Health

ఇండియాలో మొత్తం 562 కొరోనా కేసులు-TNI కథనాలు

COVID19 Coronavirus Today Daily Updates From India

* కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య,ఆరోగ్య శాఖ .ఏపీలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు .వచ్చేనెల 14 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ ఉత్తర్వులు .లాక్ డౌన్‍ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఆర్డీవోలకు ఆదేశాలు .ఆస్పత్రులు, మెడికల్ షాపులు మాత్రమే పని చేస్తాయి – అన్ని వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు మూసివేయాలని ఆదేశాలు .అన్ని రవాణా, వాయు, రైలు, రహదారి మార్గాలు మూసివేయాలని ఉత్తర్వులు .అన్ని ల్యాబ్‍లు 24 గంటలూ పని చేసేలా చర్యలు చేపట్టిన అధికారులు .కడప, విశాఖ, గుంటూరులో ప్రయోగశాలలకు పరికరాలు కొనుగోలు ఆదేశాలు

* కరోనా ఎఫెక్ట్ శ్రీసిటీలో లాక్ డౌన్ ఫర్ఫెక్ట్..శ్రీ సిటీ డిఎస్పి బి.హెచ్ విమలకుమారిస్వీయ నియంత్రణ పాటిస్తే చాలు కరో నాపై హైరానా అవసరం లేదునిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదుప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని చిత్తూరు జిల్లా శ్రీ సిటీ డిఎస్పి బి.హెచ్ విమలకుమారి అన్నారు..బుధవారం శ్రీసిటీ లోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… కరోనా వైరస్‌ కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.కరోనా నియంత్రణకు చాలా అప్రమత్తంగా ఉన్నామని.. రాబోయే రోజుల్లో మరింత సీరియస్‌గా వ్యవహరిస్తామని ఆమె పేర్కొన్నారు.కొంతమంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా పోలీసులను ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు.

* కరోనా భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 4 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి

* కొత్తగూడెం డిఎస్పీ ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్కొత్తగూడెం డిఎస్పీ కి కరోనా పాజిటివ్…డిఎస్పీ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన ఆరోగ్య శాఖ…డిఎస్పీ ఇంట్లో పని మనిషికి కూడా కరోనా పాజిటివ్…4 రోజుల క్రితం డిఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారించిన ఆరోగ్య శాఖ.

* ఈనెల 19న లండన్ నుంచి శ్రీకాళహస్తి చెందిన 25 ఏళ్ల యువకుడు రావడం జరిగిందని అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని అతనికి తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహానీ కి తెలిపారు.కరోనా వైరస్ కి సంబంధించి లాక్ డౌన్ కార్యక్రమం సంబంధించి ఈరోజు జరిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు డిజిపి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 206 వాహనాలను అను సీజ్ చేశారని 733 మంది ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా నడుచుకోవడం పట్ల వారిపై కేసు నమోదు చేశామని అదేవిధంగా మార్కెట్ల వద్ద ఉన్న ప్రజలను పంపడం జరిగిందని 144 సెక్షన్ అమలు చేయడం జరిగిందని చెప్పారుఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన లండన్ నుంచి వచ్చిన యువకుడు హోమ్ ఐస్లాషన్ లో ఉన్నారని, ఈ రోజు రక్త పరీక్షల నివేదిక వచిందని ఈ నివేదిక ప్రకారం అతనిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.వారి ఇంటికి 3 కిలోమీటర్ల చుట్టుకొలత గలప్రాంతాల్లో సర్వే చేయడం జరుగుతోందని అతని కదలికలపై వచ్చినా రోజు నుంచే నిఘా పెట్టామని ఆ వివరాలు బుధవారం సాయంత్రం లోగా పూర్తి నివేదిక సమర్పించగలనని కలెక్టర్,ప్రధాన కార్యదర్శి కి తెలిపారు.అలాగే లాక్ డౌన్ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామని ప్రజలకు చెప్పాలని అదేవిధంగా ఆసుపత్రులలో ఐస్లాషన్ వార్డులను సిద్ధం చేయాలని దాంతోపాటు నియోజకవర్గాల్లో qఊరంతినె ల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని సి ఎస్ కలెక్టర్ లను అడిగారు.ఎందుకు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా సమాధానమిస్తూ చిత్తూరు జిల్లాలో వీటి ఎంపిక పూర్తి అయిందని ఒకటి రెండు రోజుల్లో కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సిద్ధం చేస్తామని చెప్పారు.అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఉగాది పండుగకు వచ్చేవారిని అనుమతించాలని వారి పూర్తి వివరాలు సేకరించుకుని వారిని పంపాల్సి ఉంటుందని డిజిపి ఎస్సీలకు తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తో పాటు ఎస్పీ సెంథిల్ కుమార్, ఏ ఎస్పీ మహేష్ జాయింట్ కలెక్టర్2 చంద్రమౌళి,డి సి హెచ్ ఎస్ సరలమ్మ,ఉప వైద్యాధికారిని రమాదేవి తదితరులుపాల్గొన్నారు.

