Food

పుచ్చకాయ పిచ్చిపిచ్చిగా తినేయండి

Eat Loads Of WaterMelon-Telugu Food And Diet News

వేసివిలో దొరికే పుచ్చకాయ తింటే కడుపు చల్లగా ఉండటమే కాదు. అందం రెట్టింపు అవుతుంది. పుచ్చకాయతో పొందే ఆరోగ్యం, కలిగే అందం గురించి తెలుసుకోవాలంటే ఈ కింది చిట్కాలు పాటించాలి.

*** అందం
వేసవిలో చర్మం ఎంతో పొడిబారిపోయినట్టుగా మారిపోతుంది. మందంగా తయరై చర్మం కాలిపోతున్నట్టుగా ఉంటుంది. వీటికి చెక్‌ పెట్టాలనుకుంటే పుచ్చకాయతో ఫేస్‌మాస్క్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి.
ఇందులోని 90 శాతం నీరు చర్మాన్ని తేమగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
పుచ్చకాయ రసం, కీర గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇక అంతే.. చర్మం నిగారించడమే కాకుండా చర్మాన్ని కాపాడుతుంది.

*** ఆరోగ్యం
డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం పుచ్చకాయ విత్తనాలు తింటుంటే.. షుగర్‌ అదుపులో ఉంటుంది.
హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలు తింటే బీపీ తగ్గుతుంది. బీపీ అదుపులోకి వస్తుంది.
పుచ్చకాయ విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి.
మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉంటాయని, విత్తనాలు నిత్యం తింటుంటే.. నేత్ర సమస్యలు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
పుచ్చకాయ తినడం వల్ల అంగస్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. పుచ్చకాయలోని సిట్రులైన్‌, ఆర్గినైన్‌ పదార్థాల వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇవి నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.