Health

ప్రపంచాన్ని కమ్ముకుంటున్న కరోనా-TNI ప్రత్యేక కథనాలు

Corona Special Stories-Spreading Across The Globe

1. బ్రిటన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
బ్రిటన్‌లో మొత్తం కరోనా కేసులు 798కి చేరుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 7న అక్కడ జరగనున్న స్థానిక, మేయర్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇంగ్లండ్ ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా ఉపద్రవం నేపథ్యంలో అధిక శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోవచ్చని ఎలక్టోరల్ కమిషన్ భావించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వచ్చే ఏడాదికి వాయిదే వేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. కాగా..బ్రిటన్‌లో ఇటీవల కేవలం 24 గంటల్లో 208 కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడ కలకలం రేగిన విషయం తెలిసిందే.
2.చైనాకు కరోనాను తెచ్చింది అమెరికానే..?
ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ మొదటి కేసు చైనాలో బయటపడ్డప్పటికీ, అది కచ్చితంగా ఎక్కడ ఆరంభమైందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా వైరస్ సోకిన పేషెంట్ జీరో(వైరస్ బారినపడిన మొదటి వ్యక్తి) ఎవరనే దానిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో తొలి కేసు నిర్ధారణ కావడం, అక్కడ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వుహాన్లోనే ఈ వైరస్ బయటపడ్డట్లు అనుమానిస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా వైరస్ పుట్టుకపై కొత్త వాదన మొదలైంది. అసలు కొవిడ్-19వైరస్ చైనాకు రావడానికి అమెరికా కుట్ర పన్నిందని తాజాగా చైనా ఆరోపించింది. అమెరికా ఆర్మీనే ఈ వైరస్ను చైనాకు తీసుకొచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తూ తాజాగా చైనా అధికారులు ఆరోపణ చేశారు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిజియన్ జాహో తన ట్విటర్ పేజీలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న సమయంలో ఈ మాటల యుద్ధం మరింత ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.
3.మూడున్నర గంటల్లో కొవిడ్-19 నిర్ధారణ
కరోనా(కొవిడ్-19) అనుమానిత కేసులను వేగంగా నిర్ధరించేందుకు కొత్త పరీక్ష విధానాన్ని రూపొందించినట్లు స్విస్ ఔషధ తయారీ సంస్థ ‘రోష్’ ప్రకటించింది. దీనికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్డీఏ) నుంచి అత్యవసర ఆమోదం లభించినట్లు వివరించింది. పూర్తిగా ఆటోమేటిక్ పద్ధతిలో పనిచేసే ‘కోబాస్ 6800/800’ సాధనంతో పెద్ద సంఖ్యలో ఈ పరీక్షలను నిర్వహించవచ్చని పేర్కొంది. ఇతర విధానాలతో పోలిస్తే పరీక్ష వేగం కనీసం పది రెట్లు పెరుగుతుందని తెలిపింది. మూడున్నర గంటల్లోనే ఫలితాన్ని పొందొచ్చని వెల్లడించింది. తమ యంత్రాలు 24 గంటల వ్యవధిలో 4,128 నమూనాల ఫలితాలను అందించగలవని పేర్కొంది.
4. కరోనాపై భయం వద్దు.. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం..
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఈ వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్‌ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వారి నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్‌ చెప్పారు.
5. రాజస్థాన్‌లో విద్యాసంస్థలు, సినిమాహాళ్లు బంద్‌
కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్‌లు, జిమ్స్‌, సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం నేడు ఉత్వర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన బోర్డు ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ ప్రకారం యధావిధిగా కొనసాగనున్నట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. దేశంలో కోవిడ్‌-19 కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో 82 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ఇప్పటికే తమ తమ రాష్ర్టాల్లో విద్యాసంస్థలను, సినిమాహాళ్లను మూసివేస్తూ నిర్ణయం వెలువరించారు.
6. తెలుగు రాష్ట్రాల‌లో మూత‌ప‌డ‌నున్న థియేట‌ర్స్‌..!
ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ వ‌ల‌న ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌లో సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌న తెలుగు రాష్ట్రాల‌లోను థియేట‌ర్స్ మూసివేత‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు నిర్మాత మండ‌లి,సినిమా ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌ ఫిలిం ఛాంబ‌ర్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం త‌ర్వాత దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని నిర్మాత మండ‌లి చెబుతుంది. ఇప్ప‌టికే నెల్లూరు, కేరళ‌, ఢిల్లీ, జ‌మ్మూ క‌శ్మీర్, రాజ‌స్థాన్ త‌దిత‌ర ప్రాంతాల‌లో థియేటర్స్ తాత్కాలికంగా మూత‌ప‌డ్డాయి. అయితే నిర్మాత మండ‌లి నిర్ణ‌యాన్ని బ‌ట్టి మార్చి 25న విడుద‌ల కావ‌ల‌సి ఉన్న వి చిత్రం, ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా, ల‌వ్ పాజిటివ్‌,శక్తి చిత్రాలని రిలీజ్ చేయాలా లేదంటే కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలా అని నిర్మాత‌లు ఆలోచ‌న చేస్తున్నారు.
7. క‌పిల్ బ‌యోపిక్‌పై క‌రోనా ఎఫెక్ట్‌ ..!
