కొరోనావైరస్ నేపథ్యంలో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు తాత్కాలిక సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆయా విశ్వవిద్యాలయాల్లో విధనభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు నిరాశ్రయులు అవుతున్నారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థులకు సహకారం అందించేందుకు ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ హెల్ప్‌లైన్ ద్వారా అమెరికావ్యాప్తంగా 30మంది విద్యార్థులకు వసతి, భోజన తదితర ఏర్పాట్లు చేసినట్లు అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, పాలకవర్గ సభ్యుడు కొల్లా అశోక్‌బాబులు తెలిపారు. కొవిడ్-19 హెల్ప్‌లైన్ సాయం కోసం 1855-OUR-TANA నెంబరును సంప్రదించవచ్చు.
30మంది విద్యార్థులకు తానా హెల్ప్‌లైన్ సాయం
Related tags :