DailyDose

గుమ్మడిపూడి వద్ద కోటి నగదు స్వాధీనం-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-1Crore Rupees Seized

* రాజస్థాన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శిరోహి జిల్లాలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడం స్థానికంగా విషాదం నింపింది. పిండ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కన్య (30) అనే మహిళ తన కూతురు లీల (8), కుమారులు కృష్ణ (6), మొంటు (5)లతో కలిసి ఈ ఘోరానికి పాల్పడింది. ఏం జరిగిందో.. ఏ కష్టమొచ్చిందో గాని అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులతో కలిసి పిండ్వారా – ఫాల్నా రైల్వే ట్రాక్‌ వద్ద రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించి శవపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు స్పష్టమైన కారణాలేమీ తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
*ప్రేమ పేరుతో ఓ యువతి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా, మానసికంగా మోసం చేశాడని పేర్కొంటూ ఓ యువతి నగరంలోని అబిడ్స్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
*శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్‌ వైర్‌ బండిల్స్‌లో బంగారం తీసుకువచ్చాడు. కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ధర్మసాగర్ మండలం రాంపూర్ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద లిక్కర్ లోడ్‌తో వెళుతున్న లారీ.. టిప్పర్ ఒకదానికొకటి ఢీకొన్నాయటిప్పర్‌లో ఉన్న ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* కదిరి పట్టణ శివారు ప్రాంతానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికపై పక్క ఇంట్లో ఉండే యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలికకు తీవ్ర రక్త ప్రసారం కావడంతో గమనించిన బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
* ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని దోర్నపాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆర్గాట్టా గ్రామంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వర్‌ గార్డ్‌ జవాన్‌ను నక్సల్స్‌ బుధవారం రాత్రి కిడ్నాప్‌ చేశారు. అనంతరం జవాన్‌ను నక్సల్స్‌ దారుణంగా హత్య చేశారు.
* బెంగాల్ న‌టుడు సంతు ముఖోపాధ్యాయ్‌(69) బుధవారం రాత్రి దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. నాలుగు ద‌శాబ్ధాల‌కి పైగా త‌న న‌ట‌న‌తో అల‌రించిన సంతు కొన్నాళ్లుగా హృద‌య సంబంధ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల హైబీపీ, హైప‌ర్‌టెన్ష‌న్‌కి గురికావ‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
* మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగాఉంది. భారీగా వాహన రాకపోకలకు అంతరాయమేర్పడింది. నిర్మాణ పనుల వల్ల పైవంతెనను మూసివేయగా..సర్వీసు రోడ్డు నుంచి వాహనాలు వెళ్తున్నాయి. ఈక్రమంలో పనసకాయల లోడుతో వెళ్తున్న హైదరాబాద్‌ వెళ్తున్న లారీ అదుపుతప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లడంతో పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబంలోని దంపతులు పనులకోసం, చిన్నారులు బడికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో లారీ కిందపడిన ఇద్దరు ద్విచక్రవాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
* మహబూబ్నగర్ జిల్లాజడ్చర్ల జాతీయ రహదారి 44 పై, ఎస్ఆర్ గార్డెన్ దగ్గర మలుపు తిప్పే పోయి బోల్తా పడిన తమిళనాడుకు చెందిన లారీ.రోడ్డు పక్కనే ఉన్న ఇల్లు కు డీ కోవడం తో, గ్యాస్ లీకేజి. లారీ కింద ఒక మృతుడు ఉన్నాడు. ఇంకా మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు…
* గుమ్మిడిపూండి సమీపంలో బస్సులో తరలిస్తున్న రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని ఎళావూరు మీదుగా హెరాయన్‌, గంజాయి, ఎర్రచందనం, మత్తు పదార్థాలు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందిందన్నారు. స్పందించిన పోలీసులు బుధవారం వేకువజామున వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు లగ్జరీ బస్సును ఆపి తనిఖీ చేయగా సీట్ల కింద రెండు సంచుల్లో రూ.కోటి నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామని, కుమార్తె వివాహం కోసం నగలు కొనుగోలు చేయడానికి నగదుతో వెళ్తున్నట్లు చెప్పాడన్నారు. దీనిపై చెన్నై ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు
*వైకాపా జడ్పీటీసీ అభ్యర్థిని సీఐపై చేయి చేసుకున్న ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. జడ్పీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వారిని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ లలిత వరుసగా పంపుతున్నారు. సరుబుజ్జిలి వైకాపా అభ్యర్థిని లక్ష్మీనరసమ్మ క్యూను తప్పించుకుని వెళ్లబోయారు. అడ్డుకోబోయిన సీఐపై చేయి చేసుకున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి అక్కడకు చేరుకుని ఆరాతీశారు. పొరపాటున చేయి చేసుకున్నానని, మన్నించాలంటూ సీఐకి క్షమాపణ చెప్పడంతో విడిచిపెట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సీఐ ఫిర్యాదు చేశారు.
