Health

కరోనా కలకలం-TNI ప్రత్యేక కథనం

Corona Special Stories-Today;s Coronavirus COVID-19 Updates

1. కరోనా దెబ్బ: అనవసర ప్రయాణాలొద్దు: కేంద్రం
చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 73 కేసులు నమోదవ్వడంతో గురువారం లోక్‌సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కరోనాపై ప్రకటన చేశారు. ఇది ఆందోళన కల్గించే అంశమనీ.. దీన్ని బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకర అంటువ్యాధిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండటమే మేలని ఆయన విజ్ఞప్తి చేశారు. 6000 మంది భారతీయులు ఇరాన్‌లో చిక్కుకున్నారన్న జైశంకర్‌.. వారిలో 1100 మంది మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌కు చెందిన యాత్రికులు ఉన్నారని వెల్లడించారు. అలాగే, 300 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. ఇరాన్‌లో కరోనా ప్రభావితమైన క్వామ్‌ ప్రాంతంలో చిక్కుకున్న యాత్రికులను వెనక్కి రప్పించడంపై తొలుత దృష్టిపెట్టినట్టు సభకు వెల్లడించారు. ఇరాన్‌ వ్యవస్థలో కఠిన నిబంధనలు ఉండటం వల్ల అక్కడి భారతీయులను తీసుకురావడంలో ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటలీకి కూడా ఒక వైద్య బృందాన్ని పంపుతున్నట్టు చెప్పారు. అక్కడ భారతీయులకు వైద్యపరీక్షల్లో నెగిటివ్‌ అని తేలితే.. వారిని భారత్‌ వెళ్లేందుకు అనుమతిస్తున్నారని తెలిపారు.
2. హాలీవుడ్‌ జంటకు కరోనా వైరస్‌..!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ మహమ్మారి ఇప్పటికే 4300 మంది ప్రాణాలను బలితీసుకుంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు విజేత టామ్‌ హాంక్స్‌‌, అతని భార్య రిటా విల్సన్‌కు కొవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టామ్‌ స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. 63సంవత్సరాల వయసున్న ఈ జంటకి జలుబు, తలనొప్పి ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. అయితే ప్రస్తుతం ప్రత్యేక పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నారని టామ్‌ వెల్లడించాడు. ‘ఇప్పుడు మేం చేయాల్సింది..కేవలం వైద్యుల సూచనలను పాటించడమే’ అన్నారు. వార్నర్‌బ్రదర్స్‌ నిర్మాణంలో వస్తున్న తన తదుపరి చిత్రంకోసం టామ్‌ హాంక్స్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాల్లో లక్షా ఇరవైఐదు వేల మందికి సోకిన కరోనాను డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
3. కరోనా’ కట్టడికి ప్రత్యేక యంత్రాలు
కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధిగ్రస్థులు దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌ను.. గాల్లోనే ఒడిసిపట్టి, పీల్చేసుకుని, స్వచ్ఛమైన గాలిని అందించే అత్యాధునిక వడబోత యంత్రాలను కొనుగోలు చేస్తోంది. ‘హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్‌ ఎయిర్‌ (హెపా)’ని అందించే ఈ ఒక్కో ఫిల్టర్‌ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. మొత్తం 4యంత్రాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కరోనా అనుమానితులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల ప్రవేశ ద్వారాల వద్ద ఈ ఫిల్టర్లను అమర్చనున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో తెలంగాణ సర్కారు బుధవారం ఈ చర్యలు చేపట్టింది. యంత్రాల ఏర్పాటు అనంతరం గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రుల్లో ఇతర చికిత్సలకు వచ్చేవారు ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఉండదని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.
