DailyDose

జగన్‌పై గవర్నర్‌కు భాజపా ఫిర్యాదు-రాజకీయం

Telugu Political News Roundup Today-BJP Complains On Jagan To Governor

*రాజ్ భవన్ లో ఎపి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసిన ఎపి బిజెపి కో ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్, బిజెపి నేతలుస్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి నేతలు పోటీ చేయకుండా బెదిరించడంకార్యకర్తలు పై వరుస దాడులు.. నామినేషన్లు లాక్కోవడం‌ వంటి ఘటనల పై గవర్నర్ కు ఫిర్యాదుసునీల్ దియోధర్రాష్ట్రం లో‌ వైసిపి రౌడీ పార్టీ గా వ్యవహరిస్తుందిబిజెపి, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారుపోలీసులు సమక్షంలోనే నామినేషన్లు పత్రాలు లాక్కుని చించేస్తున్నారురౌడీయిజం, గూండాయిజంతో భయపెడుతున్నారుదాడులు, దాష్టికాల వల్ల మా పార్టీ నేతలకు ప్రాణ భయం ఉందిపది సంఘటనల పై ఆధారాలతో గవర్నర్ కు వివరించాంపోలీసులు కూడా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారువైయస్ హయాంలో ఇంత దారుణాలు జరగలేదురాష్ట్రం లో ఎంపికలే తప్ప.. ఎన్నికలు జరగడం లేదు.ఈ అంశాలను వివరిస్తూ వినతి పత్రాన్ని ఇచ్చి, చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరాంమా‌ విజ్ఞప్తి పై గవర్నర్ సానుకూలంగా స్పందించి, పరిశీలిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా ఇంచార్జి సునీల్ దేయోదర్ గారితో యు. శ్రీనివాసరాజు,అడపా నాగేంద్రరావు, వామరాజు సత్యమూర్తి,కానూరి బాలకృష్ణ మోహన్(బాలు)పాతూరి నాగభూషణం, కోడూరి రఘువంశీ,గంగాధర్ వుల్లూరి ,నడింపల్లి ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
*యడియూరప్పపై ఏకంగా 16 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి!
కర్నాటకలో కొత్త నాటకం ప్రారంభమైంది. మొన్నటికి మొన్నే రాజకీయంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న కర్నాటక సర్కారు.. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాజకీయంగా కొంత శాంతించింది. అయితే తాజాగా మరో కొత్త ట్విస్ట్ ప్రారంభమైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి యడియూరప్పపై ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశం యడియూరప్ప అధ్యక్షత జరిగింది. అయితే ఈ సమావేశంలో కోస్టల్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 16 మంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని సీఎం మొహం మీదే చెప్పేశారు. యడియూరప్ప వర్కింగ్ స్టైల్ ఏమాత్రం బాగోలేదని, అంతేకాకుండా పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరి పోయిందని వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో సీఎం యడియూరప్ప ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ తమ నియోజకవర్గాలకు అవసరమైన నిధులను తాను విడుదల చేస్తూనే ఉన్నానని, అయినా సరే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలాంటి నిందలు వేయడం ఏమాత్రం బాగోలేదని నిర్మొహమాటంగా అన్నట్లు కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
*పోలీసుల వ్యవహారశైలి సరిగా లేదు: వర్ల రామయ్య
రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలి సరిగా లేదని టీడీపీ నేత వర్లరామయ్య ధ్వజమెత్తారు. డీజీపీ సవాంగ్‌ సర్వీసులో నిన్న చీకటి రోజు అని అన్నారు. గతంలో ఏ డీజీపీకి ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. తనను కోర్టులో ఎందుకు నిలబెట్టారని, డీజీపీ వెళ్లి సీఎం జగన్‌ను అడిగి ఉండాల్సిందన్నారు. కోర్టులో డీజీపీ సెక్షన్ 151ను చదివి వినిపించడం అంటే.. పోలీస్‌ వ్యవస్థను కోర్టు ప్రశ్నించినట్లేనని వర్లరామయ్య వ్యాఖ్యానించారు. వైసీపీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో చర్చకు సిద్ధమని వర్లరామయ్య సవాల్ విసిరారు.
*టీ కాంగ్రెస్ నేతలపై అధిష్ఠానం సీరియస్
టీ కాంగ్రెస్ నేతల తీరుపై అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నేతలు ఇష్టానుసారంగా మీడియా ముందు మాట్లాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పీసీసీకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా లేఖ రాశారు. నేతల చేస్తున్న వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. నేతల వ్యాఖ్యల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని లేఖలో పేర్కొన్నారు. ఏదైనా చెప్పాలనుకుంటే పీసీసీకి లేదా ఏఐసీసీకి లేఖ రాయాలన్నారు. అంతేకానీ మీడియా, సోషల్ మీడియాలలో చర్చించడం తగదని హితవు పలికారు.
*ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది: కన్నా
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితులు కన్పించడం లేదని.. రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నవరత్నాల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయనగరంలో ఆధునికీకరించిన పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వైకాపా నాయకులు, కార్యకర్తల్లా వ్యవహరిస్తూ అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కన్నా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగుతున్న తీరుపై కేంద్ర హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు కన్నా తెలిపారు.
*అసెంబ్లీ లో బలపరీక్షకు సిద్దం
మధ్యప్రదేశ్ లో రాజకీయాలు ఊహించని మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కమల్ నాద్ సారధ్యంలోని కాంగ్రెస్ సర్కారు బలపరీక్షకు సిద్దమైంది. అసెంబ్లీలో పరీక్ష నిర్వహించాలని కోరుతూ ఈరోజు కమల్నాద్ తమ రాష్ట్ర గవర్నర్ లాల్లి టాండన్ కు ఓ వినతి పత్రం సమర్పించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బలపరీక్ష ఎదుర్కొంటామని తేదీని అసెంబ్లీ స్పీకరు నిర్ణయించాలని ఆయన కోరారు. అనంతరం కమల్ నాద మీదియాటి మాట్లాడుతూ బలపరీక్ష జరుగుతుంది. కానీ నిర్భందంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు విడిచిపెడితే ఇది సాధ్యం కదా అని ఆయన వ్యాఖ్యానించారు.
*మాన్సాస్ భూముల దోపిడీకి జగన్ కుట్ర- మాధవ్
మాన్సాస్ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భాజపా ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంసాస్ భూములను మీడియాతో మాట్లాడిన ఆయన విద్యా సంస్థలు ఆలయాల నిర్వహణకు పీవీజీ రాజు రూ. లక్ష కోట్ల విలువైన భూములు దానం చేసారని అన్నారు. ఆ భూములను కాజేయాలని దురుద్దేశంతోనే వైకాపా ప్రభుత్వం రాత్రికిరాత్రి అక్రమ జీవోలు జారీ చేసిందని ఆరోపించారు. మాన్సాస్ బోర్డులో సుప్రీంకోర్టు న్యాయవాదిని చేర్చడంతోనే జగన్ అంతర్యం ఏమిటో అర్ధమైపోయిందని మధవ్ పేర్కొన్నారు.
* స్థానిక ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు: కన్నా లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక ప్రభుత్వం నడుస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందికేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకోవాలిబీజేపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం దారుణంఆంధ్రప్రదేశ్‌లో అరాచక ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదని చెప్పారు.అరాచకాలు జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ చూస్తూ ఊరుకుంటోందని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకోవాలని ఆయన చెప్పారు. ఈ విషయంపై తాము కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.
* నామినేషన్‌ దాఖలు చేసిన జ్యోతిరాధిత్య సింధియా
భారతీయ జనతా పార్టీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు సింధియా తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జ్యోతిరాధిత్య సింధియా ఈ నెల 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో కమలం గూటికి చేరిన విషయం విదితమే. అదే రోజు సాయంత్రం.. రాజ్యసభ అభ్యర్థిగా సింధియా పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మరుసటి రోజు మర్యాదపూర్వకంగా రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షాను సింధియా కలిశారు. ఈ నెల 26న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
* సింధియాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాక్‌
కాంగ్రెస్‌ పార్టీ నుంచి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు గతంలో ఆయన మీద పెండింగ్‌లో ఉన్న ఓ ఫోర్జరీ కేసులో వాస్తవాలను విచారించాలని మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేరాల విభాగాన్ని (ఈఓడబ్ల్యూ) ఆదేశించింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మహాల్గావ్‌లో ఓ భూమిని పత్రాల్లో ఉన్న దాని కంటే 6,000 చదరపు అడుగులు తక్కువగా చూపి తనకు విక్రయించారని సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి మార్చి 26, 2014న సింధియా, ఆయన కుటుంబంపై ఫిర్యాదు చేశాడని ఈఓడబ్ల్యూ తెలిపింది. అయితే ఆ కేసులో విచారణను 2018లో నిలిపివేశారు. తాజాగా ఈ కేసును విచారించాలని శ్రీవాస్తవ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వాస్తవాలను విచారించాలని తమకు ఆదేశాలు అందాయని ఈఓడబ్ల్యూ అధికారి ఒకరు తెలిపారు.
* తమ్ముడి రాజీనామా.. సంచలన విషయాన్ని వెల్లడించిన కేఈ కృష్ణమూర్తి
తమ్ముడి రాజీనామాపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ప్రభాకర్ తనతో మాట్లాడలేదని.. వైసీపీలోకి వెళ్తే అభ్యంతరం లేదన్నారు. కాగా.. డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని కేఈ కృష్ణమూర్తి స్వయంగా వెల్లడించారు. డోన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు చైర్మన్‌, 32 వార్డులు దానం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు
* విద్యుత్‌ ఛార్జీలు పెంచకతప్పదు : కేసీఆర్‌
విద్యుత్‌ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… పేదలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతామని వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్నులు పెంచక తప్పదన్నారు. పన్నులు చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం, నగరాలు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధికోసం ఛార్జీల పెంపును భరించాలని ప్రజలను కోరారు.
* తాడిపత్రిలో జేసీపై దాడికియత్నం
మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు కార్యాలయం వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపుచేశారు.వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి… తెదేపా తరఫున నామినేషన్‌ వేస్తున్నవారిని అడ్డుకుని బెదిరిస్తున్నారని 36వ వార్డు తెదేపా అభ్యర్థిని జింక లక్ష్మీదేవి ఆరోపించారు.
*హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌రెడ్డి
డ్రోన్‌ కెమెరా కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసుకు సంబంధించి ఆయన ఇవాళ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు.
*గ్రామాల రూపురేఖలు మారుస్తాం: కేసీఆర్‌
పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, చేతి వృత్తులు, కులవృత్తులకు అవసరమైన చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను పటిష్ఠం చేశాం. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి రైతు సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లవంటి ప్రజాసంక్షే్మ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనభద్రతతో పాటు భవిష్యత్‌పై ఆశ కల్పించాం. ప్రణాళికాబద్ధంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే మా లక్ష్యం. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేస్తాం. వందశాతం వైకుంఠధామాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను చేస్తాం. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం వివరించారు.
*విద్యుత్‌ ఛార్జీలు పెంచకతప్పదు : కేసీఆర్‌
విద్యుత్‌ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… పేదలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతామని వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్నులు పెంచక తప్పదన్నారు. పన్నులు చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం, నగరాలు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధికోసం ఛార్జీల పెంపును భరించాలని ప్రజలను కోరారు.
*ఆహ్వానం రాలేదు.. వస్తే వెళతాను: కేఈ ప్రభాకర్
కీలక నేతలంతా టీడీపీకి షాకుల మీద షాకులిస్తున్నారు. తాజాగా కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన చెందిన ఆయన.. వారితో సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చారు.రాజీనామా అనంతరం కేఈ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని వీడటం బాధగా ఉందన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెసు పార్టీ విధానాలనే టీడీపీలోనూ అవలంబిస్తున్నారు. తన అన్న కేఈ క్రిష్ణమూర్తి పార్టీ మారతారా? లేదా? అన్నది ఆయన ఇష్టమన్నారు. వైసీపీ నుంచి తనకు ఆహ్వానం రాలేదని.. వస్తే వెళ్తానని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు.
*రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి వివరించాలి: యనమల
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై… గవర్నర్‌ను రెండు మూడుసార్లు కలిసి ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ హరిచందన్‌ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు.గవర్నర్‌ ఇప్పటికైనా స్పందించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి వివరించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని యనమల స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని పరిస్థితులను చూస్తున్నామన్నారు. వ్యవస్థలన్నీ చేతులెత్తేశాక ప్రజలే గుణపాఠం చెప్పాలని యనమల పేర్కొన్నారు.
*కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు-ఎంపీ రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజం
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరు నేతలు తెరాసలోకి వెళ్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వారు చేస్తున్న ప్రచారంతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. రేవంత్ అనుచరులు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 111 జీవో పరిధిలో కొన్ని నిర్మాణాలు జరిగాయని జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్, కేటీఆర్ల మధ్య పంచాయతీ వారి వ్యక్తిగతమని, మధ్యలో కాంగ్రెస్పై ఎందుకు బురదజల్లుతున్నారని ఆయన ప్రశ్నించారు. పార్టీలోని నేతలను కట్టడి చేసేందుకు తక్షణం కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
*కేంద్ర నిధులపై స్పష్టతనివ్వండి: రాజాసింగ్
రాష్ట్రంలో కేంద్ర ద్వారా వచ్చిన నిధులతో అమలవుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులకోసం పోరాడుదామన్నారు.
*బెల్ట్షాపులపై చర్చించాలని కోరాం: భట్టి
గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలను నాశనం చేస్తున్న బెల్ట్షాపులు, మద్యంపై సభలో చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇస్తే స్పీకర్ తిరస్కరించారని శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద, సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ను కలిసి ఇది చాలా ముఖ్యమైన అంశమని పేర్కొంటూ దాని ప్రాధాన్యాన్ని వివరించామన్నారు. రెండు, మూడు రోజుల్లో మద్యంపై స్వల్పకాలిక చర్చ ఉండొచ్చన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నుంచి బయటికి వెళ్లడం సరికాదని అన్నారు.
*మునుగోడు’కు ఉపఎన్నికలు..మంత్రి వ్యాఖ్యలపై రాజగోపాల్రెడ్డి ఆగ్రహం
‘మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయంటూ’ మంత్రి జగదీష్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నల్గొండ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. మార్క్ఫెడ్ డైరెక్టర్గా నామినేషన్ వేసే కాంగ్రెస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ తాను సభలో ప్రస్తావిస్తే.. సీఎం ‘గెట్ ఔట్’ అన్నారు, కానీ నాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని మాత్రం ఏం అనలేదు అన్నారు. అసెంబ్లీలో అలాంటి భాష వాడటం ఎంత వరకు సబబో కేసీఆర్ విచక్షణకే వదిలేస్తున్నానన్నారు. స్పీకర్ తనపై చర్యలు తీసుకోవాలనుకుంటే.. ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు.
*జగన్తో కరణం బలరామ్ భేటీ
తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆయన తనయుడు కరణం వెంకటేష్తో సహా ఏపీ సీఎం వైఎస్ జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ముఖ్యమంత్రితో సమావేశానంతరం బలరామ్ తనయుడు కరణం వెంకటేష్ వైకాపాలో చేరారు. జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కరణం బలరామ్ అధికారికంగా వైకాపాలో చేరకుండా, కుమారుణ్ని చేర్పించి వెళ్లిపోయారు. గన్నవరం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తరహాలోనే బలరామ్ ఉండబోతున్నారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి
*ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
మధ్యప్రదేశ్లో రాజీనామాలు సమర్పించిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారంలోగా తనను కలవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పి.ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేక ఏమైనా ఒత్తిళ్లకు లోనైయ్యారా అన్న విషయం తెలుసుకునేందుకే వీరిని పిలిచినట్లు శాసనసభ ముఖ్య కార్యదర్శి ఎ.పి.సింగ్ తెలిపారు. ఈనెల 16న బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్, స్పీకర్లను కోరుతున్నట్లు భాజపా విప్ నరోత్తమ్ మిశ్రా తెలిపారు. కాషాయదళంలో చేరిన సింధియాకు గురువారం భోపాల్లో ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో భాజపాత్ శ్రేణులు, అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చి స్వాగతం పలికారు. భాజపా కార్యాలయంలో జ్యోతిరాదిత్య సింధియా తండ్రి దివంగత మాధవ్రావు సింధియా ఫోటోలు ప్రముఖంగా ఏర్పాటు చేశారు.
*మతతత్వం కరోనా కన్నా ప్రమాదకరం-రాజ్యసభలో బండా ప్రకాశ్
ప్రజాస్వామ్య దేశంలో మతతత్వం అనేది కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమని తెరాస సభ్యుడు బండా ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ఇది కొన్ని రోజులపాటు దేశాన్ని కుదిపేస్తుందని చెప్పారు. గురువారం రాజ్యసభలో.. ఈశాన్య దిల్లీలో అల్లర్లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. అల్లర్లను తెరాస ఖండిస్తోందని, తెరాసఅధినేత కేసీఆర్ కూడా దేశంలో హిందూ, ముస్లింల సోదరభావాన్ని కోరుకుంటారని చెప్పారు. అల్లర్లకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలని కోరారు. గురువారం రాజ్యసభలో దివాలా చట్టం(సవరణ) బిల్లుపై ఆయన మాట్లాడారు. స్థిరాస్తి రంగానికి సంబంధించి కూడా ఓ సారి పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.
*15న హైదరాబాద్కు బండి సంజయ్- విమానాశ్రయం నుంచి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియామకమైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నెల 15న హైదరాబాద్కు రానున్నారు. అదే రోజున లేదంటే మరో రోజు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దిల్లీలో ఉన్న సంజయ్ భాగ్యనగరానికి ఆదివారం వస్తున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని కమలదళం నిర్ణయించింది. నూతన అధ్యక్షుడికి స్వాగత ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు..హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు గురువారమిక్కడ సమావేశమై చర్చించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేటకు హెలికాప్టర్లో మధ్యాహ్నం చేరుకుని అక్కడి నుంచి ర్యాలీలో సంజయ్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు.
*ప్రజా సమస్యలపై ఉద్యమించండిభాజపా రాష్ట్రాధ్యక్షుడు సంజయ్కు అమిత్ షా
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డితో కలిసి అమిత్ షా, నడ్డాలను గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ తెలంగాణలో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని.. ప్రజల్లోనూ పార్టీకి మంచి ఆదరణ ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అధ్యక్షునిగా నియమితులైనందుకు వారు సంజయ్కు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సంజయ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు. సంజయ్ గురువారం ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి సౌదాన్ సింగ్ను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వారు చర్చించారు.