NRI-NRT

కొరోనాపై పోరాటానికి ₹3.7లక్షల కోట్లు ప్రకటించిన ట్రంప్

కొరోనాపై పోరాటానికి ₹3.7లక్షల కోట్లు ప్రకటించిన ట్రంప్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కొరోనా వైరస్ (COVID-19) నిరోధానికి తమ దేశం తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశాన్ని, పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ వైద్య సేవల కార్యదర్శికి తన కార్యాలయం నుండి అనుమతులను విరివిగా అందజేస్తామని, ₹3.7లక్షల కోట్లను ఈ భయానక వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రణాలికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. కొరోనాను జాతీయ విపత్తుగా గుర్తిస్తున్నామని, ఈ వైరస్ పరీక్ష కిట్లు అన్ని రాష్ట్రాలకు చేరేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 41మంది ఈ మహమ్మారి బారినపడి మృతిచెందగా, 2000కుపైగా రోగుల్లో ఇది ఉన్నట్లు నిర్ధారణ పరీక్షల ద్వారా రుజువైంది. మరో వైపు చైనా ఈ కొరోనా వైరస్ సృష్టికర్త అమెరికా ప్రభుత్వమేనంటు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.