1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ను ఎలా సాధించింది అన్న నేపథ్యంతో 83 అనే సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే . క‌బీర్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్ సింగ్ క‌పిల్ దేవ్‌గా క‌నిపించ‌నున్నాడు. సునీల్‌ గవాస్కర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు తాహీర్‌ రాజ్‌ భాసిన్, అప్పటి జట్టు మేనేజర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్‌ పాటిల్‌ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్‌ పాటిల్, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్‌ కిర్మాణిగా సాహిల్‌ ఖట్టర్, బల్వీందర్‌ సింగ్‌గా అమ్మీ విర్క్‌ కనిపించబోతున్నారు. ఇక రణ్‌వీర్‌కు జోడీగా దీపిక పదుకొణె రోమి అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది.ఏప్రిల్ 10న 83 చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించ‌గా, క‌రోనా ఎఫెక్ట్‌తో ఈ మూవీ మ‌రి కొద్ది రోజులు వాయిదా ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఢిల్లీతో పాటు ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టికే సినిమా హాల్స్‌కి బంద్ ప్ర‌క‌టించాయి. మ‌రోవైపు కరోనాకి భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు థియేట‌ర్స్ వైపే చూడ‌డం మానేశారు. ఈ నేప‌థ్యంలో చిత్రాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తే మంచిద‌ని చిత్ర బృందం భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇటీవ‌ల‌ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా జ‌ర‌పాల‌ని చిత్ర బృందం భావించిన‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం విజృంభిస్తున్న క‌రోనా కార‌ణంగా ఈవెంట్‌ని ర‌ద్దుచేశారు. రీసెంట్‌గా అక్ష‌య్ కుమార్ న‌టించిన సూర్య‌వంశీ చిత్రం కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డ్డ విష‌యం విదిత‌మే.
8. క‌రోనా ఎఫెక్ట్‌.. మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ‘వి’ వాయిదా
క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంది. క‌రోనా బారిన ప‌డ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తుంది. గుమిగూడిన ప్ర‌దేశాల‌లో ఎక్కువ‌గా ఉండొద్ద‌ని, మాల్స్‌, సినిమా హాల్స్‌కి వెళ్ల‌క‌పోవ‌డం మంచిద‌ని చెబుతుంది. అయితే ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ప‌లు సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డ్డాయి. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలోని థియేట‌ర్స్‌కి సంబంధించి నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది.ప్ర‌జ‌ల ఆరోగ్యంతో పాటు శ్రేయ‌స్సుని దృష్టిలో పెట్టుకొని వి మూవీని వాయిదా వేస్తున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు వి నిర్మాత‌లు. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన‌ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వి’. మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి క‌థానాయిక‌లుగా న‌టించారు. మార్చి 25న ఉగాది శుభాకాంక్ష‌ల‌తో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించినప్పటికీ, కోవిడ్ 19 కార‌ణంగా మూవీని ఏప్రిల్‌కి వాయిదా వేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ మీకు త‌ప్ప‌క వినోదం అందిస్తుంద‌ని మేము హామీ ఇస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.
9. కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం మినీ ఎమెర్జెన్సీని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్‌ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్‌ అంటువ్యాధి కొవిడ్‌-19 రెగ్యులేషన్‌ 2020’గా నామకరణం చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం శుక్రవారం నుంచే ఈ చట్టం రాష్ట్ర మొత్తం అమలులోకి వచ్చింది. ఇది ఏడాదిపాటు అమల్లో ఉంటుంది.ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ కమిషనర్‌కు మరిన్ని అధికారాలు అప్పగించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్‌, వైద్యాధికారి, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.వైద్య సంస్థల విధులురాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలు పూర్తిగా కరోనా నియంత్రణ కోసం పని చేయాలి. అవసరమైన చోట ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసుకుని అనుమానితులను చికిత్స అందించాలి.విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు దగ్గు, జలుబు, శ్వాససంబంధింత వ్యాధులు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉండాలి. అనుమానుతులను 14 రోజులు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంచాలి. వైద్య సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, అధికారులు కానీ ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా మీడియాకు సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అందిస్తే దీన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. చట్టం అధికారాలివేకరోనా లక్షణాలున్న వారిని సెక్షన్‌-6 ప్రకారం సంబంధింత అధికారాలున్న వారు మాత్రమే చేర్చుకోవాలి.అనుమానితులు ఎవరైనా చికిత్సకు నిరాకరిస్తే అధికారులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించొచ్చు. ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతంపై జిల్లా కలెక్టర్‌కు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ప్రవేశాల నిషేధం, పాఠశాలలు, సినిమా హాళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, బహిరంగ సమావేశాలను నియంత్రించవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులు.
10. మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ (నేషనల్‌ ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
అదే విధంగా కరోనాను అరికట్టేందుకు 50 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘సమాఖ్య ప్రభుత్వ అధికారాలను అనుసరించి ఈరోజు జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నాను’’అని శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్‌ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న ట్రంప్‌… ఈ ప్రాణాంతక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కూడా కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు.
11. తొలి కరోనా మృతుడిని కలిసిన 34 మంది వ్యక్తులను అధికారులు గుర్తించారు. వారిలో ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్టు తెలుసుకున్నారు. అయితే 34 మంది శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపారు. ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాప్తితో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడిని వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.
12. కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా రోమ్‌లోని కేథలిక్‌ చర్చిలను మూసివేశారు. తిరిగి ఏప్రిల్‌ 3 తర్వాత తెరుచుకోనున్నాయి. పశ్చిమాసియాలో కొన్నిచోట్ల సామూహిక ప్రార్థనలను తాత్కాలికంగా నిలిపివేయగా ఇంకొన్నిచోట్ల పాల్గొనే వారి సంఖ్యను పరిమితం చేయాలని మతాధికారులు నిర్ణయించారు. జెరూసలేంలో సామూహిక ప్రార్థనల్లో 100 మందిలోపే పాల్గొనాలని క్రైస్తవ, ముస్లిం, యూదు నాయకులు నిర్ణయించారు. ఈజిప్టు మసీదుల్లో 15 నిమిషాలకు మించకుండా ప్రార్థనలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
13. వివిధ దేశాల ప్రముఖులకు కూడా కరోనా సోకింది. తనకు కరోనా నిర్ధారణ అయిందని ఆస్ట్రేలియా హోం మంత్రి పీటర్‌ డటన్‌ తెలిపారు. కొద్ది రోజుల కిందటే ఆయన అమెరికా నుంచి తిరిగొచ్చారు. అమెరికాలో ఇవాంకా సహా పలువురు ప్రముఖులను ఆయన కలిశారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడోకు, న్యూయార్క్‌లో ఉన్న ఫిలిప్పైన్స్‌ ఒక దౌత్యవేత్త కూడా వైరస్‌ బారినపడ్డారు.