4. దేశమంతటా అంటురోగాల చట్ట నిబంధనలు
మహమ్మారి అంటువ్యాధిగా కరోనా (కొవిడ్‌-19) విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘అంటురోగాల చట్టం-1897’లోని సెక్షన్‌-2 నిబంధనల్ని దేశమంతటా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రిత్వశాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అందరూ విధిగా అనుసరించాల్సి ఉంటుందని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌-10 ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఉండే అధికారాలను ఆరోగ్యశాఖ కార్యదర్శికి కూడా కేంద్రం దఖలుపర్చింది. దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు, ప్రభుత్వ యంత్రాంగాలను మెరుగ్గా సన్నద్ధం చేసేందుకు ఈ అధికారాలు దోహదపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు రూపొదించే ప్రణాళికల అమలును పర్యవేక్షించే సమగ్ర అధికారాలను సెక్షన్‌-10 కల్పిస్తుంటుంది. ఉన్నత స్థాయి మంత్రుల బృందం (జీవోఎం) విడిగా సమావేశమై కరోనాపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. చైనా, హాంకాంగ్‌, కొరియా, జపాన్‌, ఇటలీ, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇరాన్‌, మలేసియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీలకు ప్రయాణించి వచ్చినవారు 14 రోజుల పాటు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఈ సమావేశంలో చెప్పారు.
5. దేశమంతటా అంటురోగాల చట్ట నిబంధనలు
మహమ్మారి అంటువ్యాధిగా కరోనా (కొవిడ్‌-19) విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘అంటురోగాల చట్టం-1897’లోని సెక్షన్‌-2 నిబంధనల్ని దేశమంతటా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రిత్వశాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అందరూ విధిగా అనుసరించాల్సి ఉంటుందని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌-10 ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఉండే అధికారాలను ఆరోగ్యశాఖ కార్యదర్శికి కూడా కేంద్రం దఖలుపర్చింది. దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు, ప్రభుత్వ యంత్రాంగాలను మెరుగ్గా సన్నద్ధం చేసేందుకు ఈ అధికారాలు దోహదపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు రూపొదించే ప్రణాళికల అమలును పర్యవేక్షించే సమగ్ర అధికారాలను సెక్షన్‌-10 కల్పిస్తుంటుంది. ఉన్నత స్థాయి మంత్రుల బృందం (జీవోఎం) విడిగా సమావేశమై కరోనాపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. చైనా, హాంకాంగ్‌, కొరియా, జపాన్‌, ఇటలీ, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇరాన్‌, మలేసియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీలకు ప్రయాణించి వచ్చినవారు 14 రోజుల పాటు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఈ సమావేశంలో చెప్పారు.
6.వీసాలు రద్దు
సాధారణ వీసాలన్నీ ఏప్రిల్‌ 15 వరకు నిలిపివేతరేపటినుంచి వర్తింపుబ్రిటిష్‌పాలనాకాలం నాటి అంటువ్యాధి చట్టం అమలుకరోనా కట్టడికి కేంద్రం అనూహ్య నిర్ణయందేశంలో 60 పాజిటివ్‌ కేసులు దేశంలో కరోనా (కొవిడ్‌-19) కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సుమారు నెలపాటు సాధారణ వీసాలన్నింటిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దౌత్య, అధికార, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగుల, ప్రాజెక్టు వీసాలు తప్ప సాధారణ వీసాలన్నింటిని ఏప్రిల్‌ 15 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రవాస భారతీయులకు (ఓసీఐ కార్డుదారులకు) కల్పించిన వీసా రహిత పర్యాటక సౌకర్యాన్ని ఏప్రిల్‌ 