DailyDose

విజయవాడలో అమెచ్యూర్ రేడియో అన్నదానం

Amaterur Radio & Home Radio Donates Food To Poor In Vijayawada

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం పాఠకులకు విదితమే. ఈ లాక్ డౌన్ మూలంగా విజయవాడ నగరంలోని నిరుపేదలకు తమవంతు సహాయం చేయాలనే సదుద్దేశంతో నగరం లోని అమెచ్యూర్ రేడియో.. హామ్ రేడియో సభ్యులు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని శుక్రవారంనాడు ప్రారంభించారు. శుక్రవారం నాడు నగరంలోని కేదారేశ్వరపేట, బి.ఆర్.టి.ఎస్. ప్రాంతాలలో షుమారు 300 కు పైగా సాంబార్ అన్నం పొట్లాలను పంపిణీ చేశారు. ‘One World One Language-Ham Radio’ ‘ఒకే ప్రపంచం.. ఒకే భాష-అమెచ్యూర్ రేడియా’ స్లోగన్ తో ఇదేవిధంగా దాతల సహకారంతో ఈ లాక్ డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు ఆహార పొట్లాలను పంపిణీ చేయతలపెట్టినట్లు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన హామ్ రేడియో సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి (HAM Call Sign ‘VU3DIU’) తెలిపారు. ఇంకా ఈకార్యక్రమంలో సభ్యులు నాని, శ్రీను, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.