Kids

10నెలల చిన్నారికి కొరోనా పాజిటివ్ వచ్చింది

10 Month Old Kid Tested For Positive-Telugu Kids News

కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుంది. తాజాగా మరో ఏడు కేసులు న‌మోదు కావ‌డంతో.. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 62కు చేరుకుంది. ఇందులో కోవిడ్ ప్ర‌భావంతో చ‌నిపోయిన‌వారు ముగ్గురు ఉండ‌గా, వ్యాధి త‌గ్గిపోయి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన‌వారు న‌లుగురు ఉన్నారు. కాగా కొత్తగా పాజిటివ్ వచ్చిన కేసుల్లో పది నెలల చిన్నారి కూడా ఉండటం తీవ్ర‌ ఆందోళన కలిగించే అంశం. ఆ బాబు పేరెంట్స్ ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాకు చెందిన‌వారు. వారికి ఎటువంటి ఫారెన్ ట్రావెల్ హిస్ట‌రీ కూడా లేదు. కాక‌పోతే ఇటీవ‌లే ఆ ఫ్యామిలీ కేరళ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంట‌నే అల‌ర్ట‌యిన అధికారులు..బాధితుల‌తో కాంటాక్ట్ అయిన ఆరుగుర్ని క్వారంటైన్ సెంట‌ర్ కు త‌ర‌లించారు.
ఇక మిగిలిన కేసుల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే… కొలంబో వెళ్లి మార్చి 15న బెంగళూరు తిరిగొచ్చిన 20 ఏళ్ల యువకుడికి , లండన్ నుంచి మార్చి 18న బెంగళూరు తిరిగొచ్చిన 25 ఏళ్ల యువతికి కూడా క‌రోనా పాజిటివ్ గా తేలింది. దుబాయ్‌కు వెళ్లి వచ్చిన ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. కరోనా పేషెంట్ (పి 25) ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళకు కూడా కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తుమకూరు జిల్లా నివాసి అయిన 60 ఏళ్ల వ్యక్తి (పి 60) కరోనావైరస్ కారణంగా మరణించారు. అతనికి విదేశీ ప్రయాణ చరిత్ర లేదు, కానీ 13 మార్చి 2020 న రైలులో ఢిల్లీకి ప్రయాణించిన చరిత్ర ఉంది. అతడితో సంబంధం ఉన్న‌ 24 మంది వివరాలను సేకరించిన పోలీసులు 13 మందిని ఐసోలేషన్ కి త‌ర‌లించారు. దీంతో క‌ర్ణాట‌క‌లో కోవిడ్ కార‌ణంగా చనిపోయినవారి సంఖ్య 3కు చేరుకుంది.