15 వరకు నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ నుంచి వచ్చిన లేదా ఆయా దేశాలను సందర్శించిన విదేశీ పర్యాటకులు, భారతీయులను 14 రోజులపాటు వేరుగా (క్వారంటైన్‌లో) ఉంచనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలు, సిబ్బంది, ప్రయాణి కుల ప్రవేశంపై మార్చి 31 వరకు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ పేర్కొ న్నది. అలాగే అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలను థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాట్లున్న పోర్టుల్లోకి మాత్రమే అనుమతిస్తామని, సిబ్బంది, ప్రయాణికులు తమ వివరాలను స్వీయ పత్రంలో పేర్కొని పోర్టు ఆరోగ్య అధికారికి సమర్పించాలని, ఎవరికైనా కరోనా సోకినట్లు తేలితే నౌక నుంచి దిగేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. 60కి చేరిన కరానో కేసులుదేశంలో కరోనా నిర్ధారణ కేసుల సంఖ్య 60కి చేరింది. ఇందులో 16 మంది ఇటలీ దేశస్థులున్నట్లు కేంద్రం పేర్కొంది. ఢిల్లీ, రాజస్థాన్‌లో బుధవారం కొత్తగా ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు తెలిపింది. కేరళ, ఉత్తర ప్రదేశ్‌లో 9 చొప్పున, ఢిల్లీలో 5, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌, లడఖ్‌లో రెండేసి, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడులో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని, కేరళలో ముగ్గురు కోలుకున్నారని వెల్లడించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను ‘మహమ్మారి’గా పేర్కొనవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి బుధవారం తెలిపారు. బ్రిటీష్‌ నాటి చట్టంతో చెక్‌..దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు బ్రిటీష్‌ కాలం నాటి అంటువ్యాధి చట్టం 1897ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసే నిబంధనలను అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్ష విధిస్తారు. 18వశతాబ్దంలో ప్లేగు వ్యాధిని నియంత్రించేందుకు బ్రిటీష్‌ పాలకులు ఈ చట్టాన్ని రూపొందించారు. విపత్తు నిర్వహణ చట్టం 2005ను కూడా అమలుచేయనున్నారు. రూ.5.8 కోట్ల కోళ్ల ఉత్పత్తులు ధ్వంసంకరోనా భయంతో మహారాష్ట్రకు చెందిన కోళ్ల పరిశ్రమ రైతు సురేశ్‌ భట్లేకర్‌ రూ.5.8 కోట్ల విలువైన కోళ్ల ఉత్పత్తులు ధ్వంసం చేశాడు. ఆయనకు మహారాష్ట్ర, గుజరాత్‌లో 35 కోళ్ల ఫారాలు, మూడు కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కరోనా నేపథ్యంలో చికెన్‌, గుడ్లపై జరుగుతున్న అసత్య ప్రచారంతో అమ్మకాలు తగ్గాయి. దీంతో నష్టాలు తగ్గించుకునేందుకు 1.75 లక్షల కోడిపిల్లలు, 9 లక్షల గుడ్లను గుంతతీసి పూడ్చినట్లు పేర్కొన్నాడు. బ్రిటన్‌ ఆరోగ్య మంత్రికి కరోనా బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి నదిన్‌ డోరీస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయం గా ఆమే వెల్లడించారు. ప్రధాని బోరిస్‌ గత వారం నిర్వహించిన సమావేశంలో డోరిస్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల్లో ఇంకెవరికైనా కరోనా సోకి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 382కు చేరగా ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 631కి చేరిం ది. మొత్తంగా 107 దేశాల్లో కేసుల సంఖ్య 1,17,339కి, మృతుల సంఖ్య 4,251కి చేరింది. చైనాలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖంపట్టాయి. బుధవారం 22 మంది చనిపోయారు. కొత్తగా 24 కేసులు నమోద య్యాయి. పరిస్థితులు సాధారణస్థితికి వస్తుండటంతో వూహాన్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి.