*కొంపల్లిలోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేసేందుకు ఆ దొంగలు పక్కా ప్రణాళిక రచించారు. ఏకంగా దుకాణం పక్కనే అద్దెకు దిగి చోరీకి ప్రయత్నించగా.. పోలీసులకు సమాచారం అంది చేరుకోవడంతో వెంటనే ఉడాయించారు. పేట్‌బషీరాబాద్‌ ఠాణా సీఐ మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమబంగాకు చెందిన ముగ్గురు యువకులు తమది ఉప్పల్‌ ప్రాంతమంటూ పరిచయం చేసుకుని కొంపల్లిలోని మణప్పురం గోల్డ్‌లోన్‌ దుకాణం పక్కనున్న మడిగలో ఇటీవల అద్దెకు దిగారు.
*సామాజిక మాధ్యమంలో పరిచయం అయిన పాతబస్తీ యువతిని ప్రేమ, పెళ్లిపేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడిన గుల్బర్గా యువకుడిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం… బండ్లగూడ ప్రాంతానికి చెందిన యువతి(23)కి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అద్నాన్‌ అహ్మద్‌ షేక్‌(25)తో 2015లో సామాజిక మాధ్యమంలో పరిచయం ఏర్పడింది.
*సైన్యం రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో బుధవారం రాత్రి జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు మరోసారి మెట్‌పల్లికి వచ్చారు. నగదు బదిలీ చేసిన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న(35)ను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌తో జమ్మూకు తరలించారు.
*ఆర్థిక లావాదేవీల కారణంగానే ఖమ్మం జిల్లా సహాయ కార్మిక అధికారి ఆనందరెడ్డి హత్య జరిగిందని వరంగల్ నగర కమిషనరేట్ డీసీపీ మల్లారెడ్డి అన్నారు. ఆనందరెడ్డి హత్యకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని బుధవారం సాయంత్రం హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని
*స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు నేడు తుదిగడువు కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలుచోట్ల వైకాపా నేతలు దౌర్జన్యాలకు దిగడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. అభ్యర్థి మణెమ్మ చేయి, భుజంపై కత్తితో దాడి చేశారు. ఆమె అల్లుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, న్యాయవాది కిశోర్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించారు.
*లాడ్జిలో చివరిసారి కార్డును స్వైపింగ్‌ చేసిన సందేశం ఆధారంగా ఓ వ్యక్తి మృతదేహాన్ని దుండిగల్‌, కేపీహెచ్‌బీ పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. దుండిగల్‌కు చెందిన శరణ్‌కుమార్‌ (28)కు బీహెచ్‌ఈఎల్‌కు చెందిన మానసతో వివాహమైంది.
*బాలింత మృతికి వైద్యులే కారణమంటూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై ఆమె బంధువులు దాడి చేసిన ఘటన ఇది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది.
