Kids

ఏపీలో పరీక్షలు లేకుండా పైతరగతులకు ప్రమోషన్

AP Govt Announces No Exams For Students

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్థి నేపథ్యంలో పాఠశాలలు మూత పడటంతో.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు.