Movies

ఆ చెత్తరాతలు బాధించాయి

Anushka Feels Bad Over Gossips On Her Wedding

వెండితెరలో శిఖరాగ్రాలను అందుకున్న హీరోయిన్‌ స్వీటీ అనుష్క. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషకాలు అందుకోగల అతి కొద్దిమంది టాలీవుడ్‌ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించి 15 వసంతాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ అందచందాల్లోనూ, అభినయాల్లోనూ తనకు తానే సాటిగా నిలిచారు. అయితే ఆమెను కొన్ని సంవత్సరాలుగా ఓ విషయం వెంటాడి వేధిస్తోంది. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ అది అంతలా బాధిస్తోంది తనను కాదని, తన కుటుంబాన్ని అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె దేనికోసం మాట్లాడుతుందనుకుంటున్నారు.. ఇంకేముందీ పెళ్లిగోల… అప్పట్లో బాహుబలి హీరో ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్‌ కొనసాగించదని వార్తలు వచ్చాయి. ఇవి సరిపోవన్నట్లు జడ్జిమెంటల్‌ హై క్యా దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో ఓ వ్యాపారవేత్తతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందన్న వార్తలకూ కొదవ లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు వినీవినీ అనుష్కకు విసుగెత్తిపోయారు.