*భద్రాచలం ఏరియా ఆసుపత్రి నుంచి ఓ నవజాత శిశువు అపహరణకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు పోలీసులు, బాధితుల కథనం మేరకు… దుమ్ముగూడెం మండలం ములకనపల్లికి చెందిన కారం కాంతమ్మకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పులో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలింత వెంట ఆమె తల్లి లక్ష్మి, ఆశా కార్యకర్త ఉన్నారు. తల్లిపాలు పట్టించాలని విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది ఆ పాపను కన్న తల్లికి అప్పగించారు
*ఆవేశంతో భార్యను సుత్తితో కొట్టాడు.. గాయంతో సృహ తప్పిన ఆమెను చూసి చనిపోయిందని భ్రమించాడు. తనపై కేసు అవుతుందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేశంపేట మండలం సంగెం పరిధిలోని పోల్కోనిగుట్ట తండాలో జరిగిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలానికి చెందిన జంగయ్య(55), భీమమ్మ భార్యాభర్తలు. కేశంపేట మండలంలో వారు గత కొంతకాలంగా రాళ్లు కొట్టుకుంటూ బతుకుతున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో జంగయ్య ఆమెను సుత్తితో కొట్టాడు. తీవ్రంగా గాయపడి ఆమె కింద పడిపోవడంతో చనిపోయిందని భయపడ్డ ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి తండా శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
*వేర్వేరు ఘటనల్లో మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకిలోని జమీల్కుంట ప్రాంతంలో నివసించే మహమ్మద్ వలీ(22) ఆటోడ్రైవరుగా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడి కుమార్తె(17)ను మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సామర్లకోటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వలీని అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 376, 363, రెడ్ విత్ 3/4 పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
*హోలీ ఆడొద్దని చెప్పినా.. తన మాట వినలేదని ఆగ్రహం చెందిన కస్తూర్బాగాంధీ విద్యాలయం వసతిగృహం ప్రత్యేక అధికారి పలువురు విద్యార్థినులను కొట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో చోటుచేసుకుంది. హోలీ పండగ సోమవారం జరిగినా ఈ ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*ప్రయాణికుల బస్సు లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించారు. మంగళవారం ఉదయం ఒక బస్సు 40 మంది ప్రయాణికులతో ఉత్తరాఖండ్ నుంచి హిమచల్ప్రదేశ్కు వస్తుంది. ఈ క్రమంలోనే చంబా జిల్లా సమీపంలోగల జార్జ్ లోయ సమీపానికి రాగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగరు ప్రయాణికులు అక్కడకక్కడే దుర్మరణం చెందగా 35 తీవ్ర గాయాలపాలయ్యారు. సహాయకచర్యల సిబ్బంది, స్థానికుల వారిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిలో యోగేష్కుమార్(47), పూజా కుమారి(28) రాజీవ్కుమార్(37), మణిరామ్(33), దావత్అలీ(30) ఉన్నారు.
*వేగంగా వచ్చిన ఓ టిప్పర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన పటాన్చెరు మండలం, లక్డారం శివారులో చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తి రామిరెడ్డి(25) అని సహచరులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం, పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
*ఏటీఎంలోని సీసీ కెమెరా వైర్లు తొలగించారు. కెమెరాను కాల్చి వేశారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం యంత్రాన్ని కత్తిరించారు. అందులోని రూ.6.37 లక్షలు అపహరించుకుపోయారు. హైదరాబాద్లో హయత్నగర్ నుంచి కుంట్లూర్ వెళ్లే దారిలో మదర్ డెయిరీకి సమీపంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
*కరోనా వైరస్ బాధితుడి కుటుంబ సభ్యులు ఎవరితోనూ కలవవద్దని వైద్యులు సూచించినా వినడంలేదంటూ ఆ కాలనీ అధ్యక్షుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని ఓ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అతనిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు అతడి కుటుంబీకులు, అతడితో కలిసి తిరిగిన వారందరినీ పరీక్షించారు. వారెవరికీ వైరస్ సోకలేదని తేలడంతో ఇళ్లకు పంపించేశారు
*దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.15కోట్ల విలువైన హెరాయిన్ను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకి చెందిన జస్టిన్ డు టువా ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబా నుంచి దిల్లీ వచ్చాడు. కోల్కతాకు వెళ్లాల్సి ఉండగా అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ఈ క్రమంలో టువా బ్యాగులో 3.4కిలోల హెరాయిన్ లభ్యమయింది. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
*ఆకర్షణీయ పథకాల ఆశచూపి ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేసి కొల్లగొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు మొదలుపెట్టింది. విజయవాడ, హైదరాబాద్ల్లోని సంస్థ కార్యాలయాల్లో బుధవారం ఈ సోదాలు నిర్వహించింది.
