Politics

కాంగ్రెస్‌కు శశిథరూర్ టాటా?

Sasi Tharur To Quit Congress

సింధియ బాటలో శశిధరూర్ కాంగ్రెస్ కీలక నేతలంతా కాంగ్రెస్ ను వీడే పనిలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిధరూర్ కూడా త్వరలోనే కాంగ్రెస్ ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది కాంగ్రెస్ వ్యతిరేక గాలిలోనూ శశి థరూర్ ఎంపీగా గెలిచారు. అంతటి ఉద్దండ నేత కూడా ఇప్పుడు కేరళ లో భాజపాకి పెద్ద దిక్కుగా మరబోతున్నారని టాక్. కేరళలో బలపడాలని చూస్తున్న భాజపా అందుకు అక్కడ బలమైన నేతలకు గాలం వేస్తోంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను దెబ్బతీసి భాజపా బలపడాలంటే శశి ధరూర్ ను లాగాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ కోలుకున్తుందన్న ఆశ ఆపార్టీ సీనియర్లలో సందేహంగామారింది. పైగా శశిధరూర్ మెడకు ఆయన భార్య అనుమానాస్పద మృతి కేసు వేలాడుతుంది. అందుకే శశి ధరూర్ భాజాపాలో చేరడం ఖాయమంటున్నారు తాజాగా సింధియా బాటలోనే శశిధరూర్ కూడా అవసరార్ధం భాజపాలో చేరబోతున్నారని కేరళ నుంచి వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ మరింత కుంగిపోవడం ఖాయం.