Movies

విజయ్ ఇంటిపై మరోసారి ఐటీ దాడులు

Income Tax Raids On Actor Vijay House Again

తమిళ అగ్ర నటుడు విజయ్‌ నివాసంలో ఐటీ అధికారులు గురువారం మరోసారి సోదాలు నిర్వహించారు. గత నెలలో విజయ్‌ నివాసం‌, ‘బిగిల్‌’ చిత్ర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్‌, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ ఇళ్లు, కార్యాలయాలతోపాటు ప్రదర్శన హక్కులు దక్కించుకున్న స్క్రీన్‌ సీన్‌ సంస్థల్లో ఈ సోదాలు చేపట్టారు.కాగా, రెండు రోజుల క్రితం ‘మాస్టర్‌’ సహ దర్శకుడు లలిత్‌కుమార్‌ నివాసంలో సోదాలు జరిగాయి. తాజాగా అధికారులు మరోసారి పణయూర్‌ఇల్లంలోని విజయ్‌ నివాసానికి వెళ్లి సోదాలు చేస్తున్నారు.