* కరోనా నేపథ్యంలో స్పాట్​ బిల్లింగ్​ను నిలిపివేస్తూ విద్యుత్​ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.గత మూడు నెలల సగటు విద్యుత్తు వినియోగాన్ని మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణించాలని విద్యుత్​ శాఖ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని వెబ్​సైట్​లో ఉంచుతుంది.ఆన్​లైన్​ ద్వారా బిల్లు మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారులకు సూచించింది.విద్యుత్​ వాస్తవ వినియోగం ప్రకారం బిల్లు మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటే తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది.మీటర్​ రీడింగ్​ ఆధారంగా విద్యుత్​ వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికీ వచ్చి అందిస్తున్నారు.కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా స్పాట్​ బిల్లింగ్​ నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు జేఎండీ చక్రధరబాబు తెలిపారు.

* COVID-19 Call Centers (24X7)

(1) Srikakulam_ 6300073203

(2) Vizianagaram- 08922-227950
9494914971

(3) Visakhapatnam- 9666556597

(4) East Godavari- 8841361763

(5) West Godavari- 08812-222376

(6) Krishna- 9491058200

(7) Guntur- 0863-2271492

(8) Prakasam- 7729803162

(9) SPSR Nellore- 9618232115

(10) Chittoor -9849902379

(11) YSR Kadapa- 08562-245259

(12) Anantapur- 08554-277434

(13) Kurnool -9441300005

State Control Room Number:
0866 2410978

* కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ కు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజల బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోతు సహకరిస్తున్నారు. దీనితో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి… ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రోడ్లమీద తిరుగుతున్నవారిని వీధులలో గుంపులుగా ఉంటున్నవారిని పోలీసులు చెదరకొడుతున్నారు ఇంతలా చెపుతున్నా నిర్లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి బయటికి వచ్చేవారిని అరెస్టు చేసి కేసులు బుక్ చేస్తామని పెద్దాపురం ద్స్ప్ శ్రీనివాసరావు సామర్లకోట మ్రొ జితేంద్ర తెలియ చేశారు

* పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కరోనా వైరస్ గురించి లాక్ డౌన్ లో భాగంగా పారిశుద్ధ్య పని వారికి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశ్యంతో స్థానిక 18 వ వార్డు దళితవాడలో శానిటేషన్ ప్రక్రియ పారిశుద్ధ్య పని వారలతో కలసి డ్రైనేజీలలోను, పబ్లిక్ టాయిలెట్ లలోనూ క్రిమిసంహారక మందును స్ప్రే చేశారు.

* పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి సమీపంలోని తాటియాకులగుడెం వద్ద ఆంధ్ర-తెలంగాణా సరిహద్దు చెక్ పోస్టు వద్ద ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కరోనా వైరస్ ను నిరోధించే చర్యలలో భాగంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు తమ సరిహద్దులను రెండు రోజులుగా మూసివేసాయి. దీనితో 516 జాతీయ రహదారి పై చెక్ పోస్టు లకు ఇరువైపులా వందలాది భారీ వాహనాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులు క్రమంగా పెరుగుతున్న కారణంగా ముందు జాగ్రత్తగా 21 రోజులపాటు నిరవధిక లాక్ డౌన్ ను ప్రధాని మోడీ ప్రకటించిన కారణంగా చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయిన వాహనదారులలో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. దీనితో తాము 21 రోజులపాటు ఇళ్ళు, వాకిలి, కుటుంబాలను వదలి చెక్ పోస్ట్ వద్ద రహదారిపై అనాధలలా గడపవలసి వస్తుందని గుర్తించిన డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందరూ కలసి ఇరు రాష్ట్రాల చెక్ పోస్టులలో వున్న సిబ్బందిని బలవంతంగా పక్కకు తోసివేసి తమ వాహనాలను తీసుకుని తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు. చెక్ పోస్ట్ లవద్ద వున్న బ్యారికేడ్ లను తొలగించి వెళ్ళిపోతున్న లారీలను నియంత్రించలేక చెక్ పోస్ట్ సిబ్బంది చేతులెత్తేయడంతో రెండు రోజులుగా రహదారిపై నిలిచి వున్న వందలాది వాహనాలు గంటల వ్యవధిలో సరిహద్దు దాటి వెళ్ళిపోయాయి.