*కృష్ణా జిల్లాలోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కొన్ని కళాశాలల్లో ఉదయం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. విజయవాడ ఎంజీరోడ్డులోని సెంట్రల్ కార్యాలయానికి మూడు వాహనాల్లో అధికారులు ఉదయం ఆరు గంటలకే చేరుకున్నారు. ప్రిన్సిపల్ వచ్చాక సోదాలు ప్రారంభించారు. కంకిపాడు మండలం పునాదిపాడు పరిధిలోని శ్రీవైభవి క్యాంపస్లోకి ఉదయం 10 గంటలకు ఎనిమిది మంది ఐటీ అధికారులు వెళ్లారు. ఐటీ అధికారులు వచ్చే సరికి కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రాత్రి వరకు అక్కడే నిరీక్షించారు. పోరంకిలోని శ్రీచైతన్య ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు చేశారు. దాదాపు 20 మంది అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ముఖ్యమైన రికార్డులు, దస్త్రాలు పరిశీలించినట్లు తెలిసింది. హైదరాబాద్, ముంబయిలోని శ్రీచైతన్య కళాశాలల్లోనూ ఐటీ సోదాలు జరిగినట్లు సమాచారం.
*లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్ఈపీఎల్) సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. విజయవాడ రామచంద్రనగర్లోని ఆ సంస్థ కార్పొరేట్ భవనంలో ఉదయం నుంచి రాత్రి వరకూ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీకి చెందిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. కార్యాలయం లోపలికి ఎవర్నీ అనుమతించలేదు. సంస్థ కార్యాలయంలోని పలు రికార్డులు, దస్త్రాలు పరిశీలించినట్లు సమాచారం. కంప్యూటర్లల్లోని డేటాను విశ్లేషించినట్లు తెలిసింది.
*డిగ్రీ చదువుకున్నా సరే విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తాం.. కొలువులతో పాటు పరిమిత కాలానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు, నెలకు వేల డాలర్ల జీతం, ఉచిత వసతిని సైతం కల్పిస్తామంటూ దిల్లీ కేంద్రంగా సైబర్ నేరస్థులు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఈ క్రమంలో అమెరికా, ఐరోపాల్లోని బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలంటూ అంతర్జాలంలోని పలు వెబ్సైట్లలో ప్రచారంతో మోసం చేస్తున్నారు.
*మండపం వద్ద జాలర్ల పడవలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తీర గస్తీ విభాగం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి సమయంలో తీర గస్తీ నౌకతో గాలింపు చేపట్టగా, గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద నూలు సంచి లోపల నల్లని కాగితంతో చుట్టిన 5ప్యాకెట్లను గుర్తించామని వెల్లడించారు. అందులో బంగారం ఉన్నట్లు తేలిందన్నారు. మొత్తం 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.6.3 కోట్ల వరకు ఉంటుందన్నారు. మరిన్ని ప్రాంతాల్లో సోదాలు ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
*దంపతుల వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వారి నుంచి నగదు డిమాండ్ చేస్తున్న ఇద్దరు యువకులపై కృష్ణా జిల్లా గుడివాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన దంపతుల పడకగది దృశ్యాలను అట్లూరి రఘు, షేక్ అన్వర్లు రహస్యంగా చిత్రీకరించారు