14. నమస్తే.. నమస్తే.. ఈ పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోంది. దాదాపు అన్ని దేశాల్లో సామాన్యుడి నుంచి ఆయా దేశాధినేతల వరకు షేక్‌ హ్యాండ్లు, కౌగిలింతలకు బదులు నమస్తే అని పలకరించుకుంటున్నారు. ఇప్పటి దాకా భారత సంప్రదాయంలో మాత్రమే భాగమైన ఈ పదం ఇప్పుడు పేద, ధనిక, మతం, ప్రాంతం ఇలా అన్ని రకాల భేదాలకు అతీతంగా మారింది. కరోనాపై యుద్ధంలో ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది ‘నమస్తే’
15. హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన ట్రంప్‌.. క‌రోనా క‌ట్ట‌డికి 50 బిలియ‌న్ డాల‌ర్ల నిధి
నోవెల్ క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యం అమెరికా జాతీయ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుద‌న్నారు. నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీని అధికారికంగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వైర‌స్ నియంత్ర‌ణ‌కు 50 బిలియ‌న్ డాల‌ర్ల నిధిని కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. రిలీఫ్ ప్యాకేజీ గురించి ఉభ‌య‌స‌భ‌ల్లో ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తామ‌న్నారు. ఎటువంటి వ‌న‌రుల‌ను కూడా వ‌దిలేది లేద‌న్నారు. త‌న ఆదేశాల మేర‌కు కార్నివాల్‌, రాయ‌ల్ క‌రేబియ‌న్‌, నార్వేయ‌న్‌, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌ల‌ను 30 రోజుల పాటు నిలిపేసిన‌ట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ప్ర‌జ‌లు ఎక్క‌డ ఉన్నా.. విశ్వాసంతో అంద‌రి క్షేమం కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌ని కోరారు. వైర‌స్‌ను అతి సులువుగా ఎదుర్కోంద‌మ‌న్నారు. మార్చి 15వ తేదీన నేష‌న‌ల్ ప్రేయ‌ర్ డేగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. విప‌త్క‌ర స‌మ‌యాల్లో దైవ ర‌క్ష‌ణ కోసం కూడా ఎదురుచూసిన చ‌రిత్ర అమెరికాకు ఉన్న‌ద‌ని ట్రంప్ అన్నారు. ఎమ‌ర్జెన్సీ సేవ‌లు మ‌రింత త్వ‌ర‌గా అందేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌న దేశ ప్ర‌జ‌ల స్పూర్తి, ప‌ట్టుద‌ల బ‌ల‌మైన‌వ‌ని, ప్ర‌స్తుతం ఉన్న విప‌త్తును ఓడిస్తామ‌ని, అమెరికాకు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురైన స‌మ‌యంలో దేశం మ‌రింత పురోగ‌మించింద‌న్నారు. అమెరికా ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త‌తో ఉన్న‌ద‌న్నారు. క‌రోనా వైర‌స్ రెస్సాన్స్ యాక్ట్‌ను ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న డెమోక్రాట్లు, రిప‌బ్లిక‌న్ల‌ను కోరారు. ఈ బిల్లు ద్వారా ఉచితంగా క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు. క‌రోనా సోకిన ఉద్యోగుల‌కు పెయిడ్ లీవ్ ఇవ్వ‌నున్నారు. క‌రోనాపై ట్రంప్ యుద్ధం ప్ర‌క‌టించ‌డంతో.. వాల్‌స్ట్రీట్‌లో మార్కెట్ షేర్లు దూసుకువెళ్లాయి. అమెరికా కరోనా సోకిన వారి సంఖ్య 2100కి చేరుకున్న‌ది. 48 మంది మ‌ర‌ణించారు.
16. కరోనాకు 5వేల కోట్లైనా ఖర్చుచేస్తాం: కేసీఆర్‌
కరోనా అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వైరస్‌ సోకింది 65 మందికి అయితే.. 10 మంది కోలుకున్నారని.. ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని.. గాంధీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న మరో ఇద్దరి నమూనాలను పుణె పరీక్షా కేంద్రానికి పంపినట్లు చెప్పారు.
17. కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ఏడు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులను నేరుగా వికారాబాద్‌లోని హరిత రిసార్టుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను శనివారం అర్ధరాత్రి నుంచి 14 రోజులపాటు అక్కడ విడిగా ఉంచనున్నారు. ఒకవేళ ప్రయాణికుల సంఖ్య పెరిగితే.. హైదరాబాద్‌ పరిసరాల్లో అటవీ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను కూడా ప్రత్యేక వార్డులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందిని, ఔషధాలు, పరికరాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే నేరుగా గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రులకు తరలిస్తారు. లేనివారిని వికారాబాద్‌లో ఉంచుతారు.
18. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కరోనా భయం పట్టుకుంది. బెంగళూరులోని తమ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో శుక్రవారం ఇన్ఫోసిస్‌ ఐఐపీఎం కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. ఆ ఉద్యోగికి కొవిడ్‌-19 లక్షణాలున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తమ ఉద్యోగులను అప్రమత్తం చేసినట్లు ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పేర్కొంది. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ముందస్తు చర్యల్లో భాగంగానే తమ ఐఐపీఎం కార్యాలయాన్ని ఖాళీ చేయించామని ఇన్ఫోసిస్‌ అధికారి గురురాజ్‌ దేశ్‌పాండే వెల్లడించారు. అయితే ఉద్యోగులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా తాము సంసిద్ధంగా ఉన్నట్లు తమ ఉద్యోగులను అభ్యర్థించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, వదంతులు నమ్మవద్దని తమ ఉద్యోగులకు సూచించింది. ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో తమ కంపెనీ గ్లోబల్‌ హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించి సమాచారం పొందవచ్చనని పేర్కొంది. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలోఉన్న ఇన్ఫోసిస్‌ కార్యాలయ ప్రాంగణంలో ఈ కంపెనీకి చెందిన 12పైగా వివిధ కార్యాలయాలున్నాయి.
19. చైనా రాయబారికి అమెరికా నోటీసులు!
ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను అమెరికా సైనికులే చైనాలో వ్యాప్తి చేసి ఉంటారన్న చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ ట్వీట్‌పై అగ్రదేశం మండిపడింది. లిజియన్‌ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తమ దేశంలోని చైనా రాయబారి సుయీ టియాంకాయికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తక్షణమే తమతో భేటీ కావాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు అమెరికా ఆసియా వ్యవహారాల దౌత్యవేత్త డేవిడ్‌ స్టిల్‌వెల్‌ మాట్లాడుతూ.. ‘‘ తన ద్వారా ప్రపంచానికి అంటుకున్న వైరస్‌ గురించిన విమర్శలను చైనా పక్కదారి పట్టించేందుకు ఇలా వ్యవహరిస్తోంది. వైరస్‌ గురించి ముందే చెప్పలేదు. ఇక కుట్రపూరిత సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం వైరస్‌ కంటే ప్రమాదకరం. మేం వీటిని సహించబోం. చైనీయులు, ప్రపంచ జనాభా శ్రేయస్సు దృష్ట్యా నోటీసు ఇచ్చాం’’అని పేర్కొన్నారు
20. కరోనా ఎఫెక్ట్‌.. బెంగళూరులో ఇన్ఫోసిస్‌ భవనం ఖాళీ
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనావైరస్‌ సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్ని ఖాళీ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కొంత మంది సభ్యులకు కరోనా సోకినట్లు అనుమానం కలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్‌మెంట్‌ సెంటర్‌ హెడ్‌ గురురాజ్‌ దేశ్‌పాండే పేర్కొన్నారు. ‘సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా వ్యాపించిందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఐఐటీఎం భవనం ఖాళీ చేస్తున్నాం. మన ఉద్యోగుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీరు గుర్తించాలి. కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీరేమీ ఆందోళన చెందవద్దు. కరోనా వ్యాప్తి గురించి ఎలాంటి పుకార్లు అవాస్తవాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటిని నమ్మకండి.. ప్రచారం చేయకండి. మీరు బాధ్యతాయుతంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఉద్యోగులకు దేశ్‌పాండే మెయిల్ చేశారు. కరోనా వైరస్‌ నుంచి దూరంగా ఉండడానికి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోవ్‌ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని ఐటీ, బయోటెక్‌ కంపెనీలకు ఆదేశించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
21. కరోనా ఎఫెక్ట్‌..అమెరికా కాన్సులేట్‌ కీలక నిర్ణయం
కరోనా వైరస్ (కోవిడ్‌-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా కాన్సులేట్‌ కీలయ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇమ్మిగ్రెంట్‌, నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు వీసా సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది. వీసా అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ చేసుకోవాలని సూచించింది. భారత్‌లోని అన్ని అమెరికన్‌ కాన్సులేట్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. కాగా, కరోనా వ్యాప్తిని దృష్ట్యా అమెరికాలో శుక్రవారం ఎమర్జెన్సీ(నేషనల్‌ ఎమర్జెన్సీ) విధించిన సంగతి తెలిసిందే. కరోనా ప్రపంచ దేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. ఈ కోవిడ్‌–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. కరోనా ప్రకంపనలు భారత్‌లో కూడా విస్తరిస్తున్నాయి.ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు వైరస్‌ వ్యాప్తిని నిరోధించే దిశగా చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరు నగరం సహా కర్నాటక వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. షాపింగ్‌ మాల్స్‌ను, సినిమా థియేటర్లను, పబ్‌లు, నైట్‌ క్లబ్‌లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు.
22. వరంగల్‌ ఎన్‌ఐటీ స్కాలర్‌కు కరోనా నెగెటీవ్‌
వరంగల్‌ నిట్‌ స్కాలర్‌కు కరోనా వైరస్‌ నెగెటీవ్‌గా తేలింది. ఎన్‌ఐటీ విద్యార్థి ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఎంజీఎం ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌, పూణెకు పంపించారు. రక్తపరీక్షలో కరోనా నెగెటీవ్‌గా వచ్చినట్లు గాంధీ మెడికల్‌ కాలేజీ పేర్కొంది. దీంతో నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి. రమణారావు, ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మద్దతుగా నిలిచిన జిల్లా యంత్రాంగానికి, డీఎంహెచ్‌వో, ఎంజీఎం ఆస్పత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
23. జగిత్యాల కరోనా అనుమానితుడి రిపోర్ట్ వచ్చేసింది..
జగిత్యాలకు చెందిన కరోనా అనుమానితుడికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనుమానితుడిని వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపివేశారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇటీవలే అనుమానితుడు దుబాయి నుంచి వచ్చాడు. కరోనా లక్షణాలుండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
24. కరోనా ఎఫెక్ట్..స్కూళ్ల నుంచి పెళ్లిళ్ల దాకా అన్నీ బంద్ దేశంలో కరోనాకు ఇంకొకరు బలయ్యారు. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. కేసుల సంఖ్య 81కి పెరిగింది. దీంతో రాష్ట్రాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వైరస్ మరింత ముదరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, స్విమ్మింగ్పూళ్లు, బార్లను క్లోజ్ చేశాయి. కర్నాటక సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చేసింది. అంతేకాదు, ఎగ్జిబిషన్లు, సమ్మర్ క్యాంపులు, కాన్ఫరెన్సులను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అంతేకాదు, కరోనా ఎఫెక్ట్ పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలను వదల్లేదు. ఇకపై ఓ వారం పాటు రాష్ట్రంలో ఎలాంటి పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలను జరపొద్దని కరాఖండిగా తేల్చి చెప్పింది కన్నడ సర్కారు. శుక్రవారం సీఎం బీఎస్ యెడియూరప్ప రాష్ట్రంలో అన్నింటినీ వారం రోజుల పాటు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పబ్బులు, నైట్క్లబ్లన్నింటినీ మూసేస్తున్నట్టు చెప్పారు.