7. కరోనా ఎఫెక్ట్‌: యూరప్‌పై అమెరికా ఆంక్షలు
చైనాలో మొదలైన కరోనా (కొవిడ్-19) వైరస్‌ ఇప్పటికే ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని మహమ్మారిగా ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు దీనిపై తీవ్రంగా పోరాడుతున్నాయి. చైనా తర్వాత దీని తీవ్రత ఎక్కువగా ఉన్న దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీ వంటి దేశాలు కరోనాపై పరోక్ష యుద్ధం చేస్తున్నాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. నెలరోజుల పాటు యూరప్‌ నుంచి అమెరికాకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అయితే ఇది బ్రిటన్‌కు మాత్రం వర్తించదని తెలిపారు. చైనా నుంచి యూరోపియన్‌ దేశాలకు రాకపోకలను ప్రభుత్వాలు నిలిపివేయకపోవడం వల్లనే యూరప్‌లో కరోనా విజృంభిస్తుందని ఆయన అన్నారు. అంతే కాకుండా వాషింగ్టన్‌లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు మేయర్‌ మైరిల్ బౌసర్‌ ప్రకటించారు. అమెరికాలో వైరస్‌ వల్ల 30 మందికి పైగా మరణించగా, వైరస్‌ సోకిన వారి సంఖ్య 1200కి చేరింది.
8. కరోనా దెబ్బ: అనవసర ప్రయాణాలొద్దు: కేంద్రం
చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 73 కేసులు నమోదవ్వడంతో గురువారం లోక్‌సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కరోనాపై ప్రకటన చేశారు. ఇది ఆందోళన కల్గించే అంశమనీ.. దీన్ని బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకర అంటువ్యాధిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండటమే మేలని ఆయన విజ్ఞప్తి చేశారు.
9. ఇటలీలో తెలంగాణ విద్యార్థుల గగ్గోలు
కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) విజృంభిస్తుండటంతో ఇటలీకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ ఉంటున్న తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటలీలో ఎంఎస్‌ చదువుతున్న, చదువు పూర్తయిన 16 మంది తెలంగాణ విద్యార్థులు స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తుండగా ఆ దేశం నిరాకరిస్తోంది. కోవిడ్‌ భయంతో వారిని రోమ్‌ ఫిమిసినో విమానాశ్రయంలో అధికారులు నిలిపివేశారు. తెలంగాణ విద్యార్థులతోపాటు కేరళ, బెంగళూరు, నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు స్పష్టంచేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వేడుకుంటున్నారు.
10. కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు : కేంద్ర మంత్రి
కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు చేపట్టామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిపై లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి నిరోధంపై రోజువారీ సమీక్షలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇరాన్‌, ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. నెగిటివ్‌ వచ్చిన ప్రయాణికులను మాత్రమే బయటికి పంపిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికీ మన దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు అనుమానిత వ్యక్తుల నమూనాలను పంపించి ఫలితాలు తెలుసుకుంటున్నాం. దీనితో పాటు మరో 15 ల్యాబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అయితే ఈ వైరస్‌ను అన్ని ల్యాబ్‌ల్లో నిర్ధారించలేము అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
11. కరోనా కేసులనూ బీమాలో చేర్చండి: ఐఆర్‌డీఏ
కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన వేళ వ్యాధి చికిత్సకు సంబంధించి కేంద్ర బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ( ఐఆర్‌డీఏ) కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఎలాంటి బీమాను కలిగి ఉన్నా కరోనా వైరస్‌కు చికిత్సను కూడా అందులో చేర్చాలని అన్ని ఆరోగ్య బీమా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 4న సర్క్యులర్‌ జారీ చేసిన ఐఆర్‌డీఏ.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులకు తక్షణమే వైద్య బీమా వర్తింపజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్య బీమా పాలసీ ఉంటే ఆరోగ్య బీమా కంపెనీలు తక్షణమే స్పందించాలని ఐఆర్‌డీఏ తేల్చి చెప్పింది. కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు వైద్య ఖర్చులను వారి పాలసీ నిబంధనల ప్రకారం చెల్లించాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ కేసులను తిరస్కరించేముందు వాటిని క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కొత్త పాలసీని రూపొందించే సమయంలో కరోనాను కూడా చేర్చాలనీ.. ఆ వైద్యానికయ్యే ఖర్చును పొందుపరచాలని ఐఆర్‌డీఏ ఆదేశించింది.