* దేశంలో ఇప్పటివరకు మొత్తం 562 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ప్రస్తుతం 512 మంది బాధితులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 50 మంది కరోనా బాధితులు కోలుకున్నారని వెల్లడించింది.మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడం పాజిటివ్ వచ్చిన యువకుడితో కలిసి ఉన్న మరో ఇద్దరికి కరోనా వచ్చినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. భద్రాద్రి కొతగూడానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి, మరో వృద్ధురాలికి కరోనా సోకినట్లు వివరించింది. దీంతో తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది.

* కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించగా తాజాగా మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం రంగపేట గ్రామపంచాయతీ పరిధి శివారులో గ్రామ ప్రజలు మా ఊరికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు రావద్దంటూ నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి లాక్ డౌన్ ను పాటిస్తున్నారు.అంతేకాకుండా గ్రామాల ప్రవేశ ద్వారాలు, సరిహద్దుల్లో అడ్డుగా కట్టెలు, ముళ్ళకంచెలు, బారీకేడ్లు అడ్డుగా పెట్టి దారులను గ్రామాల ప్రజలు మూసివేస్తున్నారు.గ్రామ ప్రజలు గ్రామాన్ని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళవద్దంటూ నిర్ణయించుకున్నారు,ఈ మేరకు పలు పంచాయతీలు తీర్మాణాలు కూడా చేసినట్లు సమాచారం. కరోనా వైరస్ నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులకు రంగపేట గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

* కరోన వైరస్ నివారణకు మరియు సహాయ చర్యలకు కోసం కోటి రూపాయలు విరళంగా ఇచ్చిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

* కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. చైనాలో ఉద్భవించిన కరోనా.. క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 4.25లక్షల మంది దీని బారినపడగా.. 19వేల మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు… ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దు చేసింది. అంతేకాకుండా 21రోజులపాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ దినపత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టిడికి భారత ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాన్ని సమర్థించింది. అంతేకాకుండా.. అగ్రరాజ్యం అమెరికాలో లాక్‌డౌన్ ప్రకటిస్తే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అమెరికాలో 55 వేల మంది కొవిడ్-19 బారినపడగా.. 784 మంది మరణించారు. ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌కు మొగ్గచూపుతున్న వేళ.. ట్రంప్‌ కూడా లాక్‌డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ అమెరికాలో లాక్‌డౌన్ ప్రకటిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అభిప్రాయపడ్డారు. కరోనాతో కంటే.. లాక్‌డౌన్ వల్లే ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ దినపత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ భారత ప్రభుత్వ చర్యను అభినందించడం ఆసక్తిగా మారింది.

* వాసన, రుచి చూసే సామర్థ్యం తగ్గిపోవడమే కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు మొదటి సూచిక అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని అధ్యయనాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది స్క్రీనింగ్‌ సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పారు. శ్వాస సంబంధమైన వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల సాధారణంగా వాసన చూసే శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌తో కలిగే వాపు ప్రక్రియ వల్ల ముక్కులో గాలి ప్రవాహ తీరుతెన్నులకు అవరోధాలు ఏర్పడతాయి. తద్వారా వాసన చూసే సామర్థ్యం తగ్గిపోతుంది. ‘‘దక్షిణ కొరియా, చైనా, ఇటలీల్లో గట్టి ఆధారాలు లభించాయి. వైరస్‌ సోకినవారిలో వాసన చూసే శక్తి తగ్గిపోతోంది. దక్షిణ కొరియాలో 30 శాతం కేసుల్లో ఇదే ప్రధాన సమస్యగా ఉంది. ఇది మినహా వారిలో ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అందువల్ల కరోనా వైరస్‌ రోగుల్లో కనిపించే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు లేకున్నప్పటికీ అనుమానిత కేసులను ప్రాథమికంగా గుర్తించడానికి ఈ ‘వాసన పరీక్ష’ వీలు కల్పిస్తుంది’’ అని బ్రిటిష్‌ రైనోలాజికల్‌ సొసైటీ పేర్కొంది. రుచి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. అమెరికా నిపుణులు కూడా ఈ అంశాన్ని ధ్రువపరిచారు.