Editorials

జనతా కర్ఫ్యూపై TNI కథనాలు

Special Coverage On Janata Curfew-TNILIVE Special Stories From India

*కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు!!రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు!!కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు కలిగిన దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించాడు

* కొనసాగుతోంది.చెన్నై, కోయంబత్తూర్‌, మధురై, తిరుచ్చిలో రవాణా పూర్తిగా స్తంభించింది.అయితే నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం కొన్ని షాపులకు మినహాయింపు ఇచ్చింది.కర్ణాటక, ఏపీ సరిహద్దులు మూసివేశారు.మెరీనా బీచ్‌ మూసివేశారు.మెట్రో, లోకల్‌ రైళ్లను అధికారులు నిలిపివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

* కరోనా తీవ్ర ప్రభావిత దేశమైన ఇటలీ నుంచి 263మంది భారతీయ విద్యార్థులతో బయల్దేరిన ప్రత్యేక విమానం దిల్లీకి చేరుకుంది. విమానంలో వచ్చిన వారందరినీ దిల్లీలోని ఐటీబీపీ ప్రత్యేక శిబిరానికి తరలించారు అధికారులు. వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

* రైల్వే బోర్డ్ అత్యవసర సమావేశందేశవ్యాప్తంగా ఈనెల 31 వరకు అన్ని రైళ్లను నిలిపివేయాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.రైళ్ల సంఖ్యను తగ్గించడం వల్ల కుదించిన రైళ్లలోనే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన రైల్వే.క్వారన్ టైన్ సెంటర్ల నుంచి తప్పించుకుని వెళ్లే వారు…రైళ్లలోనే వస్తున్నట్లు రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రైళ్లను రద్దు చేయడమే మేలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

* జిల్లాలోని మాడ్గి చెక్‌పోస్ట్‌ వద్ద ఓ ట్రావెల్‌ బస్సును అధికారులు అడ్డుకున్నారు.ఇటీవల మస్కట్‌ నుంచి ముంబయికి వచ్చిన 37 మంది వ్యక్తులు అక్కడి నుంచి సంగారెడ్డికి బస్సులో వస్తున్నారు.ఎవరికి సమాచారం లేకుండా చెక్‌పోస్టుల నుంచి తప్పించుకుని ఇలా బస్సులో వస్తున్నట్లు గుర్తించిన జిల్లా అధికారులు బస్సును మాడ్గి చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు.జిల్లాలోకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరందరికీ వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.

* రాష్ట్ర ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తికోవిడ్‌ –19 నివారణలో మీ సహకారాన్ని అర్థిస్తున్నాం.విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా కోవిడ్ లక్షణాలు బయట పడుతున్నాయి.వారిపట్ల జాగ్రత్రలు తీసుకోవాలని సూచిస్తున్నాము.విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా వైద్య ఆరోగ్యశాఖకు కచ్చితంగా సమాచారం అందించాలి.అందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూర్తిగా సహకారం అందించాలని కోరుతున్నాం.వైద్య, ఆరోగ్య సిబ్బంది వారిచ్చే సూచనల ప్రకారం విధిగా ఇంట్లో/హోం ఐసోలేషన్‌ పాటించాలి.వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూచనలు పట్టించుకోకుండా…, ఇంట్లో/హోం ఐసోలేషన్‌ పూర్తికాకుండా జనసంద్రంలో వారు తిరగడం వల్ల ప్రజా

* విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైందిజిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాముకరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రాంతంలో దాదాపు 500 ఇళ్ళలో మెడికల్ చెకప్ లు చేశాముమూడు కిలోమీటర్లమేర ప్రజలను అప్రమత్తం చేశాముఎవరెవరిని కలిశారో వారిని , ఇంట్లో వారివి శాంపిల్స్ సేకరించం.ప్రైవేట్ టాక్సీలో వచ్చిన వ్యక్తిని కూడా పరిశీలిస్తున్నాముప్రయువేట్ క్యాబ్ హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడినుంచి గపంటూరుకు ముగ్గురు ప్యాసింజర్లను తీసుకెళ్ళారుఅనుమానం ఉన్నవారు మా కంట్రోల్ రూంకి కాల్ చేయాలికరోనా కంట్రోల్ రూం ఏర్పాటు చేశాముకంట్రోల్ రూం నంబర్ 79952 44260సిపి ద్వారకా తిరుమలరావుకరోనా పాజిటీవ్ కేసు రావడంతో సిటీని హై అలర్ట్ చేశాము

* రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా కొనసాగుతుంది.ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు.9 డిపోల పరిధిలోని 960 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆటోలు సైతం బంద్‌లో పాల్గొన్నాయి.వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి.షాపింగ్‌ మాల్స్‌, చికెన్‌, మటన్‌ దుకాణాలను మూసివేశారు.ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.

* శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం ఇళ్లకే పరిమితమైంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని 5 డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కలేదు. 486 ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.కడపలో నిర్మానుష్యంగా రహదారులుజనతా కర్ఫ్యూతో కడపలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఇతర ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.మచిలీపట్నంలో జనతా కర్ఫ్యూజనతా కర్ఫ్యూతో మచిలీపట్నం ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. తెల్లవారుజాము నుంచే కర్ఫ్యూకు మద్దతుగా రోడ్లపైకి రావడం మానేశారు. అత్యవసర సేవలు మినహా… పెట్రోల్ బంకులు, మార్కెట్లు మూతపడ్డాయి.

* జనతా కర్ఫ్యూతో విజయనగరం నిర్మానుష్యంగా మారింది. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. మార్కెట్లు, షాపింగ్‌ మాళ్లు సహా అన్ని దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్టాండుకే బస్సులు పరిమితమయ్యాయి.

* అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

* కరోనా వైరస్ విజృంభణ నియంత్రణ లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా ప్రజలు తమకు తామే ఇళ్లలో ఉండాలని ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరిజిల్లా తుని లో ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉన్నారు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.ఆర్. టీ. సి.బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి.అత్యవసర మెడికల్ షాపులు మినహా మిగిలిన అన్ని షాపులు మూతపడ్డాయి.తునిలొ సెంటర్లు నిర్మానుష్యంగా మారాయి.

* కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం పూర్తిగా షట్ డౌన్ అయింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రాన్ని మార్చి 31 వరకు షట్ డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ ప్రభావంతో పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ప్రజలందరూ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. శనివారం అర్ధరాత్రి