25. దేశంలో కరోనా రెండో మరణం నమోదైంది. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ వైరస్‌కు బలైంది. ఢిల్లీలో ఆరో కరోనా కేసుగా రికార్డయిన ఆమె.. కొద్ది రోజులుగా అక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి చనిపోయింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు ఆమె మరణాన్ని కన్ఫమ్ చేశారు. హాస్పిటల్ నుంచి తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 81కి పెరిగింది.ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఇటలీలో మరణాల రేటు దారుణంగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల మంది కొవిడ్‌కు బలయ్యారు. దాదాపు 1,32,000 మంది దాని బారిన పడ్డారు. వైరస్‌కు కారణమైన చైనాలో మరణాలు, కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 80,815 కేసులు అక్కడ రికార్డవగా, 3,177 మంది చనిపోయారు. ఇటలీలో చనిపోయిన వాళ్ల సంఖ్య వెయ్యి దాటేసింది. 1,016 మంది కొవిడ్‌కు బలయ్యారు. దాదాపు 15,113 కేసులు నమోదయ్యా యి. రెండు రోజుల క్రితం 10 వేల కేసులే ఉండగా, ఇప్పుడు 15 వేల మార్కును దాటేశాయి. ఇక ఇరాన్‌లో 514 మంది చనిపోయారు. దక్షిణ కొరియాలో 71, స్పె యిన్‌లో 120, ఫ్రాన్స్‌లో 61 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 41కి పెరిగగా.. పాజిటివ్ కేసులు 1,832 నమోదయ్యాయి.
26. వేల సంఖ్యలో కోళ్ల‌ను హ‌న‌నం చేసేందుకు కేర‌ళ ప్ర‌భుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో బ‌ర్డ్ ఫ్లూ సోకిన‌ట్లు గుర్తించారు. దీంతో కోళ్ల‌ను హ‌న‌నం చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే పౌల్ట్రీల్లో ఉన్న కోళ్ల‌ను చంపేందుకు ప్ర‌భుత్వ అధికారులు కొన్ని ద‌ళాలను ఏర్పాటు చేశారు. ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఈ ప్ర‌క్రియ చేప‌ట్టారు. బ‌ర్డ్‌ఫ్లూ కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వ‌ర‌కు ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఉన్న కోళ్ల‌ను హ‌న‌నం చేస్తున్న‌ట్లు డిసీజ్ ఇన్‌స్పెక్ష‌న్ ఆఫీస‌ర్ తెలిపారు.
27. మ‌హారాష్ట్ర‌లో ఇవాళ ఓ ఫెర్రీ బోటు బోల్తా ప‌డింది. ముంబై గేట్‌వే నుంచి మాండ‌వా వెళ్తున్న బోటు.. మార్గ‌మ‌ధ్యంలో బోల్తా కొట్టింది. అజంతా బోటులో ఉన్న 88 మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మాండ‌వా నుంచి బ‌య‌లుదేరి వెంట‌నే బోటు ఓ రాయిని ఢీకొట్టింది. రాయిని ఢీకొన్న త‌ర్వాత బోటులోకి నీరు ప్ర‌వేశించింది. దాంతో బోటు మున‌గ‌డం ప్రారంభ‌మైంది. మెరైన్ పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో.. అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. మునుగుతున్న బోటులో ఉన్న వారిని మ‌రో బోటులోకి ఎక్కించారు.
28. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)పై వస్తున్న వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీలో కరోనా నిరోధక చర్యలపై బులెటిన్‌ విడుదల చేశారు. ‘‘నెల్లూరు జిల్లాలో కొవిడ్‌-19 పాజిటివ్‌ బాధితుడు ఉన్నాడు. 14 రోజుల తర్వాత మళ్లీ నమూనాలు పరీక్షించి అతన్ని డిశ్చార్జ్‌ చేస్తారు. కొవిడ్‌-19 విషయంలో ఆందోళన చెందవద్దు. వదంతలు, నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దు. పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచాం. సమాచారం కోసం కంట్రోల్‌ రూమ్‌ నెం.0866-2410978ను సంప్రదించవచ్చు. కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే, సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లండి. వైద్య సలహాల కోసం 104 టోల్‌ ఫ్రీ ఏర్పాటు చేశాం.
29. కెనడా ప్రధాని.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు దేశ ప్రధానులను సైతం వణికిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కూడా ఈ వైరస్ బారిన పడింది. తన భార్య సోఫీకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనతో సహా ముగ్గురు పిల్లలకు కరోనా లక్షణాలు లేవని జస్టిన్ ట్రూడో తెలిపారు. కరోనా దృష్యా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను తన ఇంటి దగ్గర నుంచే ట్రూడే నిర్వహిస్తున్నారు. ప్రపంచ నాయకులతో ముఖ్యమైన చర్చలను తన ఇంటి నుంచే కొనసాగిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు ఇంటి నుంచే నిర్వహించడం వల్ల ప్రజా సమస్యలు తీర్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ట్రుడో చెప్పినట్లు బ్రిటన్‌కు చెందిన జాతీయ మీడియా పేర్కొంది. కెనడా ప్రభుత్వం అన్ని విదేశీ కార్యక్రమాలను రద్దు చేసుకుందని.. కేవలం పరిమిత సంఖ్యలో విమానాశ్రయాలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించిందని అధికారులు తెలిపారు. కరోనా వల్ల కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు 5 వారాలు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
30. ఢిల్లీలో కరోనా మృతి: కుటుంబ సభ్యుల ఆరోపణలు
శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) భయం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాణంతక వైరస్‌ ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది మరణించగా… లక్షలాది మంది కరోనా అనుమానితులుగా ఉన్నారు. దీంతో కరోనా పేషెంట్ల పేరు చెబితేనే అందరూ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కరోనాతో మరణించిన మహిళ అంత్యక్రియలకు శ్మశాన వాటిక నిర్వాహకులు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. సదరు మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమైన తమకు నిగంబోధ్‌ శ్మశానవాటికలో చేదు అనుభవం ఎదురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏం చేయాలో అర్థంకావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వార్తలు విస్తృతంగా ప్రచారం కావడంతో నిగంబోధ్‌ ఘాట్‌ నిర్వాహకులు దిగివచ్చినట్లు సమాచారం. రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో కరోనా పేషెంట్‌ శవానికి(సీఎన్‌జీ) అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది
31. కరోనాపై కోహ్లి స్పందన..
