Videos

కె.వి.మహదేవన్ జయంతి ప్రత్యేకం-ఆయన బాణీలు-TNI ప్రత్యేకం

KV Mahadevan Birthday Special-TNILIVE Special Videoa

1.ఆకలుండదు దాహముండదు….మంచివాడు 1974 ఖ్. వ్. మహదేవన్
2. సరిగంగ తానాలు జరిపించుదామంటే జననీ జన్మభూమి 1984 ఖ్. వ్. మహదేవన్
3. చిటికెయ్యవే చినదానా….రాధా కల్యాణం 1981 కె. వి.మహాదేవన్
4. ఆకలుండదు దాహముండదు….మంచివాడు 1974 ఖ్. వ్. మహదేవన్
5. ఓ బంగరు రంగుల చిలకా పలకవే…ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ…నా పైన అలకే లేదనీ…ఓ అల్లరి చూపుల రాజా పలకవా(తోటరాముడు-1975)
6. ఎంతో రసికుడు దేవుడు….రాజా రమేష్ చిత్రం నుండి ఆచార్య ఆత్రేయ సాహిత్యం-ఎ.ఎన్.ఆర్, వాణిశ్రీ
7. కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ (టూకీగా కె.వి.మహదేవన్) (1917 మార్చి 14 -2001 జూన్ 21) సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.‘మంచి మనసులు’, ‘ముత్యాల ముగ్గు’, ‘మూగ మనసులు’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘మనుషులు మారాలి’… ఇలా ఎన్నెన్నో మరపురాని చిత్రాలకి సంగీతం అందించిన గొప్ప స్వరకర్త కె.వి.మహదేవన్‌. తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నిరంతరం నానే పాటల్ని అందించిన ఘనత ఆయనది. యాభయ్యేళ్లకి పైగా సినిమా ప్రయాణం చేసిన ఆయన దక్షిణాది ప్రేక్షకుల్ని సుస్వర సాగరంలో ముంచెత్తారు. సినీ సంగీతాన్ని పరిపుష్టం చేశారు. 14 మార్చి, 1918లో కన్యాకుమారి జిల్లా, నాగర్‌ కోయిల్‌లో జన్మించిన కె.వి.మహదేవన్, 1942లో సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో 600 పైచిలుకు చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. తెలుగులో ‘లవకుశ’, ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘శ్రుతిలయలు’, ‘పెళ్ళి పుస్తకం’, ‘సప్తపది’, ‘స్వాతికిరణం’ తదితర ఆణిముత్యాల్లాంటి చిత్రరాజాలకి స్వర సొబగులద్ది చరిత్రని సృష్టించారు కె.వి. ఆయన రెండు జాతీయ పురస్కారాల్ని సంపాదించుకొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలకైతే లెక్కే లేదు. ఎంతో మంది గాయకుల్ని పరిచయం చేసి, వాళ్లకి జీవితాల్ని ప్రసాదించిన ఘనత కె.వి.సొంతం.