీర్ణరస ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇది ఆహారం నుండి పోషకాలను గ్రహించి, జీవక్రియలు వేగవంతమై, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పుదీనా మెదడుని ప్రభావితం చేసి గ్రహణశక్తి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలుండటం వల్ల మొటిమల నివారణకు బాగా పనిచేస్తుంది. పుదీనా పేస్ట్‌లో కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
దీనిలో ఉండే సాలిసిలిక్‌ ఆమ్లం చర్మంపై మొటిమల నివారణే కాక, వాటి వలన ఏర్పడిన మచ్చలు, ఇతర మచ్చలేవైనా ఉన్నా పోగొడుతుంది.గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ ఉదయం పుదీనా ఆకులను వాసన చూడటం వల్ల వికారం తగ్గి, మనసంతా ఉత్సాహంగా ఉంటుంది.ఒత్తిడి, నిరాశలను పోగొట్టే శక్తి దీనికుంది. అందుకే ఆయుర్వేద వైద్యులు అరోమా థెరపీలో పుదీనాను వాడతారు.తేనెలో రెండు చుక్కలు పుదీనా రసం కలిపి, పిల్లలకు పరగడుపున ఇస్తే.. నులిపురుగులు చనిపోతాయి.పిల్లలకు జలుబు చేసినప్పుడు కొబ్బరినూనెలో కర్పూరం, పుదీనా రసం బాగా కలిపి ఛాతీ, గొంతు, వీపుపై మర్దనా చేస్తే మొదట ఉపశమనం, నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది.
mint leaves will kill hookworms - tnilive food and diet news in telugu