కరోనా వైరస్‌ కారణంగా ఈ నెల 29వ తేదీ నుంచి జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వాయిదా పడింది. వచ్చే నెల 15వ తేదీ వరకూ వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఐపీఎల్‌ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చిన బీసీసీఐ దానిని వాయిదా వేయక తప్పలేదు. కాగా, కరోనా వైరస్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలిసారి స్పందించాడు.
32. ప్రత్యేకంగా కరోనా సమాధులు.. అక్కడి నుంచి స్పష్టంగా
కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అక్కడ కొంత తగ్గుముఖం పట్టగా.. ఇరాన్‌లో మాత్రం విజృంభిస్తోంది. ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా 429 మంది మాత్రమే తమ దేశంలో చనిపోయారని చెబుతున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్‌లో సమాధులు తవ్వుతున్నారు. కాగా.. ఇరాన్‌లో ఇప్పటికే 10, 075 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. చైనాలో వెలుగు చూసిన కరోనా ప్రస్తుతం చైనాకు వెలుపల ఇరాన్‌లో ఎక్కువగా ప్రభావం చూపుతోంది. తాజాగా కొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు చూపించిన వాటి ప్రకారం ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 145 కి.మీ. దూరంలోని కోమ్ సిటీ వద్ద కరోనా సమాధులు తవ్వుతున్నారు. కరోనా మృతులను విడివిడిగా కాకుండా సామూహికంగా ఖననం చేశారు. ఒక్కో సమాధి 100 గజాల పొడవు ఉంది. ఈ సమాధులు అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని శాటిలైట్ చిత్రాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో పాత సమాధులను పూడ్చి కొత్తగా తవ్వుతున్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఇరాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఆ దేశం ప్రపంచ బ్యాంకును భారీ సాయం కోరుతోంది.
33. కరోనా ఎఫెక్ట్‌ : టీటీడీ సంచలన నిర్ణయం
ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్ మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించానలి టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది.
34.ఆర్ఎస్సేస్ సమావేశాలు రద్దు
బెంగళూరులో తలపెట్టిన అకిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రద్దు చేసింది. ఈనెల 15 నుంచి 17వరకు బెంగాలురులో ఆరెస్సెస్ సమవేశాల నిర్వహణ తలపెట్టింది కాగా కోవిడ్ వ్యాప్తి నేపద్యంలో పబ్లిక్ మీటింగ్ల పై కర్ణాటక ప్రభుత్వం నిషేదాజ్ఞలు విధించింది. ఈనేపద్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగాలురులో రేపు ప్రారంభం కానున్న ఆరెసెస్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సంఘ్ ప్రధాన కార్యదర్శి భయ్యాజి జోషి తెలిపారు.
35. కరోనా బారిన పడి సిక్కోలు వాసి మృతి
మూడురోజుల క్రితం కోవిడ్19(కరోన) లక్షణాలతో బహ్రయిన్ లోని ఆసుపత్రిలో చేరిన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం గ్రామానికి చెందిన బొడ్డపు చంద్రశేఖర్ నేడు మృతి చెందినట్లు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అక్కడి అధికారులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
36. కరోనా ఎఫెక్ట్. కర్ణాటకలో టోటల్ బంద్.
దేశంలో కర్ణాటకకు చెందిన 76 సంవత్సరాల ముసలాయన కరోనా వ్యాధితో చనిపోయిన మొదటి వ్యక్తి అని తేలడంతో. అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వారం పాటూ స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు, పబ్‌లు, మాల్స్ అన్నీ మూసివేయాలని నిర్ణయించింది…
37. కరోనా తో. కోళ్లు ఫ్రీ.
కామారెడ్డి జిల్లా లో కరోనా వైరస్ దెబ్బకు పౌల్ట్రీ రంగం విలవిలా కొట్టుకుంటోంది. చికెన్ తింటే వైరస్ వ్యాప్తి చెంది రోగం వస్తుందని పుకారు పుట్టడంతో చికెన్ తినడానికి జనాలు జంకుతున్నారు.. దీంతో కోళ్లు తినే వారు లేకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది.కోళ్లను ఏం చేయాలో తెలియకపోవడంతో తక్కువ ధరకు విక్ర‌యిద్దామ‌న్న కొనేవారు లేక ఫ్రీగా పంపిణి చేస్తున్నాడు ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు. తనకు సుమారుగా మూడు లక్షల యాభై వేల రూపాయల న‌ష్టం వ‌చ్చింద‌ని వ్యాపారి వాపోయాడు.
