DailyDose

టోలీచౌకీలో మాస్ కాపీయింగ్-నేరవార్తలు

Madina College Tolichowki Under Raid For Mass Copying

* కాలేజీ యాజమాన్యాలు అండదండలతో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారనే కచ్చితమైన సమాచారంతో టోలిచౌకి లోని న్యూ మదీనా జూనియర్ కాలేజీ పై టాస్క్ఫోర్స్ పోలీసులు మరియు డిస్టిక్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లో కలిసి దాడి చేసి ఎనిమిది మంది మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కొక్క విద్యార్ధి వద్దనుండి ఐదు నుంచి ఎనిమిది వేల వరకు డబ్బును ఒక్క పేపర్ కోసం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు, పరీక్ష రాసే సమయంలో అందరిలాగానే వారికి కూడా సమాధాన పత్రాన్ని ఇచ్చి ఎగ్జామ్ లో కూర్చో పెడుతున్నారు. ఇదిలా ఉండగా డబ్బులు ఇచ్చిన విద్యార్థుల ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లను కళాశాల ఉపాధ్యాయులతో రాయించిన పిమ్మట చివరికి విద్యార్థుల చేతికి అందిస్తున్నట్టు ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు.

* విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో గల రామానంద నగర్ దొంగతనం అధికారి రాజశేఖర్ ఇంట్లో గత రాత్రి దొంగలు పడ్డారు మూడున్నర తులాల బంగారం 62 తులాల వెండి ఆభరణాలతో పాటు 75 వేల రూపాయలు క్యాష్ అపహరణ ఇంటి యజమానులు ఊరికి వెళ్లడంతో ఉదయం వచ్చి దొంగతనం జరిగినట్లు గుర్

* లీగల్ అడ్వైజర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ కావలి మునిసిపల్ ఉద్యోగి విషయం కలకలం రేపింది. కావలి మున్సిపాల్టీలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జంషేర్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది.

* బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని సూరత్‌ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌ ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా విమానంలో వచ్చిన గణేశ్‌ వలోద్రా అనే వ్యక్తి బ్యాగును కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగులో ఉన్న సూట్‌కేసు కవర్‌లో 500 గ్రాముల బంగారు రేకులు దాచినట్లు గుర్తించి..సీజ్‌ చేశారు.

* రేవంత్ రెడ్డి కోసం భారీ సంఖ్యలో చర్లపల్లి చేరుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు. కార్యకర్తలను చెల్లాచెదురు చేస్తున్న పోలీసులు. రేవంత్ రెడ్డిని జైలునుంచి ఎస్కార్టుగా ఆయన్ను ఇంటివద్ద దించే వ్యూహరచనలో పోలీసులు. రేవంత్ రెడ్డిని తరలించే రూటును గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.