Fashion

ముడతలను మడతబెట్టే పెట్రోలియం జెల్లీ

Telugu Fashion News - Petroleum Jelly Will Prevent Face Folds

చర్మసంరక్షణలో భాగంగా అనేక సౌందర్య సాధనాలు వాడుతాం. అయితే పెట్రోలియం జెల్లీ రెండు మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. మేకప్‌ తొలగించేందుకు, కనుబొమలను అందంగా మలచుకునేందుకు, పర్‌ఫ్యూమ్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండేందుకు పెట్రోలియం జెల్లీని వాడవచ్చు. అదెలాగంటే…పెట్రోలియం జెల్లీ పర్‌ఫ్యూమ్‌ ప్రైమర్‌గా పనిచేస్తుంది. ఇది పర్‌ఫ్యూమ్‌ అణువులను పట్టి ఉంచి ఎక్కువ సమయం పరిమళం నిలిచి ఉండేలా చూస్తుంది. ప్లస్‌ పాయింట్ల (చెవుల వెనుక, మెడ పై భాగం, ముంజేతి) మీద కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసుకున్న తరువాత పర్‌ఫ్యూమ్‌ స్ర్పే చేసుకోవాలి.కళ్ల మీది నల్లటి వలయాలు పోవాలంటే కాటన్‌ బాల్‌ లేదా మేకప్‌ రిమూవర్‌ ప్యాడ్‌ మీద కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసి కళ్ల మీద 10 నిమిషాలు ఉంచాలి. దాంతో ఐ షాడో కరిగి తొలగించడం సులభం అవుతుంది. అంతేకాదు కళ్ల కింద గీతలు ఏర్పడకుండా చూస్తుంది.కాటుక సరిపడా లేనప్పుడు పెట్రోలియం జెల్లీతో కనురెప్పలను అందంగా మార్చేయవచ్చు. క్యూ టిప్‌ అంత పెట్రోలియం జెల్లీ తీసుకొని కాటుక మాదిరి కనురెప్పల మీద దిద్దుకుంటే సరి.