Politics

ఉగాదికి ఇళ్లపట్టాలు ఇవ్వడం ఉల్లంఘన అవుతుంది

YSRCP Home Site Distribution Cannot Be Done - Says CEC

ఓటర్లను ప్రభావితం చేసే పథకాలు నిలిపివేయాలని చెప్పామని.. ఉగాదికి ఇళ్లపట్టాల పంపిణీ పథకం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎస్‌ఈసీ రమేష్‌ వెల్లడించారు. రివ్యూలు, సమావేశాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తాయన్నారు.

నామినేషన్లు అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.

రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయని.. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని రమేష్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ భవనాలకు నిర్ణీత గడువు లోగా పార్టీ రంగులు తొలగిస్తామన్నారు.

అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల అందజేతలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు.

15న మొదటి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.

వలంటీర్ల సేవలు తీసుకోవచ్చు కానీ.. పార్టీలకు ప్రచారం చేయొద్దని పేర్కొన్నారు.

దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు అక్కర్లేదని ఎస్‌ఈసీ రమేష్‌ స్పష్టం చేశారు.