Movies

నేను పక్కా కమర్షియల్

Actress Rashmika On Rejections-Bollywood Jersey Movie Remake

నాని హీరోగా క్రికెట్‌ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా అత్యంత ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను హిందీ రిమేక్‌లో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఇక హిందీ ‘జెర్సీ’లో షాహిద్‌కు జోడిగా పలు హీరోయిన్లను దర్శక నిర్మాతలు సంప్రదించినట్లు వార్తలు రావడంతో.. షాహిద్‌ సరసన నటించే ఆ హీరోయిన్‌ ఎవరబ్బాని అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చుశారు. ఇక చివరకూ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే మొదట్లో ఈ సినిమా కోసం దక్షిణాది భామ రష్మికా మందన్నాను సంప్రందించగా ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రిపబ్లిక్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రష్మీక దీనిపై స్పందించారు. ‘జెర్సీ’ అవకాశాన్ని వదులుకోవడానికి గల కారణాలను చెబుతూ.. ‘అవును నేను జెర్సీలో నటించాడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పటీ వరకూ సినీ కేరీర్‌లో నేను ఎంపీక చేసుకునే సినిమాల ద్వారానే నాకు అవకాశాలు వచ్చాయి. అలా అని ‘జెర్సీ’ మంచి సినిమా కాదని కాదు. ఇప్పటి వరకూ నేను నటించినవన్ని కమర్షియల్‌ చిత్రాలే. షాహిద్‌ ‘జెర్సీ’ రియలిస్టిక్ చిత్రం. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం నేను కమర్షియల్‌ చిత్రాల్లోనే నటించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.