Movies

కామెడీ చేస్తా

Actress Puja Hegde Latest News-Telugu Movie News

అబ్బాయిలే కాదు, అమ్మాయిలూ స్టాండప్‌ కామెడీ చేస్తున్నారు. అయితే, తెలుగులో ఫిమేల్‌ స్టాండప్‌ కమెడియన్లు తక్కువ. అమ్మాయిలు నిలబడి నవ్విస్తే ఎలా ఉంటుందో వెండితెరపై చూడమని పూజా హెగ్డే చెబుతున్నారు. అఖిల్‌ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మాతలు. పూజా హెగ్డే హీరోయిన్‌. ఆమె స్టాండప్‌ కమెడియన్‌ విభగా కనిపించనున్నారు. శుక్రవారం ఆమె ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘అఖిల్‌ లుక్‌కి అద్భుత స్పందన లభించింది. పూజ లుక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇద్దరి పాత్రలనూ దర్శకుడు బాగా మలిచారు. గోపీసుందర్‌ స్వరపరిచిన పాటల్ని త్వరలో విడుదల చేసి, ఏప్రిల్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆమని, మురళీ శర్మ, జయప్రకాశ్‌, ప్రగతి నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్‌.