38. మంచిర్యాలలో కరోనా కలకలం రేపుతోంది. నస్పూర్‌కు చెందిన యువకుడికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువకుడు ఇటలీ నుంచి వచ్చినట్లు సమాచారం. మూడురోజులుగా ఆ యువకుడు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కరోనా అనుమానితుడిగా గుర్తించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మెరుగైన వైద్యాన్ని అందించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు…
39. టైం స్లాట్‌ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. భక్తులందరికీ టైం స్లాట్‌ టోకెన్ల ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. మంగళవారం నుంచి భక్తులను కంపార్టుమెంట్లలో కూర్చోనివ్వకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. తిరుమల వచ్చే భక్తులు తప్పకుండా తమవెంట గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. గంటకు 4500 మంది శ్రీవారిని దర్శించుకొనేలా టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. అందువల్ల భక్తులంతా నిర్ణీత సమయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు
40. కరోనా బారిన పడి సిక్కోలు వాసి మృతి
మూడురోజుల క్రితం కోవిడ్19(కరోన) లక్షణాలతో బహ్రయిన్ లోని ఆసుపత్రిలో చేరిన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం గ్రామానికి చెందిన బొడ్డపు చంద్రశేఖర్ నేడు మృతి చెందినట్లు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అక్కడి అధికారులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
41. కర్ణాటకలో టోటల్ బంద్.
దేశంలో కర్ణాటకకు చెందిన 76 సంవత్సరాల ముసలాయన కరోనా వ్యాధితో చనిపోయిన మొదటి వ్యక్తి అని తేలడంతో. అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వారం పాటూ స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు, పబ్‌లు, మాల్స్ అన్నీ మూసివేయాలని నిర్ణయించింది…
42. కరోనా తో. కోళ్లు ఫ్రీ.
కామారెడ్డిజిల్లాలో కరోనా వైరస్ దెబ్బకు పౌల్ట్రీ రంగం విలవిలా కొట్టుకుంటోంది. చికెన్ తింటే వైరస్ వ్యాప్తి చెంది రోగం వస్తుందని పుకారు పుట్టడంతో చికెన్ తినడానికి జనాలు జంకుతున్నారు.. దీంతో కోళ్లు తినే వారు లేకపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది.కోళ్లను ఏం చేయాలో తెలియకపోవడంతో తక్కువ ధరకు విక్ర‌యిద్దామ‌న్న కొనేవారు లేక ఫ్రీగా పంపిణి చేస్తున్నాడు ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు. తనకు సుమారుగా మూడు లక్షల యాభై వేల రూపాయల న‌ష్టం వ‌చ్చింద‌ని వ్యాపారి వాపోయాడు…
43. మంచిర్యాలలో కరోనా కలకలం రేపుతోంది. నస్పూర్‌కు చెందిన యువకుడికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువకుడు ఇటలీ నుంచి వచ్చినట్లు సమాచారం. మూడురోజులుగా ఆ యువకుడు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కరోనా అనుమానితుడిగా గుర్తించి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మెరుగైన వైద్యాన్ని అందించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు…
44. టైం స్లాట్‌ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. భక్తులందరికీ టైం స్లాట్‌ టోకెన్ల ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. మంగళవారం నుంచి భక్తులను కంపార్టుమెంట్లలో కూర్చోనివ్వకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. తిరుమల వచ్చే భక్తులు తప్పకుండా తమవెంట గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. గంటకు 4500 మంది శ్రీవారిని దర్శించుకొనేలా టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. అందువల్ల భక్తులంతా నిర్ణీత సమయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు
45. కరోనా కేసులు@ 84.. ఏడుగురి డిశ్చార్జి
దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 84కు చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా పాజిటివ్‌ అని తేలిన తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్న ఏడుగురిని డిశ్చార్జి చేసినట్లు ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అందులో యూపీ నుంచి ఐదుగురు, రాజస్థాన్‌, దిల్లీ నుంచి చెరొకరు చొప్పున కోలుకున్న అనంతరం డిశ్చార్జి అయినట్లు వివరించారు. కరోనా పాజిటివ్‌ అని తేలిన 84 మందితో సన్నిహితంగా మెలిగిన 4వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన విమానం శనివారం అర్ధరాత్రి ముంబయికి చేరుకుంటుందని తెలిపారు. ఇటలీ నుంచి భారతీయ విద్యార్థులను తెచ్చేందుకు శనివారం ఎయిరిండియా విమానం బయల్దేరనుందని చెప్పారు.
46. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఈనెల 31 వరకూ స్కూళ్లు, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ తెలిపారు. పరీక్షలు మాత్రం షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు. ఇప్పటివరకూ హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్క కొవిడ్‌-19 కేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదని అసెంబ్లీలో ఆయన తెలిపారు.
47. అన్ని యాపిల్‌ స్టోర్లు మూసివేత
కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా మార్చి 27 వరకు చైనా మినహా అన్ని దేశాల్లోని యాపిల్‌ స్టోర్లను మూసివేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనాలో చేపట్టిన చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రస్తుతం వైరస్‌ చైనా వెలుపల విజృంభిస్తోంది. కాబట్టి చైనా మినహా ఇతర దేశాల్లో ఉన్న మా సిబ్బందిని రక్షించేందుకు మార్చి 27 వరకు యాపిల్ స్టోర్లను మూసేందుకు నిర్ణయించుకున్నాం. యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ మాత్రం తెరిచే ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు సిబ్బంది ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. మూసివేత ఉన్నప్పటికీ సిబ్బందికి సాధారణ వేతనం లభిస్తుంది. కరోనా ప్రతిఒక్కరినీ ప్రభావితం చేస్తోంది. దీనిపై పోరాడుతున్న వైద్యులు, నిపుణులు, ప్రజా సేవకులకు, పరిశోధకులకు ధన్యవాదాలు’ అని కుక్‌ పేర్కొన్నారు.
48. లఖ్‌నవూలో మరో కేసు
కరోనా మహమ్మారి నానాటికి విస్తరిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో మరో కేసు నమోదైంది. ఇందిరానగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు కింగ్‌జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ నిర్ధారించింది. ఇంతకుముందు కరోనా పాజిటివ్‌గా తేలిన వైద్యురాలి నుంచి ఇతనికి వైరస్‌ వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని లఖ్‌నవూ వైద్యాధికారి నరేంద్ర అగర్వాల్‌ తెలిపారు. లఖ్‌నవూలో నమోదైన రెండో కరోనా కేసు ఇది.
49. కరోనా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను ‘విపత్తు’గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ వల్ల మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థికంగా ఆదుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పాటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరించనుంది.
50. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాలులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు, చేపట్టిన చర్యలపైనా సమీక్షించనున్నారు. ఈ భేటీలో మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు
51. కరోనా అనుమానితులు.. చెప్పకుండా వెళ్లారు!
మహారాష్ట్రలోని నాగపూర్‌లో కరోనా లక్షణాలు ఉన్న నలుగురు వ్యక్తులు సిబ్బందికి చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం కలకలం సృష్టించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వారిని గుర్తించి మళ్లీ ఆస్పత్రికి రమ్మని సూచించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్‌లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి శుక్రవారం ఉదయం నలుగురు వ్యక్తులు వచ్చారు. వారికి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించిన సిబ్బంది ఫలితం తేలే వరకు వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వారు సిబ్బందికి చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారికి ఫోన్‌ చేసి ఆరా తీసి.. వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించినట్లు తెలిపారు.
52. ఇంటికే పరిమితమైన ఇవాంక
కరోనా వైరస్‌ ధాటికి వివిధ దేశాల్లోని ప్రముఖ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో వైద్య పరీక్షలు చేయించుకోగా.. నెగెటివ్‌గా తేలింది. మరోవైపు ఇరాన్‌లో పలువురు నేతలు, ఉన్నతాధికారులు వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తులతో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కలిసినట్లు తేలడంతో ఆయనా పరీక్షలు చేయించుకోక తప్పదేమోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌తో భేటీ అయిన ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్‌ డుటన్‌కూ కరోనా సోకింది. దీంతో ఇవాంక ఇంటికే పరిమితమయ్యారు. అధ్యక్షుడికి సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆమె శుక్రవారం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. అయితే ఆమెలో వైరస్‌ లక్షణాలు ఏమాత్రం లేవని.. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’(సీడీసీ) వైద్యులు సూచించారు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆమె ఇంట్లోనే ఉన్నారని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
53. నాని సినిమాపై కరోనా ఎఫెక్ట్‌!
కరోనా వైరస్‌ ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా పడింది. రద్దీగా ఉండే షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లలో జనం అంతగా కనిపించడం లేదు. కరోనా విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని, థియేటర్లు బంద్ చేయాలని సూచిస్తే తప్పకుండా మూసివేస్తామని శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో నిర్వహించిన నిర్మాతల మండలి సమావేశంలో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నామని ‘వి’ చిత్ర బృందం ప్రకటించింది. తమ ఆధీనంలోలేని పరిస్థితుల కారణంగా మార్చి 25న రావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తాజాగా ప్రకటించింది.
54. కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి చూసే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంది. ప్రతి భక్తుడికి టైంస్లాట్‌ టోకెన్లు ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది. వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రకళషాభిషేకం, ఇతర విశేష పూజలు, ప్రత్యేక పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. గంటకు 4వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టీటీడీ పరిస్థితిని సమీక్షిస్తోంది. టాస్క్‌ఫోర్స్‌, కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కరోనా నివారణకు మార్చి 19 నుంచి 21 వరకు ధన్వంతరి మహాయాగం నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది.
55. ఆ వార్తలు నమ్మొద్దు
కరోనా వైరస్‌(కొవిడ్‌-19)పై వస్తున్న వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. శనివారం కరోనా నిరోధక చర్యలపై బులెటిన్‌ విడుదల చేశారు. ‘‘నెల్లూరు జిల్లాలో కొవిడ్‌-19 పాజిటివ్‌ బాధితుడు ఉన్నాడు. 14 రోజుల తర్వాత మళ్లీ నమూనాలు పరీక్షించి అతన్ని డిశ్చార్జ్‌ చేస్తారు. కొవిడ్‌-19 విషయంలో ఆందోళన చెందవద్దు. వదంతలు, నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దు. పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచాం. సమాచారం కోసం కంట్రోల్‌ రూ. నెం.0866-2410978ను సంప్రదించవచ్చు. కొవిడ్‌-19 లక్షణాలు ఉంటే, సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లండి. వైద్య సలహాల కోసం 104 టోల్‌ ఫ్రీ ఏర్పాటు చేశాం. కొవిడ్‌-19 ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి 675మంది వచ్చారు. వారంతా వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 428మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 233మందికి 28 రోజుల పరిశీలన పూర్తయింది. ఆస్పత్రిలో 14మంది చికిత్స పొందుతున్నారు. 61మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా, 52మందికి నెగెటివ్‌ అని తేలిసింది. 8మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాం. విశాఖ ఎయిర్‌పోర్టులో 8691మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశాం. వీరిలో 64మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయి. విశాఖ/గన్నవరం ఓడరేవులో 1088మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్‌ చేశాం. వీరిలో ఒక్కరికీ కూడా వ్యాధి లక్షణాలు లేవు. కృష్ణపట్నం ఓడరేవులో 622మంది ప్రయాణికులను స్క్రీనింగ్‌ చేశాం. వీరిలోనూ వ్యాధి లక్షణాలు లేవు. వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకపోయినా ఇళ్లల్లోనే ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్‌ను ధరించాలి’’ అని అన్నారు.
56. 145 దేశాలకు పాకిన కరోనా
కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పటి వరకు 145 దేశాలకు పాకింది. లక్షా 45 వేల 631 మంది వైరస్‌ బాధితులుగా మారారు. 5,423 మంది మృతి చెందారు. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తికి ఇప్పుడు ఐరోపా కేంద్రంగా మారిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే తమ సేవల్ని అందించాలని కోరింది. ఇక తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్‌ నగరంలో వరుసగా తొమ్మిదో రోజు వైరస్‌ బాధితుల సంఖ్య తగ్గింది. చైనాలో శుక్రవారం 11 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది మృతిచెందగా.. మరణించిన వారి సంఖ్య 3,